Nagapur Fake Gang Rape : రేపిస్టుల కోసం నాగపూర్‌లో వెయ్యి మంది పోలీసుల ఆపరేషన్ ! చివరికి అసలు తప్పు చేసిన వారు స్టేషన్‌లోనే దొరికారు..
తనపై సామూహిత అత్యాచారం జరిగిందని నాగపూర్ పోలీసులకు ఓ యువతిఫిర్యాదు చేసింది. వెయ్యి మంది పోలీసులతో నిందితుల్ని పట్టుకోవడానికి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కానీ తేలిందేమిటంటే..?
తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని ఓ యువతి ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది..!. అంతే మరుక్షణం పోలీసులు మెరుపు వేగంతో కదిలారు. పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కదిలించారు. ఆమె చెప్పిన వివరాలతో శోధన ప్రారంభించారు. నేరగాళ్ల రికార్డులన్నింటినీ పరిశీలించారు. కానీ ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. వెయ్యి మంది పోలీసులు నగరం మొత్తాన్ని జల్లెడ పట్టారు. ఆరేడు గంట పాటు ఈ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. కానీ ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరకలేదు. యువతి అత్యాచారానికి గురైన విషయం బయటకు తెలియక ముందే నిందితుల్ని పట్టుకోవాలని పోలీసుల ప్రయత్నం కానీ... చిన్న క్లూ కూడా దొరకడం లేదు. అడుగడుగునా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీల్లోనూ ఎక్కడా ఆధారాలు దొరకలేదు. పోలీసు ఉన్నతాధికారులు తలలు బాదుకుంటున్నారు. ఇంత దారుణమైన వైఫల్యమా ? అని మథనపడుతున్నారు. కానీ ఓ కానిస్టేబుల్‌కు మాత్రం డౌట్ వచ్చింది. .. సార్ అసలు క్రైమ్.. అంటే అత్యాచారం జరిగిందా లేదా ?.. అని.
అప్పుడు పోలీసు ఉన్నతాధికారుల మెదడులో బల్బ్ వెలిగింది. అత్యాచారం జరిగిందని అమ్మాయి ఫిర్యాదు చేసింది.. నిందితుల్ని పట్టుకుని తీరాలన్న పట్టుదలతో రెండో ఆలోచన లేకుండా పోలీసులు పరుగులు పెట్టారు. ఆధారాల కోసం పట్టుదలగా ప్రయత్నించారు కానీ.., దొరకకపోయినా ఫిర్యాదు చేసిన అమ్మాయిని అనుమానించలేకపోయారు. చివరికి అనుమానం వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే అదే నిజం అయింది. అత్యాచారం జరగలేదు. ఆ యువతి ఫేక్ కంప్లయింట్ ఇచ్చినట్లుగా తెలింది. అచ్చం సినిమా సీన్ తరహాలో ఉన్న ఈ ఘటన నాగపర్‌లో జరిగింది.
Also Read: గచ్చిబౌలిలో భారీ లూటీ.. ఇంట్లోకి వచ్చి ఫ్యామిలీనే బురిడీ కొట్టించి..
నాగ్‌పూర్ చిఖ్కలిలో నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసినట్లు 19 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉదయం మ్యూజిక్ క్లాస్‌కు వెళ్తుండగా మార్గం మధ్యలో వైట్ కలర్ వ్యాన్‌లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు డైరెక్షన్లడిగే నెపంతో మాట్లాడుతూ, వ్యాన్‌లోకి బలవంతంగా లాగి, ముఖాన్ని గుడ్డతో కప్పారని తెల్పింది. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పిర్యాదులో పేర్కొంది. వెంటనే కమీషనర్ కుమార్ దాదాపుగా వెయ్యి మంది పోలీసులతో 40 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటుచేసి, సిటీలోని వ్యాన్‌లను, సీసీటీవీలను పరిశీలించారు. కానీ ఎక్కడా నేరం జరిగిన ఆనవాళ్లు దొరకలేదు. చివరికి యువతిని ప్రశ్నిస్తే నిజం చెప్పింది.
Also Read: Warangal: భార్య తోడు కోసం ఇద్దరు భర్తల పోరాటం.. మొదటి భర్తకు ట్విస్ట్, ఆ తర్వాత ఇద్దరికీ షాక్!
బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడటానికి ఇలా చేశానని ఆమె పోలీసులకు చెప్పింది. ఆరు గంటలపాటు సీసీటీవీ ఫుటేజీల పరిశీలన, దాదాపు 50 మందిని విచారించిన తర్వాత అనుమానం వచ్చిన పోలీసులు యువతిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తన బాయ్ ఫ్రెండ్‌ను వివాహం చేసుకోవడానికే ఈ నాటకమంతాడినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. ఇలాంటి ఫిర్యాదుల వల్లే పోలీసులకు నేరస్తుల కోసం వేటాడాలనే ఇంట్రస్ట్ పోతుందని డిపార్టుమెంట్ నిట్టూరుస్తోంది.
Also Read: Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ మూలాలు తెలుసా.. వాళ్లు నరరూప రాక్షసులుగా ఎందుకు మారారు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి