By: ABP Desam | Updated at : 10 Dec 2021 11:54 AM (IST)
Edited By: RamaLakshmibai
Mahesh Babu
విడుదలైన క్షణం నుంచి మొదలైన ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ దూకుడు ఎక్కడా తగ్గడం లేదు. స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకూ చూపుతిప్పుకోనివ్వకుండా రోమాలు నిక్కబొడిచేలా ఉందంటున్నారు సినీ ప్రియులు. ట్రైలరే ఇలా ఉందంటే ఇక సినిమా గురించి మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్ అంటున్నారు. ఉత్కంఠ భరితమైన, భావోద్వేగపూరితమైన సన్నివేశాలు, రోమాలు నిక్కబొడిచే పోరాటాలు, ఆద్యంతం యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్ , పోటాపోటీగా కనిపించిన ఎన్టీఆర్-రామ్ చరణ్... జక్కన్న చెక్కిన చిత్రం చూసి ముఖ్యంగా మాస్ ఆడియన్స్ అయితే ప్రతి ఫ్రేమ్ కి సీటీ కొడుతున్నారు. తాజాగా ఈ ట్రైలర్‌పై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించాడు.
Each and every shot of the trailer is stunning, spectacular and mind blowing!! The master storyteller is back and how! Goosebumps all the way!! #RRRTrailer@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @OliviaMorris891
— Mahesh Babu (@urstrulyMahesh) December 10, 2021
'ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లో ప్రతీ సన్నివేశం ఒక అద్భుతం, మైండ్ బ్లోయింగ్, మాస్టర్ స్టోరీ టెల్లర్ మళ్లీ వచ్చేశాడు.. ఎలా అంటే.. అంతా గూస్ బంప్సే...' అని మహేష్ బాబు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
ఈ ట్రైలర్ పై ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు పొగడ్తల వర్షంకురిపించారు. “ట్రైలర్ చూస్తే గర్వంగా ఉంది. నెక్స్ట్ లెవల్ సినిమా ఇది ఆర్ఆర్ఆర్ ” అని రాసుకొచ్చాడు విజయ్ దేవర కొండ. సందీప్ రెడ్డి వంగా.. ”ఇది భగవంతుని పని అని నేను ఖచ్చితంగా నమ్ముతాను” , 'నా గూస్ బంప్స్ కి గూస్బంప్స్ వచ్చాయంటూ' ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు. ఈ అనుభూతిని వ్యక్తపరచడానికి నాకు పదాలు లేవన్నాడు హరీశ్ శంకర్. కరణ్ జోహార్ స్పందిస్తూ.. 'రాజమౌళి సార్! ఈ ఎపిక్ ట్రైలర్ మీ బ్రిలియన్స్ – మాగ్నిట్యూడ్ ని చూసి ఆశ్చర్యపోయాను! వావ్!!! ఎన్టీఆర్ – రామ్ చరణ్ – అజయ్ దేవ్ గణ్ – ఆలియా భట్ తోపాటు ఈ అత్యంత భారీ చిత్రం మొత్తం తారాగణం మరియు సిబ్బందికి అభినందనలు’ అని కరణ్ అన్నాడు.
SIR!!! Blown away by the BRILLIANCE and MAGNITUDE of this EPIC trailer! WOW!!! Huge congratulations to @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 and the entire cast & crew of this insanely massive film! #RRRMovie https://t.co/wVv6mw40nw
— Karan Johar (@karanjohar) December 9, 2021
ఇక అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘ఆర్ఆర్ఆర్’ట్రైలర్ థియేటర్లలో రిలీజ్ అవడంతో.. చెర్రీ, ఎన్టీఆర్ అభిమానులు థియేటర్లను జాతర అడ్డాలుగా మార్చేశారు. చెర్రీ, ఎన్టీఆర్ కటౌట్‌ల ముందు కొబ్బరి కాయలు కొడుతూ హారతులు పడుతూ హంగామా చేశారు. డప్పు చప్పుళ్లు, టపాసుల మోతతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలకానుంది.
నుంది.
Also Read: డాక్టర్ బాబుని అవమానించిన పిల్లలు… రుద్రాణి వలలో దీప చిక్కుకుంటుందా, కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read: RRR ట్రైలర్.. కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
Also Read: చిన్నప్పుడు అజయ్ దేవగన్ బైక్ స్టంట్ చూస్తే.. అమ్మ తిట్టింది: ఎన్టీఆర్
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - బీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
Prudhvi Raj: ఆర్జీవీ సినిమాలు ఎవరూ చూడరు, ఎవరూ పట్టించుకోరు - ‘వ్యూహం’పై ఫృథ్విరాజ్ సెటైర్లు
Academic Calendar: తెలంగాణలో కొత్త విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు