News
News
X

Warangal: భార్య తోడు కోసం ఇద్దరు భర్తల పోరాటం.. మొదటి భర్తకు ట్విస్ట్, ఆ తర్వాత ఇద్దరికీ షాక్!

ఒకే మహిళ కోసం ఇద్దరు భర్తలు గొడవపడుతున్న ఘటనతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఆమె నా భార్య అంటే నా భార్య అని ఇద్దరు భర్తలు పోలీసు స్టేషన్ మెట్లెక్కారు.

FOLLOW US: 

ఆమెకు పెళ్లై 22 ఏళ్లు గడిచింది. ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది.. సంతోషకరమైన కుటుంబాన్ని వదిలి తనకు నచ్చిన మరోక వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. ఒకే మహిళ కోసం ఇద్దరు భర్తలు గొడవపడుతున్న ఘటనతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఆమె నా భార్య అంటే నా భార్య అని ఇద్దరు భర్తలు పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. ఆ మహిళ నాకు కావాలంటే నాకే కావాలంటూ ఇద్దరూ కొట్టుకుంటున్న విచిత్ర ఘటన హైదరాబాద్, వరంగల్‌లో చోటు చేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ టీచర్స్ కాలనీ-2 లో లంకా శశికాంత్(42) భార్య దుర్గా సుశీల, అలియాస్ నాగసాయి వెంకట దుర్గా సత్యదేవి(35)తో కాపురం ఉంటున్నాడు. వీరిద్దరికి 1999 ఫిబ్రవరి 2న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. శశికాంత్ అర్చకుడిగా ఓ దేవాలయంలో పనిచేస్తున్నాడు. వీరికి 16 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 20న పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన సుశీల మళ్లీ తిరిగి రాలేదు. ఇంట్లోని 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు తీసుకుని ఆమె పరారయ్యింది. భార్య కోసం తెలిసిన చోటల్లా గాలించినా ఆమె ఆచూకి లభించలేదు. చివరికి ఆమె ఏపీలోని అమలాపురం, కొత్తపేటకు చెందిన డ్యాన్సర్ రాయుడు సత్యవరప్రసాద్ తో  వెళ్ళ పోయిందని భర్త శశికాంత్ తెలుసుకున్నాడు.

ఇంట్లోని బంగారం, వెండి డబ్బు తీసుకుని తన భార్య వరప్రసాద్‌తో  పారిపోయిందని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుర్గా సుశీలను, ఆమె ప్రియుడు సత్యవరప్రసాద్‌ను అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. సుబేదారి పోలీసు స్టేషన్‌లో ముగ్గురి మధ్య రాజీ కుదర్చటానికి ప్రయత్నించారు. దీంతో శశికాంత్ తన మొదటి భర్త కాదని.. తన అక్క చనిపోతే చుట్టపు చూపుగా వెళ్లానని ఆ పిల్లలు తన పిల్లలు కాదని దుర్గా సుశీల భారీ ట్విస్ట్ ఇచ్చింది.

పోలీసులు విచారణ చేపట్టగా.. శశికాంత్ ఆమె భర్తేనని, పిల్లలు సుశీల పిల్లలేనని తేలటంతో వారిద్దరినీ పోలీసులు రిమాండ్ కు పంపారు.  జైలు నుంచి విడుదలయ్యాక ప్రియుడు సత్యవరప్రసాద్‌తో కలిసి హైదరాబాద్ బల్కంపేట ప్రశాంత్ నగర్‌లో కాపురం పెట్టి ఇద్దరూ సహజీవనం చేయసాగారు. ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహాలలో సుశీల మెడలో ఆమె ప్రియుడు సత్యవరప్రసాద్ మూడు ముళ్లు వేసి భార్యగా చేసుకున్నాడు.

News Reels

ఈ క్రమంలో శశికాంత్ మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పిల్లలకు తల్లిప్రేమ కావాలి. నాభార్యను నాకు అప్పగించండి అని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలా ఉండగా రెండో భర్త సత్యవరప్రసాద్ ఇంటి నుంచి సుశీల అదృశ్యమయ్యింది.  దీంతో రెండో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 3 నెలల గర్భవతి అయిన తన భార్య  కనిపించటంలేదని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుశీల ఆచూకీ తెలుసుకొనే పనిలో పడ్డారు.

Also Read: Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ మూలాలు తెలుసా.. వాళ్లు నరరూప రాక్షసులుగా ఎందుకు మారారు?

Also Read: అబద్దాలతో బురిడీ కొట్టిస్తున్న శిల్పా చౌదరి - మరోసారి కస్టడీ కోరిన పోలీసులు !

Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Dec 2021 10:12 AM (IST) Tags: Hanamkonda Warangal woman issue Married Woman in warangal first husband second husband

సంబంధిత కథనాలు

YS Sharmila Padayatra : వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత, ప్రచార రథానికి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు!

YS Sharmila Padayatra : వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత, ప్రచార రథానికి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు!

 TS News Developments Today: బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అవుతుందా? ఇవాల్టి తెలంగాణ టాప్‌ న్యూస్ డెవలప్‌మెంట్స్ ఇవే

 TS News Developments Today: బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అవుతుందా? ఇవాల్టి తెలంగాణ టాప్‌ న్యూస్ డెవలప్‌మెంట్స్ ఇవే

Petrol-Diesel Price, 28 November 2022: ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం- మిగతా చోట్లో స్థిరంగా ధరలు

Petrol-Diesel Price, 28 November 2022: ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం- మిగతా చోట్లో స్థిరంగా ధరలు

Gold Silver Rate Today: బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ఎంత ధర పెరిగిందో తెలుసా!

Gold Silver Rate Today: బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ఎంత ధర పెరిగిందో తెలుసా!

Warangal: ఫారిన్ చాక్లెట్ పిల్లాడి ప్రాణం తీసింది, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి

Warangal: ఫారిన్ చాక్లెట్ పిల్లాడి ప్రాణం తీసింది, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి

టాప్ స్టోరీస్

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్

Pavitra Lokesh: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

Pavitra Lokesh: నరేష్ భార్య రమ్య రఘుపతిపై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

Viral Video: స్టన్నింగ్ వీడియో- బైక్‌ను నెత్తిన పెట్టుకుని బస్సు ఎక్కించాడు!

Viral Video: స్టన్నింగ్ వీడియో- బైక్‌ను నెత్తిన పెట్టుకుని బస్సు ఎక్కించాడు!