By: ABP Desam | Updated at : 10 Dec 2021 02:49 PM (IST)
(Image credit: Starmaa)
మరో పదిరోజుల్లో విజేత ఎవరో తెలిసిపోతుంది. ప్రస్తుతం హౌస్లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఒకరు ఈ వారం ఇంటిని వీడి వెళతారు. టాప్ 5 కంటెస్టెంట్లు చివరి వారమంతా హౌస్లో ఉంటారు. వచ్చే ఆదివారం బిగ్బాస్ సీజన్5 విన్నర్ ఎవరో తేలిపోనుంది. ముగింపు దశలో సీరియస్ టాస్కులు ఇచ్చి, కంటెస్టెంట్ల మధ్య గొడవలతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించే బదులు కామెడీని పంచడం బెటర్ అనుకున్నారేమో బిగ్ బాస్. ఇంట్లో కామెడీ వాతావారణాన్ని సృష్టించారు. గత మూడు రోజుల నుంచి హౌస్ లో నవ్వులు పువ్వులు పూస్తున్నాయి.
సన్నీ బాలయ్యలా, షణ్ముక్ సింగం సూర్యలా, సిరి జెనీలియాలా, కాజల్ అతిలోకసుందరి శ్రీదేవిలా, మానస్ గబ్బర్ సింగ్ లా, శ్రీరామ్ ముఠా మేస్త్రిలా మారి ఆ పాత్రల్లో జీవించేస్తున్నారు. ముఖ్యంగా కాజల్, సన్నీ, మానస్, శ్రీరామ్ చేసే కామెడీ మామూలుగా లేదు. శుక్రవారం ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో విడుదలైంది. అందులో కూడా ఎపిసోడంతా నవ్వులు పువ్వులు పూయడం ఖాయంలా ఉంది. కాజల్ గొంతు మార్చి మరీ శ్రీదేవిలా మాట్లాడటానికి ప్రయత్నించి అందరినీ నవ్విస్తోంది. అంగుళీయకము కనిపించుట లేదు అంటూ సింగం షణ్ముక్ కి ఫిర్యాదు చేస్తుంది కాజల్. బాలయ్య పాత్రలో ఉన్న సన్నీ పెద్దమనిషి తరహాలో న్యాయం చెప్పేందుకు కూర్చుంటాడు. కాజల్ తో ‘నువ్వు అతడిని ఇంప్రెస్ చేస్తే నీ అంగుళీయకము నీకిప్పిస్తా’ అంటాడు. ఈ లోపు సిరి షన్నును హగ్ చేసుకుంటుంది. అది చూసి కాజల్ ‘అయిపాయ్’ అని కామెంట్ చేస్తుంది. సిరి-షన్నులు హగ్గుల కోసమే బిగ్ బాస్ హౌస్ కొచ్చారా అన్నట్టు ఉంది పరిస్థితి. చివరలో బిగ్ బాస్ వేసిన పాటకు హౌస్ మేట్స్ అంతా కలిసి చిందేశారు.
Chiranjeevi, Balakrishna, Pawan Kalyan.Surya, Sridevi and Genelia laga mana housemates iragatesaru 👌 #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/Y2nua9irCX
— starmaa (@StarMaa) December 10, 2021
Also Read: వావ్..సూపర్..మైండ్ బ్లోయింగ్.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై మహేష్ బాబు రియాక్షన్..
Also Read: సినిమా ఎలా ఉందంటే...? గురి తప్పింది గురూ...
Also Read: అప్పుడు చిరు-ఎన్టీఆర్.. ఇప్పుడు చెర్రీ-ఎన్టీఆర్.. ఆ హిస్టరీ రిపీటైతే కష్టమే! ఎందుకంటే..
Also Read: డాక్టర్ బాబుని అవమానించిన పిల్లలు… రుద్రాణి వలలో దీప చిక్కుకుంటుందా, కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read: RRR ట్రైలర్.. కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి
Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
/body>