అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today march 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్ ను పారిపోమ్మన్న మనోహరి – పాప లేకుండా పోనన్న రణవీర్‌ 

Nindu Noorella Saavasam serial Today Episode march 18th: అంజును రణవీర్ ఎత్తుకెళ్లడం అమర్‌ చూడటంతో రణవీర్‌ అంజును వదిలేసి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode:  వాటర్‌ కోసం అంజు ఇంట్లోకి వెళ్లగానే.. వెనకాలే వెళ్లిన రణవీర్‌ అంజుకు మత్తు మందు చల్లి స్పృహ కోల్పోగానే అంజును ఎత్తుకుని కిచెన్‌లోంచి వెనక డోర్‌ నుంచి వెళ్లిపోతుంటాడు. అప్పుడే అమర్‌ ఇంట్లోకి రావడంతో అంజును కిచెన్‌లోనే వదిలేసి పారిపోతాడు రణవీర్‌. అమర్‌, రణవీర్‌ కోసం వెతుకుతాడు. అది గమనించిన రాథోడ్‌, భాగీ లోపలికి వస్తారు. అంజును చూసి షాక్‌ అవుతారు. 
రాథోడ్‌: ఏమైంది సార్‌ 
అమర్‌: రాథోడ్‌ ఆ రణవీర్‌ ఇంట్లోకి వచ్చాడు… అంజును కిడ్నాప్‌ చేయాలని ట్రై చేశాడు 
రాథోడ్‌: సొంత కూతురినే కిడ్నాప్‌ చేయాలని చూశాడా ఎంత ఘోరం సార్‌
అమర్‌: రణవీర్‌ భార్య సొంత కూతురినే అనాథ ఆశ్రమంలో వదిలేసింది అది ఇంకా ఘోరం కదా..? 
చాటు నుంచి మనోహరి వింటుంది. 
భాగీ: ఆ దుర్మార్గురాలు త్వరలోనే దొరుకుతుందండి.. తన పాపం పండే టైం వచ్చింది 
అమర్‌: తను ఎవరో మీకు తెలుసా..? 
రాథోడ్‌: అంటే రణవీర్‌ వైఫ్‌ను వెతుకుతున్నాం కదా..? ఆ రాక్షసి పాపం పండి త్వరలోనే దొరుకుతుందని మిస్సమ్మ అంటుంది సార్‌ 
మనోహరి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది. 
అమర్‌:  చూడండి అంజుకు ఇలా అయిందని బయట ఎవ్వరికీ తెలియనివ్వకండి పండగ డిస్టర్బ్‌ అవుతుంది.
భాగీ: మరి అంజు పరిస్థితి ఏంటండి హాస్పిటల్‌కు తీసుకెళ్దామా..? 
అమర్‌: అవసరం లేదు.. వాడు మత్తు మందు ఇచ్చినట్టు ఉన్నాడు.. కాసేపట్లో తను సృహలోకి వస్తుంది. అంతవరకు ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియనివ్వకూడదు 
అంటూ అంజును తీసుకుని కిచెన్‌ లోంచి వెళ్లిపోతాడు అమర్‌. మరోవైపు అమర్‌ నుంచి తప్పించుకుని కారు దగ్గరకు వెళ్తాడు రణవీర్‌. 
లాయర్‌:  ఏమైంది సార్‌.. పాప ఏమైంది.. 
రణవీర్‌: చేతికి చిక్కిన పిల్లను వాడు రావడంతో అక్కడే వదిలేసి వచ్చాను. వాడికి దొరక్కుండా తప్పించుకుని వచ్చాను.. 
లాయరు: మీరు తప్పించుకుని రాలేదు సార్‌ అమరేంద్ర దగ్గర ఇరుక్కుపోయారు.
రణవీర్‌: వాడు నన్ను చూడలేదు లాయరు 
లాయరు: కానీ పాప కోసం వచ్చింది మీరే అని అమరేంద్రకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది సార్‌ 
రణవీర్‌: తెలిస్తే ఏం చేస్తాడు… 
లాయరు: మీరు ఏ కలుగులో దాక్కున్నా వెతికి పట్టుకుంటాడు సార్‌ 
రణవీర్‌: పట్టుకుని ఏం చేస్తాడు.. వాడు నా కూతురిని అనాథ ఆశ్రమం నుంచి తీసుకెళ్లి ఎక్కడో దాచి పెద్ద తప్పు చేశాడు. ఆ కారణంగా ఆఫీసియల్‌గా నా మీద ఎటువంటి యాక్షన్‌ తీసుకోడు 
లాయరు: ఏంటి సార్‌ అమరేంద్ర గురించి తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు.. అమరేంద్ర ఆఫిసియల్‌ గా మాత్రమే కంట్రోల్‌ లో ఉంటారు సార్‌.. అన్‌ ఆఫీసియల్‌ గా ఏదైనా డీల్‌ చేయాల్సి వస్తే.. తనను మీరు తట్టుకోలేరు.. దేశ రక్షణ కోసం అమరేంద్ర రూల్స్‌ ను పక్కన పెట్టి ఎన్నో రిస్క్‌ ఆపరేషన్స్‌ చేశాడు. మీకు తెలియంది కాదు.. అమరేంద్రకు దేశమన్నా కుటుంబం అన్నా చాలా ఇష్టం సార్‌. మీరు తన ఫ్యామిలీని టచ్‌ చేశారు.. అమరేంద్ర  ఊరుకోరు సార్‌..
రణవీర్‌: అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు 
మనోహరి: పారిపో రణవీర్‌ 
రణవీర్, లాయరు షాక్‌ 
మనోహరి: వెంటనే ఇక్కడి నుంచి ఎయిర్‌ఫోర్ట్‌కు వెళ్లి దొరికిన ఫ్లైట్‌ పట్టుకుని కలకత్తాకు వెళ్లిపో.. అక్కడ ఉంటే జైళ్లో సేఫ్ గా ఉంటావు.. ఇక్కడుంటే అమరేంద్ర నిన్ను చంపేస్తాడు.. కారు స్టార్ట్‌ చేయ్ రణవీర్‌.. ఇంకా ఉన్నావేంటి..? బయలుదేరు
అంటూ మనోహరి భయంభయంగా చెప్తుంటే రణవీర్ మాత్రం పాప లేనిదో తాను కలకత్తా వెళ్లనని చెప్తాడు. దీంతో మనోహరి కోపంగా చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 


టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 12th: 'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
'గోదావరి' సీరియల్: గౌతమి సూసైడ్ ప్రయత్నం! కల్యాణ్‌కి అరెస్ట్ చేసే సాక్ష్యాలు లభ్యం!
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Nindu Manasulu Serial Today August 12th: నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
నిండు మనసులు: ప్రేరణ ఎదురుగానే డాక్టర్‌కి పులిహోర కలిపేసిన సిద్ధూ..! అది మామూలు గుండె కాదురా!
Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget