అన్వేషించండి

Hyderabad Rains: హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో వర్షాలు.. వచ్చే వారం నుంచి ఎండలతో దబిడి దిబిడే!

హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఫిబ్రవరి 28 నుంచి ఎండల తీవ్రత పెరుగుతుందని మెచ్చరించారు.

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తెలంగాణలో బుధవారం మధ్యాహ్నం వాతావరణం అకస్మాత్తుగా మారింది. గాలిలో ఉన్న మిగిలిన తేమ కారణంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తేలికపాటి వర్షమేనని,  గరిష్టంగా 5-10 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. 

రాబోయే రెండు గంటల్లో వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాంతాలు మినహా తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోకి పొడి గాలులు ప్రవేశించడంతో, ఈ వర్షాల తర్వాత వచ్చే వారం నుంచి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

తెలంగాణలో గత రెండు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పలుచోట్ల అకాల వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోకి పొడి గాలులు ప్రవేశించడంతో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఫిబ్రవరి 26 నుండి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, ముఖ్యంగా ఫిబ్రవరి 28 తర్వాత ఎండలు మరింత తీవ్రరూపం దాల్చుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. 

మార్చి మొదటి వారంలో హీట్ వేవ్..

మార్చి 2 నుండి 7వ తేదీ వరకు రాష్ట్రంలో హీట్ వేవ్ (వడగాల్పులు) వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా తూర్పు,  ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు నిప్పులు చెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఏకంగా 40°C మార్కును తాకే ప్రమాదం ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, నగర ఉష్ణోగ్రతలు 37°C దాటే అవకాశం ఉంది. ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరగనుండటంతో వచ్చే వారం నుండి కూలర్లు, ఏసీల వినియోగం పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. వచ్చే వారం నుంచి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
Rahul Gandhi Arrives in Hyderabad: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
Fake Ginger-Garlic Paste : బయట అమ్మే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? అవయవాలు కుళ్లిపోతాయా?
బయట అమ్మే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? అవయవాలు కుళ్లిపోతాయా?
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Deverakonda Rashmika : రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
Khamenei Net Worth: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
Ajith Kumar Madhavan : దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Suriya Venkya Atluri : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
Embed widget