News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Lakshya Movie Review: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?

Naga Shourya's Lakshya Review: ఎయిట్ ప్యాక్ బాడీతో నాగశౌర్య... విలువిద్య నేపథ్యం... వీటికి తోడు ప్రచార చిత్రాలు... 'లక్ష్య' సినిమాపై ఆసక్తి కలిగించాయి. మరి, సినిమా ఎలా ఉంది?

FOLLOW US: 
Share:

రివ్యూ: లక్ష్య
రేటింగ్: 2/5
ప్రధాన తారాగణం: నాగశౌర్య, కేతికా శర్మ, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, రవిప్రకాష్ తదితరులు 
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
కెమెరా: రామ్
మాటలు: సృజనామణి 
సంగీతం: కాలభైరవ
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి
విడుదల తేదీ: 10-12-2021

క్రికెట్, బాక్సింగ్, కబడ్డీ నేపథ్యంలో తెలుగులో సినిమాలు వచ్చాయి. విలువిద్య నేపథ్యంలో? హీరో నాగశౌర్య 'లక్ష్య' చేశారు. సినిమా కోసం ఆయన ప్యాక్డ్ బాడీ బిల్డ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి? 

కథ: వాసు (రవిప్రకాష్) ఆర్చరీ ప్లేయర్. వరల్డ్ ఛాంపియన్ కావాలనేది అతడి లక్ష్యం. ఆర్చరీ పోటీలకు వెళ్తుండగా... కార్ యాక్సిడెంట్ కావడంతో మరణిస్తాడు. వాసు కుమారుడు పార్ధు (నాగశౌర్య) కూడా ఆర్చరీ ప్లేయర్. అతడిలో క్రీడాకారుడిని అతడి బాల్యంలోనే తాతయ్య రఘురామయ్య (సచిన్ ఖేడేకర్) గుర్తిస్తాడు. ఊరి నుండి సిటీకి వస్తాడు. ఆస్తులు అన్నీ అమ్మి మనవడికి శిక్షణ ఇప్పిస్తాడు. పార్ధు కూడా కష్టపడి ఆడి... స్టేట్ లెవల్ ఛాంపియన్ అవుతాడు. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్ ట్రయల్స్ కి సన్నద్ధం అయ్యే సమయంలో తాతయ్య మరణించడంతో బాధలో... ఆటలో గెలవడం కోసం మత్తు పదార్థాలకు బానిస అవుతాడు. అది తెలిసి అకాడమీ అతడిని సస్పెండ్ చేస్తుంది. అసలు, పార్ధు మత్తుకు బానిస కావడానికి కారణం ఎవరు? మరణించాలని రోడ్డు మీద వస్తున్న లారీకి అడ్డంగా వెళ్లిన పార్థును కాపాడిన సారథి (జగపతి బాబు) ఎవరు? పార్ధు జీవితంలో రితికా (కేతికా శర్మ) పాత్ర ఏమిటి? మళ్లీ పార్ధు ఆర్చరీకి దగరయ్యాడా? లేదా? అతడిని వరల్డ్ ఛాంపియన్ గా చూడాలనుకున్న తాతయ్య కోరికను నెరవేర్చాడా? లేదా? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ: సినిమా కోసం నాగశౌర్య చాలా కష్టపడ్డారు. ఎయిట్ ప్యాక్ చేశారు. స్క్రీన్ మీద అది కనిపించింది. అతడు పడ్డ కష్టం వృథా కాలేదు. లుక్ పరంగా, బాడీ పరంగా వేరియేషన్ చూపించారు. మరి, కథలో వేరియేషన్ ఉందా? కొత్తదనం ఉందా? ప్రశ్నించుకుంటే... ఆర్చరీ (విలువిద్య) కాన్సెప్ట్ తెలుగు తెరకు కొత్తదే. కానీ, కథ కొత్తది కాదు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గతంలో ఇటువంటి కథలు వచ్చాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ కొత్తగా ఏమీ సాగదు. ప్రేక్షకుల ఊహకు అనుగుణంగా సినిమా సాగుతుంది.

కథలో తాతయ్య మనవడి మధ్య సెంటిమెంట్ ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కాన్సెప్ట్ ఉంది. మత్తు (డ్రగ్స్)కు బానిస అయ్యి మళ్లీ పైకి లేచిన మనిషి ధృడ సంకల్పం ఉంది. లవ్ కూడా ఉంది. వీటి మధ్య మంచి డ్రామా ఉంది. అయితే... వీటిని కరెక్టుగా కనెక్ట్ చేసే స్క్రీన్ ప్లే మిస్ అయింది. సన్నివేశాల్లో ఎమోషన్ మిస్ అయింది. కథతో ప్రేక్షకుడిని కనెక్ట్ చేసే డైరెక్షన్ మిస్ అయింది. అందువల్ల, ఫస్టాప్ అంతా సోల్ లెస్ సినిమా చూసినట్టు ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత... పార్ధు కింద పడి, అక్కడ నుంచి పైకి లేచిన తర్వాత వచ్చే సీన్స్ పడిన సినిమాను కొంత నిలబెట్టాయి. మళ్లీ పతాక సన్నివేశాలు చప్పగా సాగాయి. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ సోసోగా ఉన్నాయి. సంగీత దర్శకుడు కాలభైరవకు ఎక్కువ పాటలు చేసే అవకాశం రాలేదు. సినిమాలో రెండు పాటలే ఉన్నాయి. అవి పర్వాలేదు. అయితే... థియేటర్ నుంచి బయటకు వచ్చాక గుర్తుండవు. గతంలో కాల భైరవ మంచి స్వరాలు అందించారు. అతడి నుండి హిట్ సాంగ్స్ తీసుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్టు ఉంది. 

ముందు చెప్పినట్టు నాగశౌర్య సినిమా కోసం చాలా కష్టపడ్డారు. పాత్రకు న్యాయం చేశారు. 'రొమాంటిక్' ఫేమ్ కేతికా శర్మ ఈ సినిమాలో గ్లామర్ కంటే నటన మీద దృష్టి పెట్టారు. సచిన్ ఖేడేకర్ కు ఇంపార్టెంట్ రోల్ దక్కింది. ఆయన బాగా చేశారు. జగపతిబాబు రోల్, అందులో ఆయన నటన బాగున్నాయి. నటన పరంగా సినిమాలో అందరి కంటే ఆయనకు ఎక్కువ ఆకట్టుకుంటారు. భరత్ రెడ్డి, శత్రు, 'స్వామి రారా' సత్య, కిరీటి తదితరులు పాత్రలకు తగ్గట్టు నటించారు. నాగశౌర్య, సచిన్ ఖేడేకర్, జగపతిబాబు బాగా చేసినా... కథ, కథనం, దర్శకత్వం వల్ల సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే... గురి తప్పింది. బాణాన్ని దర్శకుడు సరిగ్గా వదల్లేదు... అది లక్ష్యాన్ని చేరుకోలేదు.

Published at : 10 Dec 2021 12:03 PM (IST) Tags: ketika sharma Jagapathi Babu Santhosh Jagarlapudi Naga Shourya' Naga Shourya's Lakshya Review Lakshya Review Lakshya Review in Telugu లక్ష్య రివ్యూ

ఇవి కూడా చూడండి

Gruhalakshmi September 27th:  విక్రమ్ ప్రేమకు దివ్య ఫిదా -  తులసిని చంపేస్తానని నందుని బెదిరించిన రత్నప్రభ

Gruhalakshmi September 27th: విక్రమ్ ప్రేమకు దివ్య ఫిదా - తులసిని చంపేస్తానని నందుని బెదిరించిన రత్నప్రభ

Krishna Mukunda Murari September 27th: మురారితో తాళి కట్టించుకుంటానన్న ముకుంద - కృష్ణ ఏం చేయబోతోంది!

Krishna Mukunda Murari September 27th:  మురారితో తాళి కట్టించుకుంటానన్న ముకుంద - కృష్ణ ఏం చేయబోతోంది!

Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?

Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?

Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!

Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!

Brahmamudi September 27th: కావ్యకి పడిపోయిన రాజ్, రుద్రాణిలో మొదలైన టెన్షన్ - స్వప్న బయటపడుతుందా!

Brahmamudi September 27th: కావ్యకి పడిపోయిన రాజ్,  రుద్రాణిలో మొదలైన టెన్షన్ - స్వప్న బయటపడుతుందా!

టాప్ స్టోరీస్

Bhainsa News: బైంసాలో గణేష్‌ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్‌

Bhainsa News: బైంసాలో గణేష్‌ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్‌

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు

Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు

గ్రేటర్‌లో నేడు డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - ఆ లక్కీ పర్సన్స్‌ని ఎంపిక ఇలా

గ్రేటర్‌లో నేడు డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - ఆ లక్కీ పర్సన్స్‌ని ఎంపిక ఇలా

KCR Health Condition: సీఎం కేసీఆర్ కు అస్వస్థత, ప్రగతి భవన్ లో ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స

KCR Health Condition: సీఎం కేసీఆర్ కు అస్వస్థత, ప్రగతి భవన్ లో ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స