Virosh Wedding: విజయ్ - రష్మిక పెళ్లికి ఈషా రెబ్బా... ఆవిణ్ణి ఎందుకు పిలిచారు? ఎవరి కోటాలో వెళ్లారో తెలుసా?
The Wedding Of Virosh: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లికి ఉదయ్ పూర్ వెళ్లిన అతి కొద్దిమంది ప్రముఖుల జాబితాలో ఈషా రెబ్బా కూడా ఉన్నారు. ఆవిడ ఎవరి కోటాలో వెళ్లిందో తెలుసా?

Virosh Wedding Guest List: ది రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికా మందన్న పెళ్లికి ఉదయ్ పూర్ సిద్ధమైంది. కాబోయే కొత్త జంటతో పాటు కుటుంబ సభ్యులు, పురోహితులు, అతిథులు రాజస్థాన్ లోని వేదిక దగ్గరకు చేరుకున్నారు.
విజయ్ దేవరకొండకు 'అర్జున్ రెడ్డి' వంటి కల్ట్ క్లాసిక్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా వెడ్డింగ్ వెన్యూకు చేరుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'యానిమల్'లో రష్మిక నటించిన సంగతి తెలిసిందే. వధూవరులు ఇద్దరికీ సందీప్ రెడ్డి వంగా భారీ హిట్స్ ఇచ్చారు.
రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకు హీరో & ఫిల్మ్ మేకర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఆయన సైతం 'విరోష్ వెడ్డింగ్' గెస్ట్ లిస్టులో ఉన్నారు. ఆల్రెడీ ఉదయ్ పూర్ చేరుకున్నారు. అంతే కాదు... ఆ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్, విజయ్ దేవరకొండ & రష్మికలకు క్లోజ్ ఫ్రెండ్ శ్రావ్య వర్మ సైతం ఉదయ్ పూర్ చేరుకున్నారు.
ఈషా రెబ్బా ఎందుకు వెళ్లినట్టు?
విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నాల పెళ్లి 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' (The Wedding Of Virosh)కు హైదరాబాద్ సిటీ నుంచి ఉదయ్ పూర్ వెళ్లిన అతిథుల జాబితాలో కథానాయిక ఈషా రెబ్బా సైతం ఉన్నారు. విజయ్ దేవరకొండతో ఆవిడ సినిమాలు ఏమీ చేయలేదు. రష్మికతోనూ నటించలేదు. ఇంతకు ముందు వాళ్ళిద్దరికి సన్నిహితంగా మెలిగిన సందర్భాలు సైతం లేవు. మరి, ఆవిడ ఏ కోటాలో వెళ్ళింది? అని ప్రేక్షకులు కొంత మందిలో ప్రశ్న తలెత్తింది. విరోష్ వెడ్డింగ్ గెస్ట్ లిస్టులో ఈషా రెబ్బా ఎందుకు ఉన్నారంటే?
Also Read: Virosh Wedding: విరోష్ పెళ్లికి ప్రధాని మోడీ అభినందనలు... విజయ్ దేవరకొండ, రష్మికకు స్పెషల్ లెటర్
View this post on Instagram
విజయ్ దేవరకొండకు మొదటి హిట్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్. వాళ్లిద్దరూ కలిసి చేసిన 'పెళ్లి చూపులు' సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. 'పెళ్లి చూపులు' దర్శకుడు, ప్రస్తుతం కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తున్న తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)తో ఈషా రెబ్బా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వాళ్ళిద్దరి డేటింగ్ ఓపెన్ సీక్రెట్. 'ఓం శాంతి శాంతి శాంతిః'లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కలిసి నటించారు. సినిమా విడుదల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో పరోక్షంగా తమ ప్రేమను అంగీకరించారు తరుణ్. సమయం వచ్చినప్పుడు చెబుతానని తెలిపారు.
విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ మంచి స్నేహితులు. తనకు మొదటి హిట్ ఇచ్చిన దర్శకుడిని పెళ్లికి పిలవకుండా ఎలా ఉంటారు? పిలిచారు. తరుణ్ వెంట ఈషా రెబ్బాను సైతం ఆహ్వానించినట్టు సమాచారం. అదీ సంగతి! 'విరోష్ వెడ్డింగ్' పెళ్లిలో సందడి చేయబోయే ప్రముఖుల జాబితాలో ఇంకెవరు చేరతారో చూడాలి.























