News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss 5 Telugu: సన్నీ-షణ్ముఖ్ చేతుల మీదుగా శ్రీరామ్ కు ఫైనలిస్ట్ ట్రోఫీ.. హౌస్ లో ఉండే అర్హత ప్రియాంకకు లేదా..

ఈరోజు ఎపిసోడ్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ గా గెలిచిన శ్రీరామచంద్ర సేఫ్ అని అనౌన్స్ చేశారు నాగార్జున. ఆ తరువాత సన్నీ-షణ్ముఖ్ చేతుల మీదుగా ఫైనలిస్ట్ ట్రోఫీను అందించారు. 

FOLLOW US: 
Share:
స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఫ్రైడే హైలైట్ ను చూపించారు. అందులో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి లెన్స్ కార్ట్ కి సంబంధించిన ప్రమోషన్ టాస్క్ తో పాటు తాజ్ మహాల్ ఛాయ్ ప్రమోషన్ టాస్క్ ఇచ్చారు. 
 
బ్రేక్ ఫ్రీ టైం టాస్క్..: ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ తమతో తాము ఏకాంతంగా గడిపితే ఏం తెలుసుకుంటారో ఆ విషయాల గురించి మాట్లాడమని చెప్పారు. ముందుగా కాజల్ తన వాళ్లు లేకుండా ఉండలేననే విషయం తెలుసుకున్నానని చెప్పింది. 'నాకు చాలా ఓపిక ఉందని తెలుసుకున్నానని' షణ్ముఖ్ చెప్పాడు. 'నేనొక ఎమోషనల్ పెర్సన్ అని, డిపెండెంట్ అని తెలుసుకున్నానని' సిరి చెప్పింది. 'మనకి మనం పెర్ఫెక్ట్ అని కాన్ఫిడెన్స్ వచ్చేది అన్ని రకాలుగా చదువుకున్నప్పుడే అని నా ఫీలింగ్' అని సన్నీ చెప్పాడు. 'నీకేదైనా ప్రాబ్లెమ్ ఉంటే వెళ్లి ఎక్స్ ప్రెస్ చేయాలనే విషయాన్ని తెలుసుకున్నానని' మానస్ చెప్పాడు. 'గొడవ జరిగిన వెంటనే ప్యాచప్ చేసుకొని మంచి బాండ్ మెయింటైన్ చేయొచ్చని తెలుసుకున్నానని' శ్రీరామ్ చెప్పాడు. 
 
ఆ తరువాత హౌస్ మేట్స్ తో మాట్లాడారు నాగార్జున. ముందుగా వారి ముందొక కంప్లైంట్ బాక్స్ ను పెట్టారు. ఒక్కో హౌస్ మేట్ ని పిలుస్తూ.. ఎవరిపై కంప్లైంట్ చేస్తున్నారో, ఎందుకో చెప్పాలని అడిగారు నాగార్జున. ముందుగా సన్నీ.. సిరిపై కంప్లైంట్ చేస్తూ.. 'హౌస్ లోకి రాగానే ఫస్ట్ ఫ్రెండ్ అయింది. కానీ తరువాత ఇద్దరికీ పడలేదు. వెళ్లేలోపు మళ్లీ ఫ్రెండ్షిప్ బాండ్ క్రియేట్ అవ్వాలని' చెప్పాడు. ఈ వారం గేమ్ లో కూడా కోపంతో ఆడిందని, మొండిగా బిహేవ్ చేసిందని చెప్పాడు. 
 
ఆ తరువాత సిరిని ఎవరిపై కంప్లైంట్ చేస్తావ్ అని నాగార్జున అడగ్గా.. షణ్ముఖ్ వైపు చూపించింది. వెంటనే షణ్ముఖ్ 'అసలు నేనేం చేశా సార్' అంటూ పైకి లేవగా.. 'ఏం చేయడమేంటి..? తన(సిరి) కోసం సరిగ్గా ఆడకుండా, శ్రీరామ్ కోసం ఆడి' అని నాగ్ డైలాగ్ కొట్టారు. వెంటనే హౌస్ మేట్స్ అంతా నవ్వేశారు. నాగార్జున సిరితో మాట్లాడుతూ.. 'నువ్ ఫ్రెండ్ అయినందుకు సిగ్గుపడుతున్నా.. అని అన్నాడు కదా..' అంటూ షణ్ముఖ్ కి సెటైర్ వేశారు. 'అయినా నువ్ ఫ్రెండ్లీ హగ్ ఇస్తూనే ఉన్నావ్' అంటూ సిరికి డైలాగ్ కొట్టారు నాగార్జున. 
 
షణ్ముఖ్.. ప్రియాంకపై కంప్లైంట్ చేస్తూ.. 'తనను తాను తగ్గించుకొని పక్కవాళ్లను పైన పెడుతుందని' చెప్పాడు. ఆ తరువాత నాగార్జున.. ప్రియాంకపై తనకు కూడా ఓ కంప్లైంట్ ఉందని అన్నారు. హౌస్ లో ఈరోజు శ్రీరామ్ అనారోగ్యంగా ఉండడానికి కారణం పింకీ సొంత వైద్యమేనంటూ నాగ్ ఆమెకి క్లాస్ పీకాడు. 'సెల్ఫ్ మెడికేషన్ నీకు చేసుకోవద్దు.. పక్కవాళ్లకు కూడా చేయొద్దు' అని నాగ్ చెప్పేసరికి ప్రియాంక ఏడ్చేసింది. కావాలని అలా చేయలేదని.. మంచి ఉద్దేశంతో అతనికి నొప్పి తగ్గాలనే చేశానంటూ చెప్పింది. 
 
ఆ తరువాత ప్రియాంక.. సన్నీపై కంప్లైంట్ చేస్తూ 'గేమ్ లో తన బాల్స్ మొత్తం తీసేసుకున్నాడని' రీజన్ చెప్పింది. శ్రీరామ్ తనకు ఎవరి మీద కంప్లైంట్స్ లేవని చెప్పగా.. నాగార్జున మాత్రం తనకు శ్రీరామ్ పై ఓ కంప్లైంట్ ఉందని 'బల్బ్స్ టాస్క్ లో తన బదులుగా షణ్ముఖ్ గేమ్ ఆడుతున్నప్పుడు ఇండికేషన్స్ ఎందుకిచ్చావ్' అని నాగార్జున ప్రశ్నించారు. ఫ్లోలో వచ్చేసిందని చెప్పాడు శ్రీరామ్. కానీ అది తప్పని అన్నారు నాగార్జున. 
 
మానస్.. షణ్ముఖ్ పై కంప్లైంట్ చేస్తూ.. 'సన్నీకి ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా.. నీ ఫ్రెండ్ కి నువ్ చెప్పు అని నాకు చెప్తున్నాడు' అంటూ రీజన్ చెప్పాడు. అందులో తప్పు లేదని షణ్ముఖ్ చెప్పే ప్రయత్నం చేయగా.. 'హౌస్ మేట్స్ ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడుకోవాలి' అంటూ నాగార్జున అన్నారు. ఆ తరువాత మానస్ పై తనకొక కంప్లైంట్ ఉందని నాగార్జున అన్నారు. 'గేమ్ లో నీకు నువ్ బాగా కౌంట్ చేసుకున్నావ్.. కానీ సన్నీకి కౌంట్ చేసినప్పుడు ఎందుకలా చేశావ్' అని ప్రశ్నించారు. ప్రియాంక, కాజల్ లు కన్ఫ్యూజ్ చేశారని చెప్పాడు. 
 
