Bheemla Nayak: పవన్ తో తమన్ ప్లాన్.. ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదేమో..
'తమ్ముడు' సినిమాతో మొదలుపెడితే 2018లో విడుదలైన 'అజ్ఞాతవాసి' వరకు చాలా సినిమాల్లో పవన్ పాటలు పాడారు. అందులో కొన్ని బిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ సింగర్ అవతారం ఎత్తబోతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగానే కానీ 24 క్రాఫ్ట్స్ లో చాలా విభాగాల్లో పని చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా సినిమాలు తీశారు. తన సినిమాలకు స్టంట్ కోఆర్డినేటర్ గా కూడా పని చేశారు. అంతేకాదు.. ఆయన నటించిన సినిమాల్లో పాటలు కూడా పాడారు. 'తమ్ముడు' సినిమాతో మొదలుపెడితే 2018లో విడుదలైన 'అజ్ఞాతవాసి' వరకు చాలా సినిమాల్లో పవన్ పాటలు పాడారు. అందులో కొన్ని బిట్ సాంగ్స్ ఉన్నాయి.
'అత్తారింటికి దారేది' సినిమాలో 'కాటమరాయుడా.. కదిరి నరసింహుడా..' సాంగ్ పవన్ కి మంచి పేరు తీసుకొచ్చింది. థియేటర్లో ఆయన వాయిస్ తో పాట వస్తుంటే ఫ్యాన్స్ కి పూనకాలే. ఆ తరువాత 'అజ్ఞాతవాసి' సినిమాలో 'కొడకా కోటేశ్వరరావు' అనే పాట పాడారు. సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వనప్పటికీ.. అనిరుధ్ కంపొజిషన్ లో పవన్ పాడిన పాట మాత్రం బాగా పేలింది.
ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ సింగర్ అవతారం ఎత్తబోతున్నారు. ప్రస్తుతం పవన్ 'భీమ్లానాయక్' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యాప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలానే కనిపించబోతున్నాయి. త్రివిక్రమ్ స్పెషల్ గా పవన్ కోసం కొన్ని సీన్స్ కూడా రాసినట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తోన్న ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. దానికి తగ్గట్లే ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇప్పటికే సినిమా నుంచి టైటిల్ సాంగ్ తో పాటు.. 'అంత ఇష్టం', 'లాలా భీమ్లా' లాంటి పాటలను విడుదల చేశారు. తాజాగా 'ఆడవి తల్లి మాట' అనే మరో సాంగ్ ను కూడా విడుదల చేశారు. వీటితో పాటు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది.
ఆ పాటను పవన్ కళ్యాణ్ తో పాడించడానికి తమన్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో ఓ కీలక సన్నివేశంలో ఈ పాట వస్తుందని సమాచారం. మొత్తానికి తమన్.. పవన్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా ఈ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నాడన్నమాట. మరి థియేటర్లో ఈ పాట ఎంత రచ్చ చేస్తుందో చూడాలి. రానా ఈ సినిమాలో మరో హీరోగా కనిపించనున్నారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ లాంటి తారలు సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: స్కైలాబ్ రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!
Also Read: బాలకృష్ణ... మహేష్... షూటింగ్‌కు రెడీ! ఎప్పుడు? ఎక్కడ? అంటే...
Also Read: రాజకీయ భీష్మాచార్యుడి మృతి తీరని లోటు.. రోశయ్యకు సినీ ప్రముఖుల సంతాపం
Also Read: అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...
Also Read: 'బాలయ్య బాలయ్య.. ఇరగతీసావయ్యా..' బాబాయ్ పై ప్రేమ కురిపించిన కళ్యాణ్ రామ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి