Kanigiri Gas : ఫుల్ గ్యాస్‌తో ఉన్న సిలిండర్ల లారీ బోల్తా.. ! ఒక్కటి లీక్ అయినా పెను విపత్తే.. కానీ
ప్రకాశం జిల్లా కనిగిరిలో గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. సిలిండర్లన్నీ చెల్లా చెదురుగా పడ్డాయి. గ్యాస్ లీక్ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
![Kanigiri Gas : ఫుల్ గ్యాస్‌తో ఉన్న సిలిండర్ల లారీ బోల్తా.. ! ఒక్కటి లీక్ అయినా పెను విపత్తే.. కానీ A lorry carrying a load of gas cylinders overturned in Kanigiri, Prakasam district. All the cylinders were scattered. The major accident was avoided as there was no gas leak. Kanigiri Gas : ఫుల్ గ్యాస్‌తో ఉన్న సిలిండర్ల లారీ బోల్తా.. ! ఒక్కటి లీక్ అయినా పెను విపత్తే.. కానీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/15/772376a7474940b2e656c53bbd894a30_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రోడ్డు ప్రమాదమంటేనే టెర్రర్. అలాంటిది రోడ్డు ప్రమాదం జరిగింది గ్యాస్ సిలిండర్ల లారీకి అని తెలిస్తే మామూలు టెర్రర్ కాదు. పైగా ఆ గ్యాస్ సిలిండర్లు అన్నీ ఫుల్ చేసినవే. ఎవరైనా ఆ దరిదాపుల్లోకి వెళ్లగలుగుతారా..? పొరపాటున ఒక్కటి పేలితే సీమ టపాకాయల్లా ఆ సిలిండర్లు అన్నీ పేలిపోతాయి. పొరపాటున వాటి మధ్య కాదుకదా.. దరిదాపుల్లో మనిషి అనే వాళ్లు ఉంటే ఆనవాళ్లు కూడా దొరకవు. అంత టెన్షన్ పెట్టిన ప్రమాదం.. ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలోని బల్లిపల్లి గ్రామం వద్ద జరిగింది.
కనిగిరి నుంచి పామూరుకు వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల లోడు లారీ బల్లిపల్లి వద్ద అదుపు తప్పి బోర్లా పడింది. అది మమూలు లారీనే కదా ఎవరో ఒకరు వచ్చి అందులో ఉన్న వారిని రక్షిస్తారని అనుకున్నారు కానీ.. ఎవరూ దగ్గరకు వెళ్లడానికి సాహసించలేకపోయారు. లారీలో ఉన్న సిలిండర్లన్నీ రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. కొన్ని సిలిండర్లు పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాయి. క్లియర్ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో గంటల తరబడి వాహనాలు ఆగిపోయాయి.
పెద్ద ఎత్తున శబ్దంతో లారీలోని సిలిండర్లు అన్నీ రోడ్డుపైన పడిపోయాయి. అసలే అనుమానంతో ఉండే జనం.. ఏ వాసన వచ్చినా గ్యాస్ వాసనలాగే ఫీలయిపోయి టెన్షన్ పడటం ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. అయితే ఏ ఒక్క సిలిండర్ కూడా లీక్ కాలేదని గుర్తించడంతో ఒక్కొక్కరుగా ధైర్యం కూడదీసుకున్నారు. జాగ్రత్తగా సిలిండర్లన్నీ తీసి ఓ పక్కగా పెట్టి.. ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో పాటు గుంతలు ఎక్కువగా ఉన్న కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి కల్వర్టును ఢీకొట్టినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. లారీలో ఉన్న వారికి పెద్దగా గాయాలు కాలేదు కానీ.. ఏదైనా ఒక్క సిలిండర్ లీక్ అయినా పెను విపత్తు ఏర్పడి ఉండేదని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: నో అంటే నో..లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ? వైఫ్ అయినా కట్ చేసేస్తుంది ! ఆ ఊళ్లో అదే జరిగింది !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)