ఆ తరువాత కాజల్.. సన్నీపై కంప్లైంట్ చేసింది. 'ఏమైనా మాట్లాడినా.. ఏదైనా చెప్పినా.. ఆత్రం, ఆత్రం.. ఆగు ఆగు అంటూ' తనపై అరుస్తున్నాడని కాజల్ చెప్పింది. దీంతో సన్నీ.. పోన్లే హర్ట్ అయింది కదా అని సారీ చెప్పడానికి రెడీ అయ్యాడు. 'సారీ చెప్పేసి.. టిష్యూ పేపర్ నీ ఫేస్ పై వేసిన విషయాన్ని కూడా మర్చిపో.. బాగా తుడిచి మరీ వేసింది' అంటూ నాగార్జున కామెడీ చేశారు. దీంతో కాజల్ 'Awww' అని అనగా.. నాగార్జున వెంటనే ఆమెని ఇమిటేట్ చేయగా.. హౌస్ మేట్స్ అంతా నవ్వేశారు. 
 
కాజల్ పై తనకొక కంప్లైంట్ ఉందని నాగార్జున చెప్పారు. 'ఫోకస్' టాస్క్ లో ఎందుకు హౌస్ మేట్స్ ని డిస్టర్బ్ చేశావని అడిగి.. ఇంకెప్పుడు అలా చేయొద్దని చెప్పారు. నిన్నటి టాస్క్ లో సిరి హెలికాప్టర్ సౌండ్ విని ట్రాక్టర్ అని రాయడంపై నాగార్జున ఫన్ చేశారు. 
 
శ్రీరామ్ సేఫ్..: అనంతరం.. హౌస్ మేట్స్ ముందు ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ పెట్టి.. 'నువ్ సేఫ్ అయితే ట్రోఫీ నీకు దక్కుతుంది లేదంటే లేదు' అంటూ శ్రీరామ్ ని ఉద్దేశిస్తూ నాగార్జున కామెంట్స్ చేస్తూ కనిపించారు. శ్రీరామ్ సేఫ్ అవ్వడంతో అతడికి సన్నీ-షణ్ముఖ్ చేతుల మీదుగా ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ ఇప్పించారు. 
 
ఎమోజీస్: 
  • 'పంచ్' ఎమోజీని సన్నీకి, 'షటప్' ఎమోజీను కాజల్ కి, 'యాంగ్రీ' ఎమోజీను ప్రియాంకకు ఇచ్చాడు శ్రీరామ్.
  • 'షటప్' ఎమోజీను కాజల్ కి, 'యాంగ్రీ' ఎమోజీను సిరికి, 'పంచ్' ఎమోజీను షణ్ముఖ్ కి ఇచ్చాడు సన్నీ.
  • 'యాంగ్రీ' ఎమోజీ కాజల్ కి, 'పంచ్' ఎమోజీను సిరికి, 'షటప్' ఎమోజీను ప్రియాంకకు ఇచ్చాడు షణ్ముఖ్.
  • 'పంచ్' ఎమోజీను సిరికి, 'యాంగ్రీ' ఎమోజీను సన్నీకి, 'షటప్' ఎమోజీను మానస్ కి ఇచ్చింది ప్రియాంక.
  • 'యాంగ్రీ' ఎమోజీను సిరికి, 'పంచ్' ఎమోజీను సన్నీకి, 'షటప్' ఎమోజీను ప్రియాంకకు ఇచ్చాడు మానస్.
  • 'పంచ్' ఎమోజీను శ్రీరామచంద్రకు, 'యాంగ్రీ' ఎమోజీను షణ్ముఖ్ కి, 'షటప్' ఎమోజీను సన్నీకు ఇచ్చింది కాజల్.
  • 'షటప్' ఎమోజీను సన్నీకు, 'పంచ్' ఎమోజీ షణ్ముఖ్ కి, 'యాంగ్రీ' ఎమోజీను ప్రియాంకకు ఇచ్చింది సిరి. 
ఫ్యామిలీ మెంబర్స్ ను కలవడానికి హౌస్ మేట్స్ త్యాగం చేసిన వస్తువులను తిరిగిచ్చేశారు బిగ్ బాస్. కానీ అందులో ప్రియాంక, సిరిలకు సంబంధించిన వస్తువులు లేవు. కొన్నిరోజుల క్రితం స్టేజ్ పైకి ఫ్యామిలీ మెంబర్స్ టాప్ 5 లో ఎవరి ఫోటోలైతే ఎక్కువగా పెట్టారో వాళ్లకు మాత్రం తిరిగి వస్తువులను పంపించారని.. ప్రియాంక, సిరి ఫొటోలు ఒకట్రెండు సార్లు మాత్రమే పెట్టారని నాగార్జున గుర్తుచేశారు. వాళ్ల వస్తువులను తిరిగి పంపించాలంటే హౌస్ మేట్స్ త్యాగం చేయాల్సి ఉంటుందని నాగార్జున చెప్పారు. 
 
హౌస్ మేట్స్ ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో.. వాళ్లకోసమే త్యాగం చేయాల్సి ఉంటుందని.. ఆ వస్తువులను తీసుకొచ్చి తులాభారంలో వేయాలని.. ఎవరి సైడ్ ఎక్కువ బరువు ఉంటుందో వాళ్లకు గిఫ్ట్ తిరిగొస్తుందని చెప్పారు. దీంతో అందరూ కలిసి సిరి గిఫ్ట్ తీసుకురావాలని అనుకున్నారు. ప్రియాంకకి సంబంధించింది మేకప్ సామాన్లే కదా.. అని అనుకున్నారు. కానీ నాగార్జున ఒక ట్విస్ట్ ఇచ్చారు. 'సిరి, ప్రియాంకలలో హౌస్ లో ఉండే అర్హత ఎవరికి ఉందో కూడా దృష్టిలో పెట్టుకొని వస్తువులను త్యాగం చేయాలని' చెప్పారు. దీంతో హౌస్ మేట్స్ ఆలోచనలో పడ్డారు. కొందరు సిరిని, మరికొందరు ప్రియాంకను సపోర్ట్ చేశారు. తులాభారం రెండు సైడ్స్ ఈక్వెల్ గా ఉండడంతో హౌస్ మేట్స్ కి మరో ముప్పై సెకన్లు టైమ్ ఇచ్చారు. దీంతో షణ్ముఖ్ తనకు సంబంధించిన మరిన్ని వస్తువులు తులాభారంలో వేసి సిరిని గెలిపించాడు. దీంతో ఆమెకి తన సాక్రిఫైజ్ చేసిన గిఫ్ట్ ను తిరిగి పంపించారు.  
 
Published at : 04 Dec 2021 10:56 PM (IST) Tags: Kajal priyanka Bigg Boss 5 Telugu Bigg Boss 5 manas Shanmukh Sunny Sreeramchandra Bigg Boss 5 Telugu 91 Episode

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

Bigg Boss 7 Telugu: మోనితా బాధితులకు గుడ్ న్యూస్, ‘బిగ్ బాస్’ నుంచి శోభా శెట్టి ఔట్? క్షోభ పోతుందంటున్న హేటర్స్!

Bigg Boss 7 Telugu: మోనితా బాధితులకు గుడ్ న్యూస్, ‘బిగ్ బాస్’ నుంచి శోభా శెట్టి ఔట్? క్షోభ పోతుందంటున్న హేటర్స్!

Vasanthi Krishnan: హార్ట్ బ్రేకింగ్ న్యూస్ - ‘బిగ్ బాస్’ బ్యూటీ వసంతి ఎంగేజ్మెంట్, ఫొటోలు చూశారా!

Vasanthi Krishnan: హార్ట్ బ్రేకింగ్ న్యూస్ - ‘బిగ్ బాస్’ బ్యూటీ వసంతి ఎంగేజ్మెంట్, ఫొటోలు చూశారా!

టాప్ స్టోరీస్

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు