Rasi Phalalu Today 9th April 2025: ఈ రాశులవారు షేర్ మార్కెట్లో డబ్బు పెడితే తీవ్రంగా నష్టపోతారు - ఏప్రిల్ 09 మేషం to మీనం రాశిఫలితాలు
Rasi Phalalu Today in Telugu 8th April 2025 : మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య తదితర రాశులకు ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

ఏప్రిల్ 09 బుధవారం రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశివారు తమ స్నేహితులతో మాట్లాడేటప్పుడు మాట తూలొద్దు...వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలు వస్తాయి. పాత స్నేహితులు , బంధువులను కలుస్తారు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
వృషభ రాశి
ఈ రాశివారు కెరీర్ గురించి పెద్ద నిర్ణయం తీసుకుంటారు కానీ ఎక్కడో మనసులో సందేహం ఉంటుంది. అయితే మీకు కుటుంబం నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. భూమి , వాహనం కొనుగోలుకి సంబంధించిన ప్రణాళికలు ఏర్పడతాయి. అభివృద్ధికి మార్గాలు సుగమం అవుతాయి. ధనలాభం నెమ్మదిగా ఉంటుంది.
మిథున రాశి
ఈ రోజు అదృష్టం మీ వైపు ఉంది. స్నేహితులు, కుటుంబం నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఏదైనా విషయంపై ధృఢ నిశ్చయంతో ఉండండి... దాని ఫలితం భవిష్యత్ లో కనిపిస్తుంది. అప్పులు వసూలు అవుతాయి. వ్యాపార ప్రయాణం విజయవంతం అవుతుంది. లాభదాయక అవకాశాలు లభిస్తాయి. శత్రు భయం ఉంటుంది.
కర్కాటక రాశి
ఈ రాశి అవివాహితులకు సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉండే వివాదాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారులు మీపై నమ్మకం ఏర్పరుచుకుంటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. అకస్మాత్తుగా ఖర్చులు పెరిగి ఒత్తిడి ఉంటుంది.
సింహ రాశి
కొన్ని రోజులుగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించండి. పార్టీల్లో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు.
కన్యా రాశి
వ్యాపారంలో నష్టం సంభవించే అవకాశం ఉంది, కాబట్టి డబ్బుకు సంబంధించిన పెద్ద నిర్ణయం తీసుకోవడం మానుకోండి. ఎవరితోనైనా డబ్బుకు సంబంధించిన విషయాలు మాట్లాడకండి. కొత్త ప్రణాళికలు ఏర్పడతాయి. గౌరవం పెరుగుతుంది. మాటలపై నియంత్రణ ఉంచుకోవడం మంచిది. స్త్రీలకు ఇబ్బందులు రావొచ్చు. పనిలో మీదే పై చేయి అవుతుంది.
తులా రాశి
మీ మనసు ఆధ్యాత్మికత వైపు ఉంటుంది. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ఆలయానికి వెళ్ళేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు. ఏదో తెలియని భయం ఉంటుంది. అనవసరంగా పరుగులు తీయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. చెడు వార్తలు వినాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి
కొన్ని రోజులుగా మీ మనసులో ఏదైనా విషయం ఉండి దాన్ని ఎవరితోనూ పంచుకోలేకుంటే ఈ రోజు అనుకూలమైన రోజు అవుతుంది. మనుసులో మాట స్పష్టంగా చెప్పండి. వివాదాలకు దూరంగా ఉండండి. లలావాదేవీలలో జాగ్రత్త వహించండి. చట్టపరమైన అడ్డంకులు తొలగుతాయి. దేవదర్శనం ఉంటుంది.
ధనుస్సు రాశి
ఎవరితోనైనా గొడవ పడే అవకాశం ఉంది, మీ మాటలపై సమతుల్యతను కాపాడుకోండి. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉండవచ్చు. ఆందోళన ఉంటుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. ప్రభుత్వ అడ్డంకులు తొలగుతాయి. శత్రువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి.
మకర రాశి
విద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి ఏదైనా విషయంపై విమర్శలు ఎదురవుతాయి. ప్రేమ సంబంధాలలో రిస్క్ తీసుకోవద్దు. వాహనాలు, యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇబ్బందుల్లో పడకండి. శత్రువులు ఓడిపోతారు. లాభం ఉంటుంది.
కుంభ రాశి
షేర్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే ఈ రోజు నష్టపోతారు కానీ సమయానికి లాభం వస్తుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు పలకరిస్తాయి. వ్యాపార ప్రయాణం విజయవంతం అవుతుంది. కుటుంబం గురించి ఆందోళన ఉంటుంది. లాభం ఉంటుంది, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.
మీన రాశి
ఈ రోజు అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఎక్కువగా ఆందోళన చెందవద్దు...త్వరలో మీరు ఆర్థికంగా లాభపడతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఇంట్లో - బయట అశాంతి ఉండవచ్చు. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఇబ్బందులు రావచ్చు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















