అన్వేషించండి
Advertisement
Nayeem Diaries: 'నయీం డైరీస్'పై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం... టీమ్ ఏమంటోందంటే?
గ్యాంగ్‌స్టర్ నయీం జీవితం ఆధారంగా రూపొందిన సినిమా 'నయీం డైరీస్'. దీనికి ఓ మహిళ కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. మరి, టీమ్ ఏమంటోంది?
గ్యాంగ్‌స్టర్ నయీం జీవితం ఆధారంగా రూపొందిన 'నయీం డైరీస్' సినిమా ఈ నెల 10న (శుక్రవారం) థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమాలో ఏం చూపించారు? ఏమిటి? అనే ఆసక్తితో చాలా మంది వెళ్లారు. నయీంతో పలువురు రాజకీయ నాయకులకు, పోలీస్ అధికారులతో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అది పక్కన పెడితే... ఆయన జీవితంలో ఉన్న ఓ మహిళ ప్రస్తావన కూడా సినిమాలో ఉంది. సదరు మహిళ కుటుంబ సభ్యులు సినిమాలో సన్నివేశాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆ సన్నివేశాలను బేషరతుగా సినిమా నుంచి తొలగిస్తామని చిత్రదర్శకుడు దాము బాలాజీ, నిర్మాత సీఏ వరదరాజు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
"ఈ రోజు (శుక్రవారం, డిసెంబర్ 10) థియేటర్లలో విడుదల అయిన 'నయీం డైరీస్' సినిమాలో నిజజీవితంలో అమరురాలైన ఒక మహిళ పాత్రను పోలిన పాత్ర చిత్రణ ఆమె కుటుంబ సభ్యులను, అభిమానుల్ని బాధ పెట్టినట్టు మా దృష్టికి వచ్చింది. వారి మనోభావాలను గాయపరిచినందుకు మేము బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం. మా సినిమా ప్రదర్శనను ఆపేసి, ఆ పాత్రకు సంబంధించిన అభ్యంతకర దృశ్యాలను, సంభాషణలను వెంటనే తొలగిస్తున్నామని తెలియ చేస్తున్నాం" అని సినిమా దర్శకుడు దాము బాలాజీ, నిర్మాత సీఏ వరదరాజులు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
నయీం పాత్రలో వశిష్ట సింహ నటించిన ఈ సినిమాను దాము బాలాజీ దర్శకత్వంలో సీఏ వరదరాజు నిర్మించారు. నయీం అనే అసాంఘిక శక్తిని రాజకీయ, పోలీస్ వ్యవస్థలు తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయనేది ఈ సినిమాలో ధైర్యంగా చూపించమని దర్శక నిర్మాతలు వెల్లడించారు. యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్, శశి కుమార్, జబర్దస్త్ ఫణి తదితరులు 'నయీం డైరీస్' సినిమాలో నటించారు.
Also Read: చిక్కుల్లో పడ్డ స్టార్ హీరో సినిమా.. నిర్మాతలపై చీటింగ్ కేసు..
Also Read: హమ్మయ్య.. ఆ ‘శబ్దాలు’ తగ్గుతాయ్.. కత్రినా-విక్కీలపై అనుష్క కొంటె కామెంట్స్
Also Read: వరంగల్ లో 'ఆర్ఆర్ఆర్' ఈవెంట్.. అక్కడే ఎందుకంటే..?
Also Read: వరుణ్ తేజ్ 'గని' విడుదల వాయిదా... ఎందుకంటే?
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
Also Read: 'గమనం' రివ్యూ : సినిమా ఎలా ఉందంటే?
Also Read: షన్నును ఇంప్రెస్ చేయమంటే హగ్గిచ్చిన సిరి... ‘అయిపాయ్’ అంటూ కాజల్ కామెంట్, కామెడీతో ఇరగదీసిన హౌస్ మేట్స్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
క్రైమ్
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion