Virat Kohli Sledging: కోహ్లీని స్లెడ్జ్ చేసిన టీమిండియా పేసర్.. దీటుగా బదులిచ్చిన విరాట్.. ఆనాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న స్టార్ బ్యాటర్
2010 సీజన్ నుంచే తన దశ తిరిగిందని, అప్పటి నుంచే ఆర్సీబీలో తన స్థానం సుస్థిరం అయ్యిందని పేర్కొన్నాడు. ఇక గతంలో టీమిండియా పేసర్ తనను స్లెడ్జ్ చేయగా, దానికి దీటుగా బదులుచ్చినట్లు తెలిపాడు.

Kohli vs Ishant: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఒకే జట్టు తరపున ఆడిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు. లీగ్ అఫిషియల్ బ్రాడ్ కాస్టర్ జియో హాట్ స్టార్ తో కోహ్లీ తాజాగా మాట్లాడాడు. తన మనసులో మాట బయటపెట్టాడు. ఐపీఎల్లో ఎప్పుడు, ఎవరికీ చెప్పని విషయాన్నిపంచుకున్నాడు. ఒక మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ తాము మ్యాచ్ ఆడుతున్నామని, ఆ సమయంలో 223 పరుగుల టార్గెట్ ఛేజ్ చేస్తున్నట్లు తెలిపాడు. ఆ మ్యాచ్ లో అప్పటి టీమిండియా పేసర్ తనను చాలా స్లెడ్జ్ తీసుకున్నానని, దానికి తాను రిప్లై ఇచ్చానని పేర్కొన్నాడు. ఆ ప్లేయర్ తో కలిసి దేశవాళీల్లో ఒకే జట్టు తరపున ఆడామని గుర్తు చేశాడు. అయితే ఆ మ్యాచ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న ఆ పేసర్ ను ఎదుర్కోవడం తనకు కష్టంగా మారిందని పైగా, తనను పదే పదే స్లెడ్జ్ చేస్తూ చిరాకు తెప్పించాడని పేర్కొన్నాడు. దీంతో అతని దగ్గరికి వెళ్లి, ఒక మాట చెప్పినట్లు పేర్కొన్నాడు.
ఇంతకీ కోహ్లీ ఏమన్నాడంటే..?
నిజానికి ఆ పేసర్ మరెవరో కాదు.. లంబూ ఇషాంత్ శర్మ. దేశవాళీల్లో ఇద్దరు కలిసి ఢిల్లీ తరపునే ఆడేవారు. మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఇక ఆ సీజన్ కు ముందు ఇషాంత్, బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో చాలా బాగా పర్ఫామ్ చేశాడని, నూతన హెయిర్ స్టైల్ తో అట్టిట్యూడ్ తో కనిపించాడని పేర్కొన్నాడు. అయితే ఆ సీజన్ లో తామిద్దరం కలిసి మాట్లాడుకోలేదని, దీంతో ఒకరికొకరి మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందని తెలిపాడు. ఇక ఆ మ్యాచ్ లో పదే పదే స్లెడ్జ్ చేస్తున్న ఇషాంత్ వద్దకెల్లి, పక్కకు రా మాట్లాడుకుందామని ఆహ్వానించినట్లు కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయాడు.
ఆ సీజన్ నుంచే టర్నింగ్ పాయింట్..
2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ, తనకు టర్నింగ్ పాయింట్ 2010 సీజన్ నుంచే వచ్చిందని కోహ్లీ పేర్కొన్నాడు. అంతకుముందు తను ఆడినా, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కు పంపించేవారని, ఈ సీజన్ నుంచి తనను టాపార్డర్లో పంపించడంతో నిరూపించుకునేందుకు తనకు అవకాశం వచ్చిందని పేర్కొన్నాడు. ఇక తనెప్పుడు పరిస్థితులకు తగినట్లుగా బ్యాటింగ్ చేస్తానని, ఒత్తిడి నెలకొన్న పరిస్థితుల్లో ముందడుగు వేసేందుకు తానే ఇన్షియేషన్ తీసుకుంటానని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్ తో కలిపి కోహ్లీ 18వ సీజన్ ఆడుతున్నాడు. గత 17 ఏళ్లుగా కప్పు సాధించని ఆర్సీబీ.. ఈసారి ఎలాగైనా కప్పు సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18 కావడంతో 18 వర్సెస్ 18 అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సీజన్ లో కోహ్లీ కూడా సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు 3 సార్లు ఫైనల్ కు చేరినా ఆర్సీబీ కప్పు కొట్టలేక పోయింది. ఫైనల్స్ లో సన్ రైజర్స్ హైదరాబద్, చెన్నై సూపర్ కింగ్స్, డెక్కన్ ఛార్జర్స్ చేతిలో పరాజయం పాలైంది.




















