By: ABP Desam | Updated at : 06 Dec 2021 07:30 PM (IST)
టాప్ 6లో షణ్ముఖ్.. లేబెల్లింగ్ కి రెడీగా ఉంటాడని కాజల్ ఫైర్..
బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. నిన్న ఎపిసోడ్ లో ప్రియాంక ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు హౌస్ మేట్స్ మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. దానికోసం సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది బిగ్ బాస్ టీమ్.
అందులో ఒకటి నుంచి ఆరు స్థానాలకు సంబంధించిన బోర్డ్స్ ను హౌస్ మేట్స్ ముందు పెట్టిన బిగ్ బాస్.. ఎవరు ఏ పొజిషన్ లో ఉండాలనుకుంటున్నారో.. ఏకాభిప్రాయంగా చెప్పమని కోరారు. తాజాగా విడుదలైన ప్రోమోలో మళ్లీ కాజల్, షణ్ముఖ్ ల మధ్య డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా సన్నీ.. 'నేను గనుక ఫస్ట్ పొజిషన్ లో ఉంటే.. చివరివరకు ఇలానే ఉంటాను' అంటూ డైలాగ్ కొట్టాడు.
పొజిషనింగ్ గురించి నేనెప్పుడూ ఆలోచించనని మానస్ అన్నాడు. ఇంతలో శ్రీరామ్.. 'కొంతమంది యాటిట్యూడ్ అనుకోవచ్చు.. కొంతమంది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు.. కొంతమంది యారోగన్స్ అనుకోవచ్చు.. దీనంతటికీ సపోర్ట్ చేస్తున్నది జనాలని నేను ఫీలవుతాను' అని చెప్పాడు. ఆ తరువాత మానస్ ఫోర్త్ పొజిషన్ శ్రీరామ్ కి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. ఇంకా బెటర్ నెంబర్ ఇచ్చేవాడ్ని కానీ చిన్న పాయింట్ నచ్చలేదని అన్నాడు.
నేను గేమ్ ఇలా ఆడడం తప్పు అంటే డెఫినిట్ గా సిక్స్త్ పొజిషన్ తీసుకుంటానని షణ్ముఖ్ అన్నాడు. 'వన్ లో అయితే షణ్ముఖ్ ని చూడాలనుకుంటున్నా' అని సిరి డైలాగ్ వేసింది. దానికి శ్రీరామ్ 'నిన్ను నువ్ చూసుకోవా..?' అని అడిగాడు. లేదని చెప్పింది సిరి. ఆ తరువాత సిరి కంటే షణ్ముఖ్ కాస్త తక్కువ అని అతడికి టాప్ 6 ఇచ్చింది కాజల్. వెంటనే షణ్ముఖ్ వెళ్లి ఆ నెంబర్ దగ్గర నిలుచున్నాడు. దానికి కాజల్.. 'ఓవరాక్షన్ చేయకు' అని అనగా.. 'నువ్ ఇచ్చిన నెంబర్ నేను యాక్సెప్ట్ చేశాను' అని డైలాగ్ వేశాడు. 'నీ అర్హత సిక్సా..' అని కాజల్ అడగ్గా.. 'నువ్ 6 ఇచ్చావ్ నేను నుంచున్నా..' అన్నట్లుగా చెప్పాడు షణ్ముఖ్.
ఆ తరువాత కాజల్ వెళ్లి సన్నీతో డిస్కషన్ పెట్టింది. 'చూశావా కావాలనే కాజల్ ఇచ్చింది నేను 6లో ఉంటాను అంటున్నాడు. లేబెల్లింగ్ కి రెడీగా ఉంటాడు. నేను ఈ పాయింట్ చెప్పలేదని ఫీల్ అవుతున్నా' అంటూ చెప్పుకొచ్చింది.
Evariki ye place deserving oo order wise miru cheppandi #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/Uxk1JZaWJl
— starmaa (@StarMaa) December 6, 2021
Also Read: భీమ్... భీమ్... కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్టర్ చూశారా?
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా