Farmer Suicide: పంట సాగు కోసం అప్పు చేసిన రైతు.. దిగుబడి రాదని మనస్తాపంతో ఆత్మహత్య
పంటకు ఆశించిన దిగుబడి.. రాదని మనస్తాపంతో రైతు ఉరెసుకుని చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ జిల్లాలోని దూద్యా తండాకు చెందిన బుక్కు మిరపతోట వేశారు. ఆయనకు ఎకరం భూమి ఉంది. మరో ఎకరాన్ని కౌలుకు తీసుకుని మరి సాగు చేశాడు. మెుత్తం మూడు లక్షలకుపైగా అప్పు అయింది. పంట చేతికి వచ్చాక అప్పు తీర్చొచ్చు అనుకున్నాడు. కానీ పంటకు పురుగు పట్టింది. మళ్లీ అప్పులు చేసి.. మందులు కొట్టాడు అయినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు.
ఇక తన పంటకు ఆశించిన దిగుబడి రాదని మనస్తాపానికి గురయ్యాడు బిక్కు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇటీవలే వరి రైతు
మరోవైపు.. మెదక్ జిల్లాలోని హవేలీ ఘన్‌పూర్ మండలం బోగడ భూపతిపూర్‌కి చెందిన రైతు రవికుమార్ ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నాడు. పంట దిగుబడి రాక.. గిట్టుబాటు ధరలేక అప్పుల బాధలో కూరుకుపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి రవికుమార్ రాసిన సూసైడ్ లెటర్ కన్నీరు పెట్టించింది. రైతుల దీనస్థితిని కళ్లకు కడుతోంది.
వర్షాకాలం సన్నరకం వేయమంటేనే వేశానని.. మొత్తం సన్నరకమే సాగుచేశానని రవికుమార్ లేఖలో తెలిపారు. దిగుబడి తక్కువ వచ్చిందని.. మొదలు ధర లేదని ఆయన వాపోయారు. నా పొలం మొత్తం వరిసాగే అవుతది నేనేం చేయగలను అంటూ రవికుమార్.. సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.
Also Read: Medaram Jatara 2022: వనదేవతలను దర్శించుకోవాలంటే.. వ్యాక్సిన్ తప్పనిసరి..
Also Read: Nizamabad Crime: సెల్ ఫోన్ల కోసం ట్రిపుల్ మర్డర్... నిందితుడిని పట్టించిన సీసీఫుటేజ్
Also Read: MIM Mla: సలాం చెప్పలేదని యువకుడిపై ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే దౌర్జన్యం... సీసీటీవీలో రికార్డైన దాడి దృశ్యాలు
Also Read: Medchal: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి.. మద్యం మత్తే కొంపముంచింది
Also Read: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి