(Source: Poll of Polls)
గంభీర్ వల్లే టీమిండియా ఓడింది: అశ్విన్
ఆస్ట్రేలియా టూర్‌ని టీమిండియా ఓటమితో మొదలుపెట్టింది. అయితే ఈ ఓటమి రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే.. 100 పర్సెంట్ కోచ్ గంభీర్‌దే అంటున్నాడు టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఆసీస్ చేతిలో టీమిండియా అంత దారుణంగా ఓడిపోవడానికి కోచ్ గంభీర్ తీసుకున్న చెత్త డెసిషన్సే కారణమని.. అసలు టీమ్ కాంబినేషనే సరిగా లేదని.. ముగ్గురు ఆల్‌రౌండర్లని టీమ్‌లోకి తీసుకోవడమే కాకుండా.. కనీసం ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేకుండా మ్యాచ్ ఆడటం నిజంగా పరమ చెత్త డెసిషన్ అని అన్నాడు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్.. 'నితీష్ రెడ్డితో పాటు ఇద్దరు స్పిన్నర్లను ఎందుకు ఆడిస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. బ్యాటింగ్ డెప్త్ కోసమే స్పిన్ ఆల్‌రౌండర్లు అయిన వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. కానీ బౌలింగ్‌పై కూడా కొంత దృష్టి పెట్టాలి. పెర్త్ లాంటి పెద్ద గ్రౌండ్స్‌లో కుల్దీప్ యాదవ్ స్వేచ్ఛగా బౌలింగ్ చేయలేకపోతే.. ఇంకెక్కడ చేస్తాడు? ఆసీస్‌లో ఓవర్ స్పిన్ ఉంటుంది. బౌన్స్ కూడా దొరుకుతుంది.
మరి అలాంటి టైంలో కుల్దీప్‌ని ఎందుకు ఆడించలేదు? పరుగులు చేయాల్సిన బాధ్యత బ్యాటర్లదే కాబట్టి బ్యాటింగ్ డెప్త్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.. కానీ ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను ఆడించడమంటే.. ఉన్న బ్యాటర్లపై నమ్మకం లేదా? ఇప్పటికైనా ఆలోచించి బౌలింగ్‌పై కూడా ఫోకస్ పెట్టండి. బ్యాటింగ్ డెప్త్ కోసం టీమ్ కాంబినేషన్‌ని దెబ్బతీయొద్దు’ అని చెప్పుకొచ్చాడు.





















