Best Winter Train Rides in India : వింటర్ ట్రిప్‌కి ఇండియాలో ఇవే బెస్ట్.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ మీ సొంతం
Winter Destinations : వింటర్లో ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారా? ట్రైన్లో ట్రావెల్ చేస్తూ బ్యూటీఫుల్ ఎక్స్పీరియన్స్ కోరుకునేవారికి ఇక్కడో లిస్ట్ ఉంది. మీరు కూడా ఈ వింటర్‌కి ప్లాన్ చేసుకోండి మరి.
Experience India's Most Scenic Winter Train Journeys : కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలే కానీ.. ట్రైన్ జర్నీతో మంచి ఎక్స్‌పీరియన్స్‌ని సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా వింటర్ సమయంలో (Winter Vacation 2024) ట్రైన్ జర్నీ చేస్తూ.. మంచి సీనరీలు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీనికోసం ఏ ఇతర దేశాలకో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇండియాలేన పలు ప్రాంతాలకు ట్రైన్లో వెళ్లి.. బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియన్స్‌ని మూటకట్టుకోవచ్చు. మరి వింటర్లో ఇండియాలో వెళ్లగలిగే మంచి ప్లేస్‌లు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని ప్రదేశాలకు మంచు పడుతున్నప్పుడు వెళ్తే.. మణిరత్నం సినిమాలను నేరుగా ఎక్స్పీరియన్స్ చేసిన ఫీల్ వస్తాది. ముఖ్యంగా స్నో ఫాల్ అవుతున్న సమయంలో వెళ్తే.. బ్యాక్‌గ్రౌండ్‌లో పరువం వానగా.. నేడు కురిసేనులే వినిపిస్తూ ఉంటాది. పైన్ ఫారెస్ట్లు, మిస్టీ వ్యాలీలు, మంచు వాలుజారే పర్వతాలు.. మీకు మంచి విజువల్ వండర్ని అందిస్తాయి. అలాంటి ప్రదేశాలు ఎక్కడున్నాయో.. ట్రైన్ జర్నీ చేయడానికి వింటర్లో ఏవి బెస్టో ఇప్పుడు చూసేద్దాం.
లడఖ్..
డిఫరెంట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే.. మీరు వింటర్లో లడఖ్ వెళ్లొచ్చు. మామూలుగానే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. వింటర్లో అయితే అది పీక్స్‌లో ఉంటుంది. ఆ సమయంలో మీరు మంచి వ్యూలు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. గడ్డకట్టిన సరస్సులు.. విశాలంగా ఉండే గ్రామాలు మిమ్మల్ని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడికి రైలులో వెళ్తే.. మంచి ల్యాండ్ స్కేప్లను చూడొచ్చు. ఇక్కడికి వెళ్లాలనుకుంటే ఢిల్లీ, కొలకత్త, ముంబై వంటి ప్రాంతాలనుంచి రెగ్యూలర్ ట్రైన్లు ఉంటాయి. హైక్స్ ఇష్టపడేవారికి, ట్రెక్ చేసేవారికి ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
సిమ్లా..
వింటర్లో సిమ్లాకి వెళ్లాలనుకుంటే మీరు టాయ్ ట్రైన్‌ని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఇక్కడ పైన్ ఫారెస్ట్లు.. మంచును చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఫ్రోజెన్ వాటర్ ఫాల్స్ కళ్లకు కనువిందు చేస్తాయి. ఈ టాయ్ ట్రైన్లో వెళ్తే మీరు 100 టన్నెల్స్, 800 బ్రిడ్జ్‌లు, 60 మైళ్ల దూరాన్ని కవర్ చేయవచ్చు. దీనికోసం మీరు కాల్క వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి సిమ్లాకు ఈ టాయ్ ట్రైన్లో వెళ్లొచ్చు.
డార్జిలింగ్
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే జర్నీ కూడా మీకు మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. టీ ప్లాంటేషన్స్ మీదుగా.. ఆకాశాన్ని తాకే పర్వతాలు మంచి వ్యూ ఇస్తుంటే.. ఈ ట్రైన్ జర్నీ అద్భుతంగా సాగుతుంది. అక్కడి హిల్స్, వ్యాలీలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. మీకు ఇది వింటర్లో వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంతేకాకుండా మీరు డార్జిలింగ్‌లో పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయవచ్చు.
కచ్
గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ అనే ఈ ప్రాంతం గుజరాత్లో ఉంటుంది. దీనిని మీరు వింటర్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వైట్ సాల్టెడ్ ఎడారిని వింటర్లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీనిగుండానే ట్రైన్ వెళ్తూ ఉంటుంది. మీరు విండోస్ నుంచి దీనిని చూడవచ్చు. కచ్చితంగా వర్త్ జర్నీ అవుతుంది.
మాథెరన్ హిల్ స్టేషన్
మాథెరన్ హిల్ స్టేషన్ కూడా మీకు మంచి సీనరీ జర్నీని అందిస్తుంది. పొగమంచులో హిల్స్ అందాలు మీ హృదయాన్ని కట్టిపడేస్తాయి. వెస్ట్రన్ ఘాట్లు కూడా చూడముచ్చటగా ఉంటాయి. ఇక్కడికి మీరు ట్రైన్లో వెళ్లేప్పుడు చుట్టూ ఉండే అందాలు మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి.
అయితే వింటర్లో మీరు వెళ్లేప్పుడు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మీరు ఔట్ఫిట్లను సెలక్ట్ చేసుకోవాలి. స్వెట్టర్లు, ష్రగ్స్, కోల్డ్ వెదర్‌కి తగ్గట్లు మీరు సేఫ్టి తీసుకుని వెళ్తే.. మంచి జర్నీని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు.
Also Read : అమ్మాయిలు సోలోగా ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే