Payal Rajput: బోల్డ్ వీడియో ఎఫెక్ట్... పాయల్‌ను అన్నీ వదిలేయమంటున్న తల్లి
రీసెంట్‌గా పాయల్ రాజ్‌పుత్ ఓ ఫొటోషూట్ చేశారు. బోల్డ్ ఫొటోషూట్ అది! ఆ సమయంలో తీసిన ఓ వీడియో ప్రజెంట్ వాట్సాప్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానిపై పాయల్ స్పందించారు.
![Payal Rajput: బోల్డ్ వీడియో ఎఫెక్ట్... పాయల్‌ను అన్నీ వదిలేయమంటున్న తల్లి Payal Rajput opens up about the leaked nip slip video Payal Rajput: బోల్డ్ వీడియో ఎఫెక్ట్... పాయల్‌ను అన్నీ వదిలేయమంటున్న తల్లి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/05/e3714b35e8893154e43b740e2b0c877e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
చౌకబారు, అసహ్యమైన కామెంట్లు చూసి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి భయపడ్డానని... ఆ కామెంట్లు తనపై ప్రభావం చూపించాయని పాయల్ రాజ్‌పుత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె ఓ ఫొటోషూట్ చేశారు. బోల్డ్ ఫొటోషూట్ అది. ఆ సమయంలో వీడియో తీసుకుని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేశారు. అయితే... ఆ వీడియో కాకుండా మరో వీడియో వాట్సాప్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పాయల్ వీడియోలో ఆమె ఎల్లో కలర్ సూట్ ధరించారు. అది తప్ప ఇంకేమీ వేసుకోలేదు. పైగా, సూట్ బటన్స్ తీసి బోల్డ్ ఫొటోషూట్ చేయడంతో అందాలు బయటపడ్డాయి. దాంతో విపరీతమైన కామెంట్లు, విమర్శలు చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. దాంతో పాయల్ ఆవేదన చెందారు. తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్స్ వీడియోలో నిప్ స్లిప్ లేదని, ఎవరో తన వీడియో లీక్ చేశారని ఆమె పేర్కొన్నారు. కొంతమంది మార్ఫింగ్ చేసి, డార్క్ చేసి ఇంకా కనపడేలా చేశారన్నారు.
"అది జస్ట్ నిప్ స్లిప్ మాత్రమే. దాన్ని ప్రజలు ఎందుకు పెద్దదిగా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. దాన్నో స్కాండల్‌గా చూడటం కంటే... నార్మల్‌గా ఉంచితే మంచిది. అమ్మాయిలను అలా ఎప్పుడూ చూడనట్టు ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు చూసిన తర్వాత... 'ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకు ఉందా?' అని ఆశ్చర్యపోయాను" అని పాయల్ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా కామెంట్లు తన కుటుంబ సభ్యులపై ఎఫెక్ట్ చూపించాయని... తన తల్లి అన్నీ వదిలేసి ఇంటికి వచ్చేయమని చెప్పిందని... అయితే ఇటువంటి చెత్త ట్రోల్స్, విమర్శలను ఎదుర్కొనే శక్తి తనకు ఉందని చెప్పినట్టు పాయల్ తెలిపారు.
View this post on Instagram
Also Read: సిరివెన్నెలకు నా ముద్దు, ఆర్జీవీ ఎమోషనల్ పోస్టు, పాట పాడి మరీ...
Also Read: సన్నీ-షణ్ముఖ్ చేతుల మీదుగా శ్రీరామ్ కు ఫైనలిస్ట్ ట్రోఫీ.. హౌస్ లో ఉండే అర్హత ప్రియాంకకు లేదా..
Also Read: 'సిరివెన్నెల' ఆఖరి పాట.. ఆ విషయం ఆయనకు ముందే తెలుసా..?
Also Read: పెళ్లికి ఆ హీరోలను, హీరోయిన్‌నూ దూరం పెట్టిన కత్రీనా...
Also Read: 'స్కైలాబ్' రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)