Allu Arjun: 'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..
అల్లు అర్జున్ తను నటిస్తోన్న 'పుష్ప' సినిమా క్రూ మెంబర్స్ ని పిలిచి వారికి బహుమానాలు అందించినట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ లో విజయ్ లాంటి హీరోలు తమ సినిమా క్రూ మెంబర్స్ కి గిఫ్ట్ లు ఇస్తుంటారు. కానీ తెలుగులో ఇప్పటివరకు అలాంటివి జరగలేదు. సినిమా హిట్ అయితే.. హీరోలకు, దర్శకులకు మాత్రం గిఫ్ట్ లు ఇస్తుంటారు నిర్మాతలు. తొలిసారి అల్లు అర్జున్ తను నటిస్తోన్న 'పుష్ప' సినిమా క్రూ మెంబర్స్ ని పిలిచి వారికి బహుమానాలు అందించినట్లు తెలుస్తోంది. అది కూడా గోల్డ్ బిస్కెట్స్ కావడం విశేషం. ఒక్కో క్రూ మెంబర్ కి దాదాపు పది గ్రాముల విలువైన బంగారాన్ని పంచిపెట్టాడు బన్నీ.
సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప' సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. కానీ నిన్నటివరకు షూటింగ్ జరుగుతూనే ఉంది. సినిమాలో బ్యాలెన్స్ ఉన్న ఐటెం సాంగ్ ను రీసెంట్ గా పూర్తి చేశారు. అయితే ఈ పాట అనుకున్న టైంకి పూర్తవుతుందో లేదోనని అభిమానులు టెన్షన్ పడ్డారు. షూటింగ్ పూర్తికాకపోతే.. సినిమా రిలీజ్ వాయిదా పడుతుందనే సందేహాలు కలిగాయి. ఫైనల్ గా సాంగ్ షూటింగ్ పూర్తయింది.
దీనికి కారణమైన క్రూ మెంబర్స్ కి థాంక్స్ చెప్పాలనుకున్న బన్నీ.. వారికోసం స్పెషల్ గా బంగారపు బిస్కెట్ లను కొన్నాడు. సెట్స్ లో వారిని పిలిచి గోల్డ్ బిస్కెట్ చేతిలో పెట్టగా.. వారంతా సర్ప్రైజ్ అయ్యారు. ఆర్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ లతో పాటు.. సెట్ వర్కర్స్, లైట్ బాయ్స్, సెట్ బాయ్స్ కోసం కూడా బన్నీ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు పన్నెండు మందికి గోల్డ్ బిస్కెట్స్ ఇచ్చాడని సమాచారం.
ఇందులో నిర్మాతల ప్రమేయం లేదని.. బన్నీ తన సొంత డబ్బుతో ఈ గిఫ్ట్ లను కొన్నట్లు తెలుస్తోంది. ఇక 'పుష్ప' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. అలానే అనసూయ, సునీల్ లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించింది.
Also Read: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి