AA22xA6 Movie Update : బన్నీ, అట్లీ మూవీలో సాంగ్స్ ఎన్నో తెలుసా? - యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆన్ వర్క్స్
Allu Arjun : అల్లు అర్జున్, అట్లీ కాంబో పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ మ్యూజిక్ వర్క్స్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ కోసం సాంగ్స్ కంపోజ్ చేశారు.

Allu Arjun Atlee Movie AA22XA6 Update : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతోన్న పాన్ వరల్డ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీ కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... మ్యూజిక్ వర్క్స్‌పై కీలక అప్డేట్ వచ్చింది.
యంగ్ సెన్సేషన్
పాన్ వరల్డ్ మూవీకి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తుండగా... ఇప్పటికే వర్క్స్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. నాలుగు నుంచి 5 పాటలు కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్‌మెంట్ వీడియో తప్ప ఇప్పటివరకూ ఎలాంటి గ్లింప్స్ కానీ స్పెషల్ సర్ప్రైజ్ కానీ రాలేదు. త్వరలో ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలంటూ బన్నీ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఫస్ట్ లుక్ నుంచి సాంగ్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Also Read : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
స్టోరీ అదేనా?
సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ చూడని ఓ అద్భుతాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తుండగా... ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోతోనే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. సమాంతర ప్రపంచం, పునర్జన్మల కాన్సెప్ట్‌తో మూవీ తెరకెక్కుతుండగా... మూడు డిఫరెంట్ రోల్స్‌లో బన్నీ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకూ చూడని ఓ డిఫరెంట్ లుక్‌లో బన్నీ చూడబోతున్నట్లు రీసెంట్‌గా ఆయన లుక్స్‌ను బట్టి అర్థమవుతోంది.
నెగిటివ్ రోల్‌లో రష్మిక?
ఈ మూవీలో ఎంత మంది హీరోయిన్స్ అనేది ఇప్పటివరకూ క్లారిటీ లేదు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్‌ను అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు అట్లీ. ