Athomugam OTT Release Date: భార్య ఫోనులో భర్త స్పై యాప్ ఇన్‌స్టాల్ చేస్తే... ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చిన తమిళ థ్రిల్లర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Athomugam on OTT : ఐఎమ్‌డీబీలో 7 రేటింగ్ తెచ్చుకున్న థ్రిల్లర్ మూవీ 'అథోముగం' ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోందంటే...
ఎవరైనా భార్యను సర్ప్రైజ్ చేయాలంటే ఏదైనా మంచి గిఫ్ట్ ప్లాన్ చేస్తారు. కానీ ఓ భర్త మాత్రం ఆమె ఫోన్ లోనే ఏకంగా స్పై యాప్ ని డౌన్లోడ్ చేసి, సమస్యలు కొని తెచ్చుకుంటాడు. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన తమిళ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది.
ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్
తమిళ థ్రిల్లర్ మూవీ 'అథోముగం' ఓటీటీ (Athomugam OTT Update) ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఎస్పీ సిద్ధార్థ్, చైతన్య ప్రతాప్ జంటగా నటించిన తమిళ మూవీ 'అథోముగం'. ఈ సినిమాకు సిద్ధార్థ్ దేవ్ దర్శకుడిగా వ్యవహరించారు. 2024 మార్చ్ 1న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాకు మణికంఠన్ మురళి, శరన్ రాఘవన్ మ్యూజిక్ అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అనే అగ్ర నిర్మాణ సంస్థ ఈ మూవీని తమిళ్ లో రిలీజ్ చేసింది. అయితే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం వల్ల, సినిమాలు నటీనటులంతా కొత్తవారు కావడం వల్ల ఈ మూవీ ఆశించిన ఆదరణను దక్కించుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తమిళంతో పాటు మలయాళంలో కూడా అదే రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
9 నెలల తరువాత ఓటీటీ ఎంట్రీ
'అథోముగం' థియేటర్లలో రిలీజ్ అయిన 9 నెలల తర్వాత ఓటీటీలో అడుగు పెట్టడానికి సిద్ధమైంది. సాధారణంగా సినిమాలు ఓటీటీలోకి వచ్చిన 45 రోజుల తరువాత లేదా అంతకంటే ముందే ఓటీటీలో వస్తాయి. మూవీకి మంచి ఆదరణ దక్కితే థియేట్రికల్ రన్ ఎక్కువ కాలం నడుస్తుంది. లేదా ఆ మూవీ నెలలోపే ఓటీటీలోకి వస్తుంది. మరి ఈ మూవీ విషయంలో ఏమైందో తెలీదు గానీ ఓటీటీ రిలీజ్ చాలా ఆలస్యం అయింది. జనవరి 10న ఈ సినిమా ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆల్రెడీ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: అల్లరోడి మాస్ మూవీ స్ట్రీమింగ్ అప్డేట్... ఒక్కటి కాదు, మూడు ఓటీటీల్లో 'బచ్చలమల్లి'!
Twist-la Thrill konjam adhigam 😉💥#Athomugam Premieres from Jan 10th on namma@ahatamil@reelpettiprod @SunilDev_Dir @SPSiddarth02 @ChaitanyaPNair @AnanthNag24 @Im_Kavi @arunkumar2296 @iamvishnuv @SaraNRaghavaN @iam_sarithiran @divomusicindia @vjunstudios @urkumaresanpro pic.twitter.com/N1EQWVGeiJ
— aha Tamil (@ahatamil) January 8, 2025
భార్యను సర్ప్రైజ్ చేయడానికి స్పై యాప్...
ఇక 'అథోముగం' సినిమాలో మార్టిన్, లీనా ఇద్దరూ ప్రేమికులు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట సంతోషంగా ఉంటారు. సిద్ధార్థ్ ఓ టీ ఎస్టేట్లో పని చేస్తూ భార్యను చూసుకుంటాడు. అయితే తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా భార్యను సర్ప్రైజ్ చేయాలని భావించి, ఆమె మొబైల్లోనే ఆమెకే తెలియకుండా ఒక హిడెన్ స్పై యాప్ ను డౌన్లోడ్ చేస్తాడు. ఆ తర్వాత కథ కీలక మలుపు తిరుగుతుంది. అతను ఈ యాప్ ద్వారా తన భార్య ఎప్పుడు, ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? అనే విషయాలను క్షణక్షణానికి తెలుసుకుంటాడు. కానీ అదే సంతోషంగా ఉన్న వీరి జీవితాల్లో చిచ్చు పెడుతుంది. అప్పటిదాకా భార్యకు సంబంధించి తనకు తెలియని ఓ దిమ్మ తిరిగే విషయం సిద్ధార్థ్ కి ఈ యాప్ ద్వారా తెలుస్తుంది. మరి ఆ నిజమేంటి? ఈ జంట మధ్య ఆ యాప్ వల్ల ఎలాంటి సమస్యలు మొదలయ్యాయి? అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సింది. ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్టర్ ఆధునిక సాంకేతికత వల్ల మనుషులు ఎలాంటి ప్రమాదంలో పడతారు అనే విషయాన్ని ఈ కథ ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకున్నాడు.