Baba Ram Dev on Waqf amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లు మత సామరస్యాన్ని పెంపొదిస్తుంది
Baba Ram Dev on Waqf amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు బాబా రాందేవ్ మద్దతు తెలిపారు. హిందూ- ముస్లిం అని సంబంధం లేకుండా అన్ని మతాల సామరస్యాన్ని ఇది మరింత పెంపొందిస్తుందన్నారు.

Baba Ram Dev on Waqf amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా బాబా రాందేవ్ గట్టి ప్రకటన చేశారు. హరిద్వార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశంలో హిందూ, మస్లిం, సిక్కు, క్రిష్టియన్లు, జైన్లు, బౌద్ధులు ఇలా అన్ని మతాలకు ఒకే రాజ్యాంగం ఉందని అలాగే అన్ని మతాలకు ఒకే విధమైన చట్టం కూడా ఉండాలన్నారు.
వక్ఫ్ సవరణపై చేసిన నూతన చట్టం ఈ విధానాన్ని మరింత బలపరుస్తుందని గురు రామ్ దేవ్ అన్నారు. శ్ర రామనవమి సందర్భంగా దివ్య యోగ మందిర్ (ట్రస్ట్), కృపాలు బాగ్ ఆశ్రమం, దివ్య యోగ మందిర్ రామ్‌ముల్ఖ్ దర్బార్‌లు ఒకటిగా కలిశాయి. దివ్య యోగ మందిర్. రామ్‌ముల్ఖ్ దర్బార్ పతంజలి యోగపీఠంలో విలీనమైంది.
"దేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు అందరికీ ఒకే రాజ్యాంగం ఉంది. వక్ఫ్ చట్టం అమలు ఈ వ్యవస్థను బలపరుస్తుంది. ఒకవేళ వక్ఫ్ చట్టం అమలు కాకపోతే, దేశంలోని వివిధ సముదాయాల నుంచి వేర్వేరు బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్లు వస్తాయి." అని వక్ఫ్ చట్టం గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు, . ఉత్తరాఖండ్ ప్రభుత్వం గ్రామాల పేర్లను మార్చడాన్ని కూడా స్వామి రాందేవ్ సమర్థించారు.
రాముడు తమ పూర్వీకుడే ముస్లింలకు తెలుసు
పశ్చిమ బెంగాల్‌లో రామనవమి ఊరేగింపులపై నిషేధం ఎత్తివేత గురించి మాట్లాడుతూ.. "ఓటు బ్యాంకు పోలరైజేషన్ కోసం రాజకీయ ప్రేరణతో ఇలాంటి ఆంక్షలు విధిస్తారు. రామనవమి, జన్మాష్టమి, ఈద్ వంటి మతపరమైన పండుగలపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు. భారతదేశం సనాతన భూమి, రాముడు, కృష్ణుడు, హనుమాన్, శివుడి భూమి. ఇక్కడ అందరికీ గౌరవం ఉంది. ఎవరూ ఎవరినీ ద్వేషించకూడదు. హిందుత్వం ఎవరినీ ద్వేషించదు. ముస్లింలు కూడా తమ విశ్వాసం, మతాన్ని పాటించాలి, కానీ వారికి కూడా రాముడు తమ పూర్వీకుడని తెలుసు," అని అన్నారు.
యోగ సంప్రదాయాన్ని కాపాడేందుకు విలీనం
విలీనం గురించి మాట్లాడుతూ.. "ముప్పై ఏళ్ల క్రితం మేం సన్యాసం తీసుకుని మా సంస్థకు దివ్య యోగ మందిర్ (ట్రస్ట్) అని పేరు పెట్టాం. యోగేశ్వర్ స్వామి రామ్ లాల్ జీ సంస్థ దివ్య యోగ మందిర్ రామ్‌ముల్ఖ్ దర్బార్ అప్పటికే ఉన్నాయని ఆ తర్వాతే మాకు తెలిసింది. ఈ రోజు రామనవమి సందర్భంగా ఈ రెండు సంస్థలు కలవడం చాలా సంతోషకరమైన సంగతి. యోగ సంప్రదాయాన్ని కాపాడేందుకు యోగాచార్య స్వామి లాల్ మహారాజ్ తమ సంస్థను పతంజలి యోగపీఠానికి సమర్పించారు," అని చెప్పారు.
"రాందేవ్ లాంటి యోగ ప్రచారం ఎవరూ చేయలేరు": స్వామి లాల్ మహారాజ్
దేశంలో యోగాకు ఇంతటి స్థాయిలో ఆదరణ రావడానికి ముఖ్య కారకుడు బాబా రాందేవ్ అని స్వామి లాల్ మహరాజ్ అన్నారు. ‘స్వామి రాందేవ్ మహారాజ్ యోగాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లిన తీరు ఇంతకు ముందు ఎవరూ చేయలేదు, ఇకముందు కూడా ఎవరూ చేయలేరు,’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పతంజలి యోగపీఠం జనరల్ సెక్రటరీ ఆచార్య బాలకృష్ణ దేశ ప్రజలందరికీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. "మన జీవితంలో, శక్తిలో, సేవలో, భావోద్వేగాల్లో రాముడిని మేల్కొలపాలి. అప్పుడే మనం ఐకమత్యంతో దేశ నిర్మాణం, సృష్టి కోసం కలిసి పని చేయగలం," అని అన్నారు.





















