Chinmayi: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయవద్దని కొంతమంది గాయని చిన్మయిపై ఎందుకు నోరు పారేసుకుంటున్నారు? బదులుగా ఆమె ఏం చెప్పారు?
సమాజంలో అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియా ద్వారా గాయని చిన్మయి వెలుగులోకి తీసుకు వస్తుంటారు. తాజాగా ఎన్నారై పెళ్లి కొడుకులతో కొందరు ఎదుర్కొన్న సమస్యలను ఆమె వెలుగులోకి తీసుకు వస్తున్నారు.
"నేను అమెరికాలో మాస్టర్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నా. ఆల్రెడీ అక్కడ ఉద్యోగం చేస్తున్న నా సీనియర్ ఒకరికి ఫోన్ చేశా. 'వద్దు. అమెరికాకు అసలు రావద్దు. మిమ్మల్ని ఎవరూ పెళ్లి చేసుకోరు' అని అన్నాడు. ఎందుకు? అని అడిగితే 'ఇక్కడ ఉన్న అమ్మాయిలకు అన్నీ అయిపోయి ఉంటారు. సో, ఎవరు పెళ్లి చేసుకోరు. ఇండియాలో ఉన్న అమ్మాయిలను చేసుకుంటారు' అని చెప్పాడు. నేను షాక్ అయ్యాను. వెంటనే 'మేం మా సొంతంగా సెటిల్ అవ్వాలని వస్తున్నాం. మీలాంటి వాళ్లపైన బతకడం ఇష్టం లేదు' అని చెప్పాను. థాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేశా" - ఇదీ ఓ అమ్మాయి చిన్మయికి పంపిన స్టోరీ. దానిని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అలాగే, తన చెల్లిని పెళ్లి చేసుకోవడానికి ఓ ఎన్నారై కోటి రూపాయల కట్నం డిమాండ్ చేశారని మరో అమ్మాయి పంపిన మెసేజ్‌ను కూడా చిన్మయి పోస్ట్ చేశారు.
View this post on Instagram
Also Read: హీరోయిన్‌కు రంగు తెచ్చిన సమస్య... దాన్నుంచి బయట పడటం కోసం!
ఎన్నారైల గురించి ఈ విధంగా పోస్ట్ చేయడం కొంతమందికి నచ్చలేదు. వాళ్లంతా కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. వాళ్లకు చిన్మయి గట్టిగా బదులిచ్చారు. "డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్ గురించి ఒక అవగాహనా సదస్సు ఉంది అనుకోండి. 'ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఇలా చేయండి, ఇలా చేయవద్దు' అని చెప్తారు. దాని అర్థం డ్రైవింగ్ చేసేవాళ్లు అందరూ తాగుతున్నారని కాదు. అలాగే, నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందరూ అలా కాదు. జనరలైజ్ చేయకే 'ల....' అని వాగక్కర్లేదు. వేరే అమ్మాయిలు వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలు నాకు చెబుతుంటే... అవి నేను చెబుతున్నాను. అమ్మాయిల తల్లితండ్రులు తమను ఎందుకు తక్కువ చేసుకుంటారో నాకు అర్థం కాదు. ఈ స్టోరీలు చూసి ఐదుగురు అమ్మాయిలు కట్నం ఇవ్వడానికి నిరాకరించినా నాకు చాలు. సిస్టర్స్ ఉన్న మగాళ్లు, ఇటువంటి పరిస్థితుల నుంచి వచ్చినవాళ్లు నాతో ఏకీభవిస్తారు" అని చిన్మయి పేర్కొన్నారు.
View this post on Instagram
Also Read: ఉపాసన చెల్లెలి పెళ్లికి తరలి వెళ్లిన మెగా కుటుంబం... దోమకొండలో భారీబందోబస్తు
Also Read: 'హరిహర వీరమల్లు'.. జాక్వెలిన్ అవుట్.. నర్గీస్ ఫక్రీ ఇన్..
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
Also Read: ఎవరి కప్పులు వారే చెత్తబుట్టలో వేయమని కోరిన అల్లు అర్జున్! ఎందుకంటే...
Also Read: అనసూయ ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ యాంకర్
Also Read: 'స్కైలాబ్' రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి