Pushpa Trailer: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
తాజాగా 'పుష్ప' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ మాస్ గెటప్ ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ల తర్వాత వస్తున్న సినిమా 'పుష్ప'. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 17న సినిమాను విడుదల చేయబోతున్నారు. దీంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ మాస్ గెటప్ ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది.
'భూమండలంలో ఏడా పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరుగతుండాది.. ఈడ నుంచి వేల కోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ ఎల్తా ఉండాది. గోల్డ్ రా ఇది.. భూమిపై పెరిగే బంగారం. పేరు ఎర్ర చందనం' అంటూ నటుడు అజయ్ ఘోష్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఆ తరువాత కొన్ని భారీ యాక్షన్ సీన్స్ ను చూపించారు.
పుష్పరాజ్ ని పోలీస్ స్టేషన్ లో పెట్టి టార్చర్ చేసే సీన్ చూపించారు. 'ఏడ దాచిపెట్టినావ్ సరుకు' అని పోలీస్ అడిగే ప్రశ్నకు 'సెపితే మా బాస్ చంపేస్తాడు' అని పుష్పరాజ్ డైలాగ్ కొట్టగా.. 'ఎవడా బాస్' అనే మాటకి వెనక నుంచి నడిచొచ్చే పుష్పరాజ్ ని చూపించారు. రష్మికతో లవ్ ట్రాక్ ని ట్రైలర్ లో చూపించారు.
'కట్ట మీద కూసోని.. కూతలు కూసేదాంట్లో ఏముండాది కానీ.. నీళల్లో దిగితే తెలుస్తదబ్బా ఆ లోతు' అని సునీల్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఆ తరువాత వాటర్ లో పుష్పరాజ్ ఛేజింగ్ సీన్ ను చూపించారు. 'ఈ లోకం మీకు తుపాకి ఇచ్చింది. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవడి యుద్ధం వాడిదే' అని బన్నీ చెప్పే డైలాగ్ మరో హైలైట్. ట్రైలర్ చివర్లో.. 'పుష్ప అంటే ఫ్లవుర్ అనుకుంటివే.. ఫైర్' అంటూ మరో డైలాగ్ పేల్చాడు బన్నీ. అనసూయ, ఫహద్ ఫాజిల్ వంటి నటులను ట్రైలర్ లో చూపించారు. ఓవరాల్ గా చూసుకుంటే యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచాయి.
ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ లో కనిపించనుంది. ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్ కి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మరో రెండు రోజుల్లో ఈ సాంగ్ షూటింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత మరింత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ షురూ చేస్తారు. హైదరాబాద్ లోనే గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.
#PushpaTrailer Out Now 🔥
— Pushpa (@PushpaMovie) December 6, 2021
DEC 17th #ThaggedheLe 🤙
▶️ https://t.co/3BkEDzUIXL#PushpaTheRise #PushpaTheRiseOnDec17 @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @anusuyakhasba @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/jLNic8VHny
Also Read: టాప్ 6లో షణ్ముఖ్.. లేబెల్లింగ్ కి రెడీగా ఉంటాడని కాజల్ ఫైర్..
Also Read: భీమ్... భీమ్... కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్టర్ చూశారా?
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి