Warangal Crime: రోడ్డు పనుల్లో బంగారు హారం దొరికింది... నాటకంతో నకిలీ బంగారం విక్రయం... వరంగల్ వచ్చి పోలీసులకు చిక్కారు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ బంగారాన్ని విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.10.45 లక్షల నగదుతో పాటు, ఐదు సెల్‌ఫోన్లు, నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మంగళవారం వివరాలు వెల్లడించారు. నిందితుల్లో ఒకరైన మోహన్‌లాల్ పాత బట్టలను కొనుగోలు వాటిని కొత్తగా మార్చి కేరళ, తమిళనాడు, మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అమ్మేవాడు. ఈ విధంగా నిర్వహించే వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో నిందితుడు మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవాడు. గత ఏడాది కరోనా కారణంగా బట్టల వ్యాపారం నడవకపోవడంతో నిందితుడు సులభంగా డబ్బు ఎలా సంపాదించాలనే ఆలోచన తన బంధువైన మరో నిందితుడు ధర్మతో కలిసి బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతామని చెప్పి నకిలీ బంగారాన్ని విక్రయించడం మొదలుపెట్టారు. నిందితులు రెండు కిలోల రోల్డ్ గోల్డ్ బంగారాన్ని కొనుగోలు చేసి, అక్టోబర్ 23న బెంగుళూరు నుండి వరంగల్ కు వచ్చి ఏనమామూల మార్కెట్ ప్రాంతంలో పురుగుల మందుల దుకాణానికి వచ్చారు. మారు పేర్లతో పరిచయం చేసుకుని తాము రోడ్డు పనులు చేసేందుకు వచ్చామని పరిచయం చేసుకోని పురుగు మందులను కొనుగోలు చేశారు.
నకిలీ హారం ఇచ్చి రూ.12 లక్షలు కొట్టేశారు
ఆ మరుసటి రోజు వచ్చిన నిందితులు తమకు బంగారు హారం దొరికిందని, డబ్బు అవసరమని నమ్మబలికి తక్కువ ధరకు అమ్ముతామని పురుగుల మందు దుకాణం యజమానిని నమ్మించారు. కావాలంటే బంగారు హారాన్ని పరీక్షించుకోమని చెప్పి తమ సెల్ ఫోన్ నంబర్ ఇచ్చారు. పురుగుల మందుల షాపు యజమాని పరీక్షించగా అది బంగారం అని తెలింది. దీంతో తక్కువ ధరకు పెద్ద మొత్తంలో బంగారం దొరుకుతుందని ఆశపడి వ్యాపారి అక్టోబర్ 29న ఖమ్మంలో నిందితులకు 12 లక్షలు అందజేశాడు. నిందితులు తమ వద్ద ఉన్న 2 కిలోల నకిలీ బంగారు హారాన్ని వ్యాపారికి అందజేస్తారు. ఇంటికి వచ్చి ఆ హారాన్ని స్వర్ణకారుడితో పరీక్షించగా అది నకిలీ బంగారం అని తేలింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు.
Also Read: నో అంటే నో..లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ? వైఫ్ అయినా కట్ చేసేస్తుంది ! ఆ ఊళ్లో అదే జరిగింది !
మళ్లీ వరంగల్ వచ్చి చిక్కారు
నిందితులు నకిలీ బంగారంతో వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తూ మరోసారి ఇలాంటి మోసానికి పాల్పడేందుకు వరంగల్ వచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోని తీసుకున్నారు. వారి వద్ద నుంచి డబ్బు, నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: గచ్చిబౌలిలో భారీ లూటీ.. ఇంట్లోకి వచ్చి ఫ్యామిలీనే బురిడీ కొట్టించి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి