RRR Press Meet: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
కొమరం భీమ్ పాత్రకు ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ ఎంపికతో పాటు వాళ్లిద్దరి స్టార్‌డమ్, యాక్టింగ్ గురించి హైదరాబాద్ 'ఆర్ఆర్ఆర్' ప్రెస్‌మీట్‌లో రాజమౌళి స్పందించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... టాలీవుడ్ టాప్ స్టార్స్. ఇద్దరికీ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాస్ జనాల్లో మంచి క్రేజ్ ఉంది. ఇటువంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేయడం కూడా ఇదే తొలిసారి. నందమూరి, కొణిదెల (మెగా) కుటుంబాల్లో యువ హీరోలు కలిసి సినిమా చేయడం కూడా ఇదే తొలిసారి. తారక్, చరణ్ మధ్య మంచి స్నేహం ఉంది. అయితే... ఫ్యాన్స్ మధ్య ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? అనే చర్చలు, గొడవలు కూడా ఉంటాయి కదా! ఈ విషయాలు రాజమౌళి దృష్టిలో పెట్టుకున్నారా? లేదా? ఈ విషయమై హైదరాబాద్ 'ఆర్ఆర్ఆర్' ప్రెస్‌మీట్‌లో రాజమౌళి స్పందించారు.
"నాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. సినిమాను ప్రేక్షకుడు ఏ విధంగా చూస్తాడు? అనేదాంట్లో క్లారిటీ ఉంటుంది. అందులో నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే... స్టార్ వేల్యూ నాకు బాగా తెలుసు. నేను ఇంత పెద్ద దర్శకుడు అయ్యింది స్టార్ హీరోలను అభిమానులు, ప్రేక్షకులకు బాగా చూపించే! అదే సమయంలో... ఎంత పెద్ద స్టార్ అయినా సరే? సినిమాలో ఎంతమంది స్టార్స్ ఉన్నా సరే? వాళ్లు ఉత్సాహంగా జనాల్ని థియేటర్లకు రప్పించగలరు. ఒకసారి థియేటర్లో ప్రేక్షకులు కూర్చున్న తర్వాత, లైట్స్ ఆఫ్ అయిన తర్వాత... ఆ స్టార్స్ మాయం అయిపోతారు. సినిమాను కథ నడిపించాలి. అది నేను బలంగా నమ్ముతాను. నేను క్యారెక్టర్లు రాసుకున్నప్పుడు సినిమా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికి యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్ కావాలి. అయితే... ఆ క్యారెక్టర్లు పండించడానికి ఎన్.టి. రామారావు, రామ్ చరణ్ తేజ్ కావాలి. యాక్టర్లుగా వాళ్లు నాకు కావాలి. సినిమాకు రప్పించడానికి వాళ్ల స్టార్ డమ్ కావాలి. నేను యాక్టర్లను తీసుకున్నాను. వాళ్ల మధ్య స్నేహాన్ని చూపించగలిగితే... జనాలు కూడా ఆ స్నేహానికి రెస్పొంద్ అవుతారు తప్ప, మెగా పవర్ స్టార్ ర్‌కి, యంగ్ టైగర్‌కి రియాక్ట్ అవ్వరని నమ్మాను. ఆ నమ్మకంతోనే సినిమా తీశా" అని రాజమౌళి చెప్పారు. అదీ సంగతి.
నందమూరి అభిమానులు, కొణిదెల అభిమానులు థియేటర్లలోకి వెళ్లిన తర్వాత స్టార్స్‌ను మర్చిపోయి సినిమా చూస్తారనేది రాజమౌళి థియరీ. 'ఆర్ఆర్ఆర్' సినిమా జనవరి 7న థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Also Read: టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఫ్రెండ్స్‌తో ఎన్టీఆర్ మాట్లాడతారా?
Also Read: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…
Also Read: తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్
Also Read: దేవిశ్రీ ఆ సాంగ్‌ను కాపీ కొట్టాడా? ఊ అంటారా... ఉఊ అంటారా?
Also Read: 'నయీం డైరీస్'పై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం... టీమ్ ఏమంటోందంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి