అన్వేషించండి

NTR - Ravi Teja: ర‌వితేజతో అనౌన్స్ చేశారు... ఎన్టీఆర్‌తో సినిమా చేశారు... కెరీర్ టర్నింగ్ పాయింట్ సినిమా బ్యాక్‌స్టోరీ తెలుసా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ఓ సినిమాను ర‌వితేజ సినిమా చేయాల్సింది. ఆ సినిమా ఏది? ఆ కథ ఏమిటి? అనేది తెలుసుకోండి.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచిన సినిమాల్లో 'టెంప‌ర్' (Temper Movie) ఒక‌టి. వ‌రుస‌గా ఆరు డిజాస్ట‌ర్ల‌తో కెరీర్ డైల‌మాలో ప‌డిన టైమ్‌లో 'టెంప‌ర్‌'తో అదిరిపోయే క‌మ్‌ బ్యాక్ ఇచ్చాడు ఎన్టీఆర్‌. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆ సినిమాలోని ద‌యా పాత్ర‌లో ఎన్టీఆర్ మ్యాన‌రిజ‌మ్స్‌, డైలాగ్ డెలివ‌రీ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

'టెంపర్'లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్‌కు బాక్సాఫీస్ షేక్ అయ్యింది. పాన్ ఇండియ‌న్ హీరో దిశ‌గా 'టెంప‌ర్‌'తోనే ఎన్టీఆర్ తొలి అడుగు ప‌డింది.

'టెంపర్'లో హీరోగా ఫ‌స్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ కాదు!
ఎన్టీఆర్ (Temper background story)కు ఇంత‌గా క‌లిసొచ్చిన 'టెంప‌ర్‌'లో హీరోగా ఫ‌స్ట్ ఛాయిస్ మాత్రం ఆయన కాదు. 'టెంప‌ర్' క‌థ‌తో మాస్ మహారాజా ర‌వితేజ సినిమా చేయాల్సింది. అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసిన త‌ర్వాత ఈ సినిమా ఆగిపోయింది. ర‌వితేజ ప‌క్క‌న‌పెట్టిన క‌థ‌తో ఎన్టీఆర్ హిట్టు కొట్టారు.

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా
 
మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్‌లో రవితేజ 'ప‌వ‌ర్'...
ఆ కథే ఎన్టీఆర్‌తో 'టెంపర్'గా తీసిన పూరి!
'కంత్రి', 'బిల్లా' సినిమాల ఫేమ్ మెహ‌ర్ ర‌మేష్‌తో ఓ సినిమా చేయ‌డానికి ర‌వితేజ గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చారు. ఆ మూవీ కోసం ర‌వితేజ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా వ‌క్కంతం వంశీ ఓ ప‌వ‌ర్‌ ఫుల్ స్టోరీని రెడీ చేశారు. సినిమాకు 'ప‌వ‌ర్' అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. ర‌వితేజ మార్కెట్‌కు మించి బ‌డ్జెట్ అవుతుండ‌టంతో రిస్క్ అనే ఆలోచ‌న‌తో చివ‌రి నిమిషంలో నిర్మాత‌లు ప‌వ‌ర్ సినిమాను ప‌క్క‌న‌పెట్టారు.

Also Read: Balakrishna - Venkatesh: బాలయ్య vs వెంకీ... రెండు సినిమాల కథ ఒక్కటే, రిలీజ్ డే కూడా... బాక్సాఫీస్‌లో హిట్టు కొట్టిందెవరు?

సరిగ్గా ఆ టైమ్‌లో ఎన్టీఆర్‌తో సినిమా చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్న డైరెక్ట‌ర్‌ పూరి జ‌గ‌న్నాథ్ క‌థ‌ కోసం వ‌క్కంతం వంశీని అప్రోచ్ అయ్యార‌ట‌. పూరికి త‌న ద‌గ్గ‌ర ఉన్న చాలా క‌థ‌లు చెప్పాడ‌ట వ‌క్కంతం వంశీ. కానీ అవేవీ పూరికి అంత‌గా న‌చ్చ‌లేదు. దాంతో ర‌వితేజ కోసం సిద్ధం చేసిన 'ప‌వ‌ర్' క‌థ‌ను పూరికి వినిపించాడు. ఈ క‌థ పూరి జ‌గ‌న్నాథ్‌తో పాటు ఎన్టీఆర్ తెగ న‌చ్చింద‌ట‌. దాంతో ఈ క‌థ‌నే 'టెంప‌ర్' కోసం ఫైన‌ల్ చేశారు. ఎన్టీఆర్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా 'టెంప‌ర్' క‌థ‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాను తెర‌కెక్కించారు పూరి జ‌గ‌న్నాథ్. అలా ర‌వితేజ కోసం అనుకున్న క‌థ‌తో ఎన్టీఆర్ సినిమా చేసి బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు.

మెహ‌ర్ ర‌మేష్ చేయాల్సిన సినిమా టైటిల్ 'ప‌వ‌ర్‌'తోనే ఆ త‌ర్వాత కేఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్ష‌న్‌లో ర‌వితేజ ఓ మూవీ చేసి విజ‌యాన్ని అందుకోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read: Tollywood Flashback: చేతికొచ్చిన ఛాన్స్ మధ్యలో మిస్... ఛీత్కారాలు తట్టుకుని నిలబడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Releases : కపుల్ ఫ్రెండ్లీ To ఫంకీ - శుక్రవారం ఒకే రోజు ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్... ఫుల్ లిస్ట్ ఇదే
కపుల్ ఫ్రెండ్లీ To ఫంకీ - శుక్రవారం ఒకే రోజు ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్... ఫుల్ లిస్ట్ ఇదే
Naga Chaitanya: నాగ చైతన్య కొత్త సినిమా... హిట్ ఇచ్చిన దర్శకుడితో 25వ సినిమా?
నాగ చైతన్య కొత్త సినిమా... హిట్ ఇచ్చిన దర్శకుడితో 25వ సినిమా?
Collar Ey Etthara Lyrics: కాలర్ ఏ ఎత్తారా సాంగ్ లిరిక్స్... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా - ట్రెండింగ్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' పాట
కాలర్ ఏ ఎత్తారా సాంగ్ లిరిక్స్... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా - ట్రెండింగ్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' పాట
Allu Arjun - Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్ రాణించాలి -  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్ రాణించాలి -  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
Gas Charge In Hotel Bills: LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Iran Israel War: ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Embed widget