X

Bone Soup Benefits: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...

నాన్‌వెజ్ ప్రియుల్లో చాలా మందికి బోన్ సూప్ అంటే మహా ఇష్టం. దాని వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆ ఇష్టం ఇంకా పెరుగుతుంది.

FOLLOW US: 

బోన్ సూప్... మటన్ లేదా చికెన్‌లోని ఎముకలతో తయారుచేసే సూప్. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయని చెబుతారు ఆహారనిపుణులు. బోన్ సూప్ కనీసం వారానికోసారైనా తాగడం అలవాటు చేసుకుంటే చాలా మంచిదంటున్నారు. ఘాటు తగ్గించి ఆ సూప్ ను పిల్లలకు తాగించినా వారిలో పోషకాహార లోపం తలెత్తదు. 

ఎన్ని ప్రయోజనాలు...
1. ఇందులో కెలోరీలు చాలా తక్కువగా ఉంటాయి. తాగితే పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇతర ఆహారాలు అధికంగా తినలేము. బరువు తగ్గాలనుకునే వారికి బోన్ సూప్ మంచి ఎంపిక. 
2. సూప్‌లో నీటి శాతం అధికంగా ఉంటుంది కనుక డీ హైడ్రేషన్ సమస్య ఏర్పడదు. 
3. దీనిలో అమినో ఆసిడ్ గ్లైకిన్ స్వల్ప మొత్తంలో ఉంటుంది. దీనివల్ల రిలాక్స్‌గా, ప్రశాంతంగా నిద్రపట్టేలా చేస్తుంది. 
4. ఈ సూప్‌లో కాల్షియం, ఇనుము, పొటాషియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. 
5. ఎముకల సూప్ వల్ల వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరంలో వాపు (ఇన్ ఫ్లమ్మేషన్)ను కూడా తగ్గిస్తుంది.

ఎలా చేయాలి?
మటన్ లేదా చికెన్ ఎముకలతో బోన్ సూప్ తయారుచేసుకోవచ్చు. రెండింటి రెసిపీ ఒకేలా ఉంటుంది. 

చికెన్ లేదా మటన్ ఎముకలు - 200 గ్రాములు
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూనులు
కొత్తిమీర తరుగు- రెండు స్పూనుల
మిరియాలు - అయిదు గింజలు
టొమాటో తరుగు - పావు కప్పు
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
ఉప్పు - రుచికి తగినంత
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

తయారు చేసే విధానం
ఉల్లిపాయ, అల్లంవెల్లుల్లి, మిరియాలు మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. మటన్ లేదా చికెన్ ఎముకలను శుభ్రం చేసి కుక్కర్లో వేయాలి. అందులోనే ముందుగా చేసుకున్న పేస్టు, టమాటో, పచ్చిమిర్చి, ఉప్పువేసి బాగా కలపాలి. రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికాక కుక్కర్ పై మూత తీసి కాసేపు స్టవ్ మీద ఉడికించాలి. మీరు వాడే నూనె ఓ అరచెంచాడు వేయాలి. ఓ అయిదు నిమిషాలు ఉడికించాక స్టవ్ కట్టేయాలి. పైన కొత్తిమీర చల్లి వేడివేడిగా తాగితే చాలా బావుంటుంది. 

Read Also:  కడుపునొప్పిని నిర్లక్ష్యం చేయద్దు... లివర్ సమస్య కావచ్చు

Read Also: సముద్రపు నాచుతో కరోనాను నిరోధించే ఔషధం తయారీ... కొత్త అధ్యయనం వెల్లడి

Read Also: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు

Read Also: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి

Read Also: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి

Read Also: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే

Read Also: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Benefits of Bone soup Bone soup Bone soup Recipe బోన్ సూప్

సంబంధిత కథనాలు

Dolo 650: డోలో పై మీమ్స్ మామూలుగా లేవుగా... సోషల్ మీడియాలో ఇప్పుడిదో సెలెబ్రిటీ

Dolo 650: డోలో పై మీమ్స్ మామూలుగా లేవుగా... సోషల్ మీడియాలో ఇప్పుడిదో సెలెబ్రిటీ

Shocking: ఏంది మచ్చా ఇది... లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేయడమేంటి? అది కూడా చేరిన రెండు గంటల్లోనే....

Shocking: ఏంది మచ్చా ఇది... లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేయడమేంటి? అది కూడా చేరిన రెండు గంటల్లోనే....

khasi Tribe: ఆ తెగలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులు... పెళ్లయ్యాక కూడా పుట్టిల్లే, అల్లుడే ఇల్లరికం వస్తాడు

khasi Tribe: ఆ తెగలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులు... పెళ్లయ్యాక కూడా పుట్టిల్లే, అల్లుడే ఇల్లరికం వస్తాడు

National Girl child Day: మీ ఇంటి ఆడపిల్ల ఏదైనా సాధించగలదు... అవకాశం ఇచ్చి చూడండి, పెళ్లి చేసి పంపేయకండి

National Girl child Day: మీ ఇంటి ఆడపిల్ల ఏదైనా సాధించగలదు... అవకాశం ఇచ్చి చూడండి, పెళ్లి చేసి పంపేయకండి

Heart Problems: గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే... ఈ చిట్కాలు పాటించాల్సిందే

Heart Problems: గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే... ఈ చిట్కాలు పాటించాల్సిందే

టాప్ స్టోరీస్

Gold Silver Price Today 25 January 2022 : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగా... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

Gold Silver Price Today 25 January 2022 : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగా... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

ఏటీఎంలో నకిలీ నోట్లు డిపాజిట్‌ చేసే ముఠా అరెస్టు.. కర్నూలులో కలకలం

ఏటీఎంలో నకిలీ నోట్లు డిపాజిట్‌ చేసే ముఠా అరెస్టు.. కర్నూలులో కలకలం

Petrol Diesel Price 25 January 2021: తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... హైదరాబాద్ లో మాత్రం స్థిరంగా...

Petrol Diesel Price 25 January 2021: తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... హైదరాబాద్ లో మాత్రం స్థిరంగా...

Horoscope Today 25 January 2022: ఈ రోజు కార్యాలయంలో ఈ రాశివారి ఆధిపత్యం పెరుగుతుంది, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి...

Horoscope Today 25 January 2022: ఈ రోజు కార్యాలయంలో ఈ రాశివారి ఆధిపత్యం పెరుగుతుంది, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి...