Pant Fake Fielding: పంత్ ఫేక్ ఫీల్డింగ్..! కేకేఆర్ ను బోల్తా కొట్టించాడా..? సోషల్ మీడియాలో రచ్చ
కేకేఆర్ పై పంత్ జాదూ ప్రదర్శించడంతోనే గెలిచిందంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించిన క్లిప్పింగ్ లను జత చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై పంత్ సమాధానం ఇవ్వాల్సి ఉంది.

IPL 2025 KKR VS LSG Updates: లక్నో సూపర్ జెయింట్స్ జోరు కొనసాగిస్తోంది. బ్యాట్ తో రాణించిక పోయినా తన కెప్టెన్సీతో టీమ్ ను రిషభ్ పంత్ ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పటవరకు ఐదు మ్యాచ్ లు ఆడిన లక్నో.. మూడింటిలో గెలిచి, రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి, పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. అయితే మంగళవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు పరుగులో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఫేక్ మెడికల్ టైమౌట్ తో పంత్ జాదూ ఏమైనా చేశాడా... అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ప్రత్యర్థి టీమ్ ముందంజలో ఉంటే, దాని మూమెంటం దెబ్బ తినేలా పంత్ టైమవుట్ తీసుకున్న చరిత్ర ఉంది. తాజాగా కోల్ కతా పైనా పంత్ అలాగే ప్రవర్తించాడనే ఆరోలపణలు వెల్లువెత్తుతున్నాయి. పంత్ టైమవుట్ కు సంబంధించిన క్లిప్పింగ్ తో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
"Just because you’re a big name doesn’t mean you hold on forever." 🧢🔥 Moeen Ali gets brutally honest on ageing Indian stars like Rohit & Dhoni still playing cricket. 👀
— cricketwebs (@cricketwebs_com) April 9, 2025
Time for self-reflection? ⏳#MoeenAli #RohitSharma #Dhoni #IPL2025 #IndianCricket #RetirementTalk #Cricket pic.twitter.com/J9Va6Snakb
ఇంతకీ ఏం జరిగిందంటే.?
ఆ మ్యాచ్ లో లక్నో బ్యాటింగ్ పవర్ తో 238/5తఓ సత్తా చాటింది. అయితే ఛేదనలో దీటుగా స్పందించిన లక్నో.. 234 పరుగులు చేసి, నాలుగు పరుగులతో ఓడింది. ఛేజింగ్ లో ఒకానొక దశలో కోల్ కతా దూసుకుపోయింది. 13 ఓవర్లలో 149/2 తో విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ దశల్ బ్యాక్ పెయిన్ తో మెడికల్ టైమవుట్ తీసుకున్నాడు. దీంతో కాస్త బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన కోల్ కతా వరుసగా ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి, ఓటమి పాలైంది. దీంతో పంత్ కావాలనే, కేకేఆర్ మూమెంటం దెబ్బ తినాలని ఇలా ప్రవర్తించాడని పేర్కొంటున్నారు. గతంలో పంత్ ఫొటోలను, పంత్ ప్రస్తుతం ఫొటోలను పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ లో..
ఇక టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పంత్ ఫేక్ మెడికల్ టైమవుట్ తీసుకున్నట్లు అతనే వెల్లడించినట్లు సమాచారం. ఒకనొక దశలో బంతికో పరుగు చేస్తే సౌతాఫ్రికా గెలిచి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పంత్ మోకాలి నొప్పితో మెడికల్ టైమవుట్ తీసుకున్నాడు. అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ.. పంత్ దగ్గరికి రాగా, ఊరికే నటిస్తున్నాని, ఫేక్ మెడికల్ టైమవుట్ తీసుకున్నట్లు అతనితో చెప్పాడు. దీంతో అప్పటి పరిస్థితులను గుర్తుకు తెస్తూ, కేకేఆర్ మ్యాచ్ ను పోలుస్తున్నారు. దీనిపై పంతే సమాధానమివ్వాలని కోరుతున్నారు. ఏదేమైనా తాజా ఫలితంలో మాత్రం లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్ మాత్రం చాలా హేపీగా ఉంది. ఈసారి ఎలాగైనా ఫ్లే ఆఫ్స్ చేరాలని పట్టుదలగా ఉంది.




















