అన్వేషించండి

Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే

Pondicherry Budget Trip : పాండిచ్చేరి అనేది ఇండియాలో ట్రావెల్​ చేయాలనుకునేవారి విష్​ లిస్ట్​లో కచ్చితంగా ఉంటుంది. అయితే దీనిని బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్​గా మార్చుకోవాలనుకుంటే ఇది మీకోసమే. 

Hyderabad to Pondicherry Budget Friendly Trip : వీకెండ్ సమయంలో లేదా ఇతర లీవ్స్ తీసుకున్నప్పుడు చిన్న ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు పాండిచ్చేరి ప్లాన్ చేసుకోవచ్చు. పైగా తక్కువ బడ్జెట్​తో మీరు ఈ ట్రిప్​ని కంప్లీట్ చేయవచ్చు. ఆరు వేల లోపు బడ్జెట్​తో పాండిచ్చేరి వెళ్లి.. అక్కడి అందాలను ఆస్వాదించవచ్చు. మరి ట్రిప్ డిటైల్స్ ఏంటి? టూర్​ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? బడ్జెట్ దేనికి ఎంత అవుతుంది? నిజంగానే ఆరు వేల లోపు ట్రిప్​ని కంప్లీట్ చేయవచ్చా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ట్రైన్ డిటైల్స్ (ప్లాన్ ఏ)

హైదరాబాద్​ నుంచి రోజూ ఓ లింక్ ట్రైన్ ఉంటుంది. అదే సికింద్రబాద్​ టూ గూడూర్. నారాయాణాద్రి ఎక్స్​ప్రెస్. ట్రైన్ నెంబర్ 12734. ఇది హైదరాబాద్​ నుంచి రోజూ అందుబాటులో ఉంటుంది. ఈ జర్నీ సాయంత్రం 6.10కి మొదలై.. తెల్లవారు జామున 3.42కి ముగుస్తుంది. దీని ధర 360 రూపాయలు. గూడూరు నుంచి పాండీకి డైరక్ట్ ట్రైన్ ఉంది. ఉదయం 6.40కి ఇది స్టార్ట్ అవుతుంది. 1.30కి పాండీకి రీచ్ అవుతారు. టికెట్ ధర 255 రూపాయలు. అయితే ఇది కేవలం మంగళవారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

హైదరాబాద్ టూ చెన్నై (ప్లాన్​ బి..)

రెండు మారడం ఎందుకు? మంగళవారం ప్లానింగ్ ఎలా లీవ్స్ అడ్జెస్ట్ కావు అనుకునేవారు.. హైదరాబాద్​ టూ చెన్నై ట్రైన్ జర్నీ చేయొచ్చు. చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ రోజూ ఉంటుంది. ట్రైన్ నెంబర్ 12604. సికింద్రబాద్ టూ చెన్నై వెళ్లొచ్చు. ఇది సాయంత్రం 5.10 నిమిషాలకు ప్రారంభమైతే.. ఉదయాన్నే 5.40కి మిమ్మల్ని గమ్యానికి చేర్చుతుంది. దీని టికెట్ ధర 420 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. చెన్నై నుంచి పాండీకి మీరు బస్​లో వెళ్లొచ్చు. నాన్ ఏసీ అయితే 150 రూపాయలు. ఏసి అయితే 400 రూపాయలు. 

స్టేయింగ్.. 

పాండీలో స్టేయింగ్​కి మంచి ఆప్షన్స్ ఉంటాయి. కొందరు హోటల్స్ తీసుకుంటారు. మరికొందరు హాస్టల్స్ తీసుకుంటారు. మీరు హాస్టల్ తీసుకుంటే.. ధర రూ.500 నుంచి ఉంటుంది. ఇక్కడ మీరు స్కూటీని కూడా రెంట్​కి తీసుకోవచ్చు. బైక్ రెంట్ రూ. 500. అలాగే ఫుడ్​కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓ పర్సన్​ బడ్జెట్ ఫుడ్​కి రోజుకి రూ.500 నుంచి 800 వేసుకోవచ్చు. 

Also Read : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం

చూడాల్సిన ప్రదేశాలు.. (Places to Visit in Pondicherry)

ఫ్రెంచ్ స్ట్రీట్ (White Town), పాండీ బీచ్, పాండిచ్చేరి మ్యూజియం, ఆరువెల్లి, మహాత్మ గాంధీ స్టాట్యూ, బొటానికల్ గార్డెన్, శ్రీ వరదరాజా పెరుమాల్ టెంపుల్, రాక్ బీచ్(Promenade Beach), ద స్కేర్డ్ హార్ట్ బాసిలికా, పారడైజ్ బీచ్, అరబిందో ఆశ్రమం, చర్చ్ (Eglise de Notre Dame des Anges) ఇలా నచ్చిన ప్లేస్​కి వెళ్లొచ్చు. నచ్చిన గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ వాటి ధరలు ట్రిప్ బడ్జెట్​కి వేసుకోకూడదు. మీరు ఆడాలనుకునే, ఎక్స్​పీరియన్స్ చేయాలనుకునే వాటికి తగ్గట్లు ధరలు ఉంటాయి. 

రిటర్న్ జర్నీ.. (Pondicherry to Hyderabad Journey)

పాండీ నుంచి హైదరాబాద్​కి డైరక్ట్ ట్రైన్స్ లేవు. కాబట్టి మీరు పాండీ నుంచి చెన్నైకి బస్​లో వెళ్లాలి. నాన్ ఏసీ అయితే 150 రూపాయలు. ఏసి అయితే 400 రూపాయలు. అక్కడి నుంచి సికింద్రాబాద్​కి ట్రైన్​ జర్నీ చేయాలి. సాయంత్రం 4.45కి మొదలైతే.. తర్వాతి రోజు ఉదయం 4.40కి సికింద్రాబాద్​లో ఉంటారు. MAS HYB SF EXP (12603). ఇది డైలీ ట్రైన్. దీని ధర రూ. 415. 

మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా వీలు కుదిరినప్పుడు హైదరాబాద్​ నుంచి పాండిచ్చేరికి ట్రిప్ వేసేయండి. 

Also Read : అమ్మాయిలు సోలోగా ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget