స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ సింగ్.. ఇద్దరికీ ఎంత తేడా?
ఇంగ్లండ్ చేతిలో భారత్ గెలుపు అంచుల వరకు వచ్చి 4 పరుగుల తేడాతో ఓడిపోవడం మొత్తం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ని చాలా బాధపెట్టింది. అయితే ఆ ఓటమికంటే ఇంకా బాధపెట్టిన విషయం.. మ్యాచ్ ఓడిపోతున్నామనే సమయంలో డగౌట్‌లో కూర్చున్న స్మృతి మంధాన కన్నీళ్లు పెట్టుకోవడం. అయితే మ్యాచ్ తర్వాత.. స్మృతి, హర్మన్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓటమికి తనదే పూర్తి బాధ్యత అని మొత్తం బ్లేమ్ తనపైనే వేసుకున్న టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన.. తన వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని, చెత్త షాట్ సెలెక్షన్ వల్లే గెలిచే స్టేజ్‌లో ఓడిపోయామంది. ఇకపై ఇలాంటి తప్పు మళ్లీ జరగకుండా చూసుకుంటానన్నది.
స్మృతి ఇలా మాట్లాడటంతో ఫ్యాన్స్ అంతా ఆమెకి అండగా నిలుస్తున్నారు. అయితే అదే టైంలో.. కెప్టెన్ హర్మన్ చేసిన కామెంట్స్ అందరికీ షాకిచ్చాయి. మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా బాధ కలిగించిందన్న హర్మన్.. ఈ మ్యాచ్ ఓటమికి కారణం స్మృతి మంధానేనని.. క్రూషియల్ స్టేజ్‌లో ఆమె ఔటవ్వడం వల్లే ఓడిపోయామని అన్నది. ఈ కామెంట్స్‌తో చాలామంది ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.
బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలిలా టీమ్ కోసం స్మృతి ఆఖరి వరకు పోరాడింది. కానీ నువ్వు మాత్రం భల్లాలదేవలా చెత్త కెప్టెన్సీ చేసిందే కాక.. చివరికి ఓడిపోయి.. ఆ ఓటమి బాధ్యత కూడా తీసుకోకుండా స్మృతిపై నెట్టేస్తావా? అసలు టోర్నీలో నువ్వు ఒక్క మ్యాచ్ అయినా ఆడావా? టోర్నీ స్టార్టింగ్ నుంచి స్మృతి అద్భుతంగా ఆడుతోంది. మ్యాచ్‌ని ముందుండి నడిపించింది. అంటూ హర్మన్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.





















