Medaram Jatara 2022: వనదేవతలను దర్శించుకోవాలంటే.. వ్యాక్సిన్ తప్పనిసరి..
త్వరలో మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతర మెుదలుకానుంది. మేడారం వచ్చే భక్తులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకునే దర్శించుకోవాల్సి ఉంటుంది.
ములుగు జిల్లా తడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అంటే పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. తెలంగాణ నుంచే కాకుండా.. ఆంధ్ర చత్తీస్ గడ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే దర్శనానికి వచ్చేవారు తప్పనిసరిగా.. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునే రావాల్సి ఉంటుంది. కరోనా వ్యాప్తి కారణంగా వనదేవతలను దర్శించుకునే వారికి ప్రత్యేకంగా జిల్లా వైద్యాధికారులు కొవిడ్ టెస్ట్ లు చేస్తున్నారు. టీకా తీసుకోనికి వారికి టీకా వేయడం, ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి సెకండ్ డోస్ ఇవ్వడం, రెండు డోసులు తీసుకున్నవారు సర్టిఫికెట్ చూపిస్తేనే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు.
ఈ మేరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద వైద్యాధికారులు వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికేట్ ఉంటేనే.. అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు. మేడారంతో పాటు పర్యాటక ప్రాంతాలైన రామప్ప, బొగత జలపాతం వద్ద ప్రతి ఆది, బుధవారాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అళ్లెం అప్పయ్య చెప్పారు.
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2022లో ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది.
ఫిబ్రవరి 16న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెల వద్దకు తీసుకురావడంతో జాతర ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెల వద్దకు చేరుస్తారు. ఫిబ్రవరి 18న సమ్మక్క-సారక్క అమ్మవార్లకు ప్రజలు మొక్కులు సమర్పించుకుంటారు. ఫిబ్రవరి 19న దేవతల వన ప్రవేశంతో మహా జాతర ముగుస్తుంది.
Also Read: Nizamabad Crime: సెల్ ఫోన్ల కోసం ట్రిపుల్ మర్డర్... నిందితుడిని పట్టించిన సీసీఫుటేజ్
Also Read: MIM Mla: సలాం చెప్పలేదని యువకుడిపై ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే దౌర్జన్యం... సీసీటీవీలో రికార్డైన దాడి దృశ్యాలు
Also Read: Medchal: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి.. మద్యం మత్తే కొంపముంచింది
Also Read: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి