X

Vicky Kat wedding : పెళ్లికి ఆ హీరోలను, హీరోయిన్‌నూ దూరం పెట్టిన క‌త్రీనా...

కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లికి హాజరయ్యే అతిథులు ఎవరు? ఎవరికి ఆహ్వానాలు అందాయి? ఎవరికి అందలేదు?

FOLLOW US: 

కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ తమ పెళ్లికి హీరోలు సల్మాన్ ఖాన్, ర‌ణ్‌బీర్ క‌పూర్‌ల‌ను దూరం పెట్టారా? హీరోయిన్ కియారా అడ్వాణీనీ పిలవలేదా? అంటే... 'అవును' అని చెప్పాలి. కత్రీనా కైఫ్ పెళ్లికి సల్మాన్, ర‌ణ్‌బీర్ తప్పకుండా హాజరు అవుతారని అందరూ ఊహించారు. అనూహ్యంగా వాళ్లిద్దరికీ ఆహ్వానాలు అందలేదని తెలుస్తోంది. సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్ అయితే తమకు ఆహ్వానం లేదని స్పష్టంగా చెప్పారు. తాజాగా కియారా అడ్వాణీ కూడా తానూ విక్కీ - కత్రీనా పెళ్లి గురించి వినాన్నని, తనకు ఆహ్వానం లేదని వివరించారు.

కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ రిలేషన్షిప్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. కత్రీనా కెరీర్ ప్రారంభంలో సల్మాన్ అండదండలు ఆమెకు అవకాశాలు తెచ్చాయనేది బాలీవుడ్ టాక్. చెల్లెలు అర్పితా ఖాన్ పెళ్లి వేడుకలో 'ఖాందాన్ కోడల్ని చేద్దామని అనుకుంటే... కపూర్ అవుతానంటున్నావ్. కత్రీనా కపూర్' అని కత్రీనాను సల్మాన్ ఆట పట్టించాడని, అక్కడ ఉన్న గెస్టులు అందరూ నవ్వేసరికి... అక్కడి నుంచి కత్రినా కైఫ్ వెళ్లిపోయింది. ఇది 2014లో సంగతి. అప్పటికి సల్మాన్ ఖాన్‌తో కత్రీనా బ్రేకప్ అయ్యింది. ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో ప్రేమలో ఉంది. ఆ తర్వాత ర‌ణ్‌బీర్‌తో కూడా బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు విక్కీ కౌశల్‌ను కత్రీనా కైఫ్ పెళ్లి చేసుకోబోతోంది.

Also Read: కత్రీనా-విక్కీ పెళ్లి ఆ తేదీల్లోనే.. ఇదిగో కన్ఫర్మేషన్..

విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్ వివాహం ఈ నెల 7 నుంచి 9 మధ్య రాజస్థాన్ రాష్ట్రంలో జరగనున్న సంగతి తెలిసిందే. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అతిథుల జాబితా కూడా ఖరారు అయ్యింది. అందులో ఎవరున్నారు? ఎవరు లేరు? అంటే... కత్రీనా కైఫ్ మాజీ లవర్స్ సల్మాన్ ఖాన్, ర‌ణ్‌బీర్ క‌పూర్‌ ఫ్యామిలీలను పెళ్లికి పిలవలేదంట! 'లస్ట్ స్టోరీస్'లో విక్కీ కౌశల్, కియారా జంటగా నటించారు. ఆమెనూ పెళ్లికి పిలవలేదు. 'జగ్ జగ్ జీయో' కోసం హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ కియారా అడ్వాణీ శుక్రవారమే మాస్కో వెళ్లారని బాలీవుడ్ ఖబర్. ఈ లెక్కన కత్రీనా కైఫ్ పెళ్లికి వరుణ్ ధావన్ కూడా హాజరు కావడం లేదన్నమాట.

View this post on Instagram
 
A post shared by KIARA (@kiaraaliaadvani)

Also Read: అల్లు అర్జున్ పై ఎందుకింత ఆసక్తి..సమంత కోసం ఎందుకీ వెతుకులాట..
Also Read: పవన్ తో తమన్ ప్లాన్.. ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదేమో..
Also Read: ప్రభాస్ సినిమా కోసమే... హైదరాబాద్ వచ్చిన దీపికా పదుకోన్!
Also Read: స్కైలాబ్ రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!
Also Read: అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...
Also Read: 'బాలయ్య బాలయ్య.. ఇరగతీసావయ్యా..' బాబాయ్ పై ప్రేమ కురిపించిన కళ్యాణ్ రామ్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Kiara Advani katrina kaif salman khan Vicky Kaushal Ranbir Kapoor Vicky Kat Wedding Vicky Kaushal Katrina Kaif Wedding కత్రీనా కైఫ్

సంబంధిత కథనాలు

Samantha: పెళ్లి చేసుకుంటా... విడాకులు తీసుకుంటా... పెళ్లికి ముందే సమంత చెప్పింది!

Samantha: పెళ్లి చేసుకుంటా... విడాకులు తీసుకుంటా... పెళ్లికి ముందే సమంత చెప్పింది!

NTR: 'మావయ్య.. మీరు త్వరగా కోలుకోవాలి.. మళ్లీ రావాలి'.. యంగ్ టైగర్ ట్వీట్

NTR: 'మావయ్య.. మీరు త్వరగా కోలుకోవాలి.. మళ్లీ రావాలి'.. యంగ్ టైగర్ ట్వీట్

MoonKnight: ‘మూన్‌నైట్’ తెలుగు ట్రైలర్.. మార్వెల్ నుంచి ‘తికమక’ హీరో వచ్చేస్తున్నాడు!

MoonKnight: ‘మూన్‌నైట్’ తెలుగు ట్రైలర్.. మార్వెల్ నుంచి ‘తికమక’ హీరో వచ్చేస్తున్నాడు!

Ravanasura On Sets: రాత్రిపూట... 'రావణాసుర' పాలన... ఇంకా ఇంకా!

Ravanasura On Sets:  రాత్రిపూట... 'రావణాసుర' పాలన... ఇంకా ఇంకా!

Dhanush-Aishwarya: రజినీ ఇద్దరు కూతుళ్లదీ అదే బాట.. ఐశ్వర్య విడాకులపై సౌందర్య స్పందన ఇది.. 

Dhanush-Aishwarya: రజినీ ఇద్దరు కూతుళ్లదీ అదే బాట.. ఐశ్వర్య విడాకులపై సౌందర్య స్పందన ఇది.. 
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

AP Night Curfew: ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ... ఆంక్షల నుంచి వీటికి మినహాయింపు

AP Night Curfew: ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ... ఆంక్షల నుంచి వీటికి మినహాయింపు

'Google' Meets 'Zomato' wedding : గూగుల్‌మీట్‌లో పెళ్లి వేడుక.. జోమాటో విందు డోర్ డెలివరీ ! మరి కానుకలు ఎలా తీసుకున్నారో తెలుసా ?

'Google' Meets 'Zomato'  wedding :   గూగుల్‌మీట్‌లో పెళ్లి వేడుక.. జోమాటో విందు డోర్ డెలివరీ ! మరి కానుకలు ఎలా తీసుకున్నారో తెలుసా ?

INS Ranvir Explosion: ఐఎన్ఎస్ రణవీర్ నౌకలో పేలుడు... ముగ్గురు సిబ్బంది మృతి, 11 మందికి గాయాలు

INS Ranvir Explosion: ఐఎన్ఎస్ రణవీర్ నౌకలో పేలుడు... ముగ్గురు సిబ్బంది మృతి, 11 మందికి గాయాలు

Kiara Advani: బికినీలో కియారా.. మాల్దీవ్స్ బీచ్ లో ఫొటోలు.. 

Kiara Advani: బికినీలో కియారా.. మాల్దీవ్స్ బీచ్ లో ఫొటోలు..