Maruthi: మళ్ళీ సంక్రాంతికి మారుతి సినిమా... బాకీ తీర్చాలని!?
Maruthi New Movie: సంక్రాంతికి విడుదలైన 'ది రాజా సాబ్'తో దర్శకుడు మారుతి విమర్శలు మూట కట్టుకున్నారు. ఇప్పుడు రాబోయే సంక్రాంతికి మరొక సినిమాతో ఆయన రావడానికి రెడీ అవుతున్నారట.

Maruthi next movie after Raja Saab: సంక్రాంతికి విడుదలైన 'ది రాజా సాబ్' మీద దర్శకుడు మారుతి కోటి ఆశలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేశారు. తన పంథా మార్చారు. ఫాంటసీ హారర్ ఫిల్మ్ తీశారు. అయితే ఆ సినిమా రిలీజ్ తర్వాత విమర్శలు మూట కట్టుకున్నారు. ఆయనను ప్రభాస్ ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ ట్రోల్ చేశారు. పోగొట్టుకున్న చోట మళ్ళీ జెండా పాతాలని, బాక్సాఫీస్ బాకీ తీర్చాలని మారుతి డిసైడ్ అయ్యారట.
మళ్ళీ సంక్రాంతికి మారుతి...
'హే పొంగల్' - సినిమా టైటిల్!
Maruthi New Movie Titled Hey Pongalu: సంక్రాంతి 2025కి 'ది రాజా సాబ్'తో పాన్ ఇండియా థియేటర్లలోకి మారుతి వచ్చారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా తన సినిమా రిలీజ్ అయ్యేలా మారుతి ప్లాన్ చేశారట. ప్రస్తుతం ఆయన ఒక స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. దానికి 'హే పొంగల్' టైటిల్ ఖరారు చేశారట. సినిమా పేరును బట్టి సంక్రాంతికి విడుదల అయ్యే సినిమా అని చెప్పవచ్చు. ఇది అవుట్ అండ్ అవుట్ మారుతి మార్క్ కామెడీతో కూడిన సినిమా అని ఫిల్మ్ నగర్ టాక్.
మారుతి సినిమాలో హీరో ఎవరు?
పాన్ ఇండియా ఫిల్మ్ తర్వాత మారుతి ఏ సినిమా చేస్తారు? అనే ప్రశ్నకు సమాధానం లభించినట్టే. ఈసారి ఆయన వినోదాత్మక కథతో రాబోతున్నారు. ఆ సినిమాలో హీరో ఎవరు? అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
View this post on Instagram
మెగా ఫ్యామిలీతో మారుతికి మంచి అనుబంధం ఉంది. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అయితే చిరుకు ప్రజెంట్ ఉన్న లైనప్ చూస్తే ఆయన సినిమా చేయడం కష్టమే. సో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా ఓ సినిమా చేయడానికి మారుతి సన్నాహాలు చేస్తున్నారు. మరి, 'హే పొంగల్'లో ఆయన నటిస్తారా? లేదా? అనేది చూడాలి. చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి వరుణ్ తేజ్ రెడీ అవుతున్నారు. 'కమిటీ కుర్రోళ్ళు' ఫేమ్ యదువంశీ దర్శకత్వం వహించనున్నారు. ఆ సినిమాతో పాటు 'హే పొంగల్'ను కూడా వరుణ్ తేజ్ చేస్తారా? లేదంటే మరొక హీరో వస్తారా? అనేది చూడాలి.
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు





















