Solo Travel In India : సోలో ట్రిప్‌కి వెళ్లాలనుకుంటే ఇండియాలో బెస్ట్ ప్లేస్‌లు ఇవే.. ఈ ఏడాదైనా వెళ్లొచ్చేయండి
Best solo trips in India : కొత్త ఏడాదిలో అయినా ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇండియాలో సోలోగా ట్రిప్‌కి వెళ్లేందుకు ఏ ప్రాంతాలు అనుకూలమైనవో ఇప్పుడు చూసేద్దాం.
Top destinations for solo travelers in India : ఈ మధ్యకాలంలో జనాలు ప్రశాంతత కోసం ట్రిప్స్‌కి వెళ్తున్నారు. కుదిరితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వెళ్తారు. కానీ వారు ఎవరూ రాకపోయినా సోలోగా ట్రిప్‌కి వెళ్లాలనేది న్యూ ఇయర్ విష్లలో ఒకటిగా మారిపోయింది. మీరు కూడా ఇలా జర్నీ చేయాలనుకుంటే.. ఇండియాలో ఏవి ప్రాంతాలు సోలో ట్రిప్‌కి అనువైనవో? అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సంస్కృతి గురించి తెలుసుకోవాలన్నా.. ప్రకృతిని ఆస్వాదించాలన్నా.. కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు అన్ని ట్రావెల్‌తో వస్తాయి. సెల్ఫ్ డిస్కవరీ, అడ్వెంచర్స్, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఇండియాలో ఎన్నో బెస్ట్ ప్లేస్‌లు ఉన్నాయి. సోలోగా ట్రిప్‌కి వెళ్లాలనుకునేవారికి ఇవి అనువైనవి. ఇంతకీ ఆప్రాంతాలు ఏంటంటే..
హంపి (అడ్వెంచర్స్ కోసం) Hampi
అడ్వెంచర్స్, ఫ్రీడమ్ వంటి ఫీల్‌ని పొందాలనుకుంటే మీరు హంపి ట్రై చేయవచ్చు. కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఇది ఉంది. హైదరాబాద్ నుంచి 8 గంటల జర్నీలో మీరు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇక్కడ బ్యాక్‌ప్యాకర్ కమ్యూనిటీ మీకు అడ్వెంచర్, స్వేచ్ఛ వంటి అనుభవాన్ని ఇస్తుంది. పైగా ఈ ప్రాంతం సోలో ట్రిప్‌కి వెళ్లాలనుకునేవారికి అనువైనది.
కసోల్ (ట్రెక్కింగ్‌కి బెస్ట్) Kasol
హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లూలోని కసోల్ సోల్ ట్రిప్‌కి అనువైనది. ఇక్కడికి చాలామంది సోలో హైకర్స్, ట్రెక్కెర్స్ వస్తారు. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు అనువైనది. అంతేకాకుండా ప్రశాంతమైన వాతావరణం మీకు హాయిని, ప్రశాంతతను అందిస్తుంది.
పాండిచ్చేరి (Pondicherry)
పాండిచ్చేరి సోలో ట్రావెల్ చేసేవారికి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ మీరు ఫ్రెంచ్ స్ట్రీట్, పాండీ బీచ్, మ్యూజియం వంటి ఎన్నో ప్లేస్‌లు చూడొచ్చు. నచ్చిన వాటర్ గేమ్స్ ఆడుకోవచ్చు. హైదరాబాద్ నుంచి తక్కువ బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయొచ్చో.. దాని పూర్తి డిటైల్స్ ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ కింద లింక్ ఓపెన్ చేసి చెక్ చేయవచ్చు.
Also Read : హైదరాబాద్ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్‌కి ప్లాన్ ఇదే
వర్కలా (Varkala)
బీచ్‌లంటే ఇష్టముంటే మీకు కేరళలోని వర్కలా బీచ్ బెస్ట్ ఆప్షన్. అరెబియా సముద్రం, బ్యూటీఫుల్ లొకేషన్లు, ఆయుర్వేద చికిత్సలు మీకు మంచి రిలీఫ్‌ని ఇస్తాయి. ప్రశాంతంతను కోరుకునేవారికి ఇది కచ్చితంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
మనాలి (థ్రిల్ విత్ చిల్) Manali
థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, కొత్త సంస్కృతిని ఎక్స్ప్లోర్ చేయడం, చల్లని వాతావరణంతో కూడిన ఎక్స్‌పీరియన్స్‌ని సొంతం చేసుకోవాలనుకుంటే మనాలికి వెళ్లొచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్లినా.. సోలోగా వెళ్లినా మీరు బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియన్స్‌తో రిటర్న్ అవుతారు.
Also Read : అమ్మాయిలు సోలోగా ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే
జైసల్మేర్ (అథెంటిక్ ఎక్స్పీరియన్స్) Jaisalmer
రాజస్థాన్‌లో జైసల్మేర్ మీకు అథెంటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అడ్వెంచర్స్ అంటే ఇష్టముండి.. సోలోగా ట్రావెల్ చేయాలనుకునేవారు ఇక్కడ ఎడారికి వెళ్లొచ్చు. ఒంటె సఫారీలు, స్థానిక సంస్కృతి మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మరపురాని అథెంటిక్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు జైసల్మేర్ వెళ్లొచ్చు.
వారణాసి (ఆధ్యాత్మికం) Varanasi
మీకు ఆధ్యాత్మికం, దేవుడు, పూజలపై ఆసక్తి ఉంటే వారణాసి సోలోగా వెళ్లొచ్చు. ఫ్యామిలీతో వెళ్లినా సోలోగా వెళ్లినా మీకు మంచి ఎక్స్పీరియన్స్ సొంతమవుతుంది. గంగానది స్నానాలు, హారతులు మీకు మంచి ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తాయి. వారణాసి వెళ్లి వస్తే మీరు లైఫ్‌ని చూసే దృక్పథం మారిపోతుందట.
మరి ఇంకేమి ఆలస్యం మీరు కూడా ఈ ప్రదేశాలను 2025లో చుట్టేయండి. ప్రతి ప్రాంతం దేనికదే ప్రత్యేకం. అక్కడి వెళ్లి.. ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని అందం, ఆనందం, ఆహ్లాదం తెలుస్తుంది. మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకోవాలే గానీ.. ఏ ప్రాంతమైనా మీకు మంచి అనుభవాన్నే ఇస్తుంది. కొత్త సంవత్సరం ట్రావెల్ చేయడమే మీ లక్ష్యమైతే.. మీ దగ్గర్లోని ప్రాంతాలను కూడా సోలోగా విజిట్ చేయవచ్చు.