Silpa Chowdary : అబద్దాలతో బురిడీ కొట్టిస్తున్న శిల్పా చౌదరి - మరోసారి కస్టడీ కోరిన పోలీసులు !
బ్లాక్‌మనీని వైట్ చేస్తామనే పేరుతో రూ. కోట్లు వసూలు చేసి మోసం చేసిన శిల్పా చౌదరి పోలీసులకు నిజాలు చెప్పడంలేదు. మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు పిటిషన్ వేశారు.
![Silpa Chowdary : అబద్దాలతో బురిడీ కొట్టిస్తున్న శిల్పా చౌదరి - మరోసారి కస్టడీ కోరిన పోలీసులు ! Shilpa Chowdhary cunning Answers with lies - Police seek custody once again! Silpa Chowdary : అబద్దాలతో బురిడీ కొట్టిస్తున్న శిల్పా చౌదరి - మరోసారి కస్టడీ కోరిన పోలీసులు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/05/9387db342ff544f4fbf46515b8599530_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
శిల్పా చౌదరిని మరోసారి కస్టడీలోకి తీసుకునేందుకు నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను కస్టడీకి ఇవ్వాలని కోరడం ఇది మూడో సారి. ఇప్పటికి రెండు సార్లు కోర్టు కస్టడీకి ఇచ్చింది. అయితే శిల్పా చౌదరి చెబుతున్న విషాయాల్లో వాస్తవాలేవో.. అబద్దాలేవో అంచనా వేయడం పోలీసులకు కూడా కష్టంగా మారింది. దీంతో మరిన్ని వివరాలు సేకరించాలన్న లక్ష్యంతో కోర్టును మరోసారి కస్టడీకి కోరారు. శిల్పా చౌదరి రూ. రెండు వందల కోట్ల వరకూ బ్లాక్ మనీని వైట్ చేస్తామని. ఆశ పెట్టి వసూలు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆమె ఇప్పటి వరకూ రూ. ఏడు కోట్ల లెక్క మాత్రమే చెప్పారు.
Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..
అదే సమయంలో తన వద్ద చాలా మంది నగదు తీసుకున్నారని కొంత మంది ప్రముఖుల పేర్లు చెప్పింది. వారిని ప్రశ్నిస్తే.. పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. ఆమె తమకు ఇవ్వడమేమిటని.. తామే ఆమెకు ఇచ్చామని వారు చెబుతున్నారు. దీంతో డబ్బులు ఎక్కడకు తరలించిందనే దానిపైనే ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టి విచారణ జరుపుతున్నారు. కిట్టీపార్టీల్లో పరిచయమైన వారి నుంచి తీసుకున్న కోట్ల రూపాయలను పెట్టుబడులుగా చూపించేందుకు కొందరు వ్యాపారులకు ఇచ్చినట్టు చెబుతున్న విషయాల్లో చాలా వరకు అవాస్తవాలు ఉన్నట్లుగా తేలింది. అదే సమయంలో అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని తనను మోసం చేసినట్లు చెప్పిన శిల్ప ఆధారాలు ఇవ్వలేకపోయింది.
Also Read: పంట సాగు కోసం అప్పు చేసిన రైతు.. దిగుబడి రాదని ఆత్మహత్య
దీంతో పోలీసులుల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నందుకు మరో కేసు పెట్టే యోచనలో పోలీసులు ఉన్నారు. శిల్పా చౌదరితో పాటు ఆమె భర్త ఖాతలను పరిశీలించిన పోలీసులకు షాక్ తగిలింది. శిల్ప ఖాతాలో రూ.16 వేలు, భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో రూ. 14వేలు మాత్రమే ఉన్నాయి. పెద్ద ఎత్తున నగదు తరలించిన లావాదేవీలు కూడా లేవు. పూర్తిగా నగదు లావాదేవీలు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అంతానగదు లావాదేవీలు కావడంతో ఎక్కువ మంది బాధితులు కేసులు పెట్టం కానీ తమ నగదు తమకు ఇప్పించాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Nizamabad Crime: సెల్ ఫోన్ల కోసం ట్రిపుల్ మర్డర్... నిందితుడిని పట్టించిన సీసీఫుటేజ్
అయితే కేసులు పెట్టిన వారికి మాత్రమే తాను డబ్బులు తిరిగి ఇస్తానని శిల్పా చౌదరి పోలీసుల వద్ద ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోది. శిల్పా చౌదరి
అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో శిల్ప పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పరిచయాలతో శిల్పారెడ్డి నగదును అమెరికా తరలించారా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. రెండు దశల్లో ఐదు రోజుల పాటు శిల్పా చౌదరిని ప్రశ్నించిన పోలీసులు ఫిర్యాదుదారులు ఇచ్చిన అంశాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించలేకపోయారు. మరోసారి కస్టడీకి ఇస్తే ఏం తెలుసుకుంటారో కానీ ఇప్పటికైతే శిల్పా చౌదరి పోలీసులకు చుక్కలు చూపిస్తోందని భావిస్తున్నారు.
Also Read: MIM Mla: సలాం చెప్పలేదని యువకుడిపై ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే దౌర్జన్యం... సీసీటీవీలో రికార్డైన దాడి దృశ్యాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)