Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకం - అర్హతలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలివే!
Indiramma Housing Scheme: తెలంగాణలో 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల హామీలో ప్రకటించినట్టుగానే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది.
Indiramma Housing Scheme: తెలంగాణలో 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల హామీలో ప్రకటించినట్టుగానే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని భూమిలేని, నిరాశ్రయులైన ప్రజలకు ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం ప్రకారం,
- ఇళ్లు లేదా భూమి లేని వ్యక్తులకు ఇంటి నిర్మాణం కోసం ఉచిత భూమి/సైట్ ఇస్తారు.
- ఆర్థిక సహాయంలో భాగంగా రూ. 5,00,000 ఇంటి నిర్మాణం కోసం అవసరమైన వారికి అందిస్తారు.
- తెలంగాణ ఉద్యమ యోధులు లేదా కార్యకర్తలకు 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత, కాంగ్రెస్ మేనిఫెస్టో కింద అనేక పథకాలు ప్రారంభించారు. త్వరలో ఈ పథకాన్ని కూడా అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని నిరాశ్రయులైన ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ ఉద్యమంలో యోధుల పట్ల గౌరవం కల్పించే ఏకైక పథకం ఇదే. గత ప్రభుత్వ హయాంలో 14 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించగా, సుమారు 11 లక్షల మంది ఈ పథకానికి అర్హులని అంచనా వేశారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇళ్ల నిర్మాణ నమూనా మారింది. ప్రకటించిన ఖర్చు ప్రయోజనం ఎక్కువగా ఉన్నందున ఇది మరింత సౌకర్యవంతంగా, పెద్దదిగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని 2025లో సంక్రాంతి తర్వాత అమలుచేస్తారని భావిస్తున్నారు. కాబట్టి అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న లబ్ధిదారులందరూ పథకం నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఇందిరమ్మ ఇళ్లు అనేది ఇందిరమ్మ లేదా ఇంటిగ్రేటెడ్ నావెల్ డెవలప్‌మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, మోడల్ మునిసిపల్ ఏరియాస్ (ఇందిరమ్మ) స్కీమ్‌ని పోలి ఉంటుంది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్, ఈ పథకం కింద అందించే సారూప్య ప్రయోజనాలను మనం చూడవచ్చు.
కాంగ్రెస్ మేనిఫెస్టో కింద ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పథకం తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ప్రారంభించబడింది, అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో https://tshousing.cgg.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రయోజనాలను పొందవచ్చు.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కావల్సిన పత్రాలు
- ఆధార్ కార్డ్
- చిరునామా రుజువు లేదా నివాస ధృవీకరణ పత్రం
- ఆదాయ ధృవీకరణ పత్రం
- మొబైల్ నంబర్
- బ్యాంక్ ఖాతా వివరాలు
- పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
- రేషన్ కార్డు
- స్థలం పత్రాలు
ఎలా దరఖాస్తు చేయాలంటే..
- ప్రజా పాలన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
- ప్రజా పాలన దరఖాస్తు మొదటి పేజీలో మీ అభ్యర్థిత్వ వివరాలను నమోదు చేయండి.
- అప్లికేషన్ రెండవ పేజీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కాలమ్ చూడండి.
- మీరు ఇల్లు లేని వ్యక్తి అయితే 1.1లో టిక్ చేయండి
- మీరు తెలంగాణ రాష్ట్ర కుటుంబానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులైతే 2.2 వరుసలో టిక్ చేయండి. ఎఫ్ఐఆర్ (FIR) వివరాలతో సహా నమోదు చేయండి.
- దరఖాస్తుదారు కాకుండా మీ కుటుంబంలో ఎవరైనా తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసినట్లయితే మరణ ధృవీకరణ పత్రం నంబర్‌తో సహా వారి వివరాలను నమోదు చేయండి.
- చివరగా 4వ పేజీలో మీ పేరు, సంతకం చేయండి.
- మీ దరఖాస్తును మీ మండల గెజిటెడ్ అధికారికి అందించండి.
- తర్వాత గెజిటెడ్ అధికారి మీ దరఖాస్తుకు రిఫరెన్స్ నంబర్‌ను అందిస్తారు.
దరఖాస్తు చేయడానికి రెండవ పద్ధతి
- అధికారిక వెబ్ సైట్ https://tshousing.cgg.gov.in/ ను సందర్శించండి .
- మీరు హోమ్‌పేజీలో, "Apply Online" బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ పేరు, చిరునామా, ఆధార్ నంబర్ లాంటి ఇతర అవసరమైన సమాచారంతో సహా అన్ని సరైన వివరాలను అందించండి.
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
- పేజీ దిగువన ఉన్న “సబ్మిట్” బటన్‌ను క్లిక్ చేసి ప్రక్రియను పూర్తి చేయండి.
ఈ దశలను అనుసరించి మీరు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి విజయవంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతా వివరాలు
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హత పొందేందుకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా కింది ప్రమాణాలను పూర్తి చేయాలి.
- దరఖాస్తుదారు తప్పనిసరిగా తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
- దరఖాస్తుదారు తన పేరు మీద భూమి ఆస్తి లేదా ఇల్లు కలిగి ఉండకూడదు లేదా పూర్వీకుల ఆస్తిని పొంది ఉండకూడదు.
- రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- 250 గజాల భూమి పొందడానికి దరఖాస్తుదారు తెలంగాణ ఉద్యమ యోధులు లేదా ఉద్యమకారులలో ఒకరు అయి ఉండాలి.
ఇందిరమ్మ ఇళ్ల పథకం హెల్ప్ లైన్ నంబర్ - వెబ్ సైట్
వెబ్ సైట్
హైల్ప్ లైన్
stateportal@telangana.gov.in
https://mahalakshmischeme.in/contact-us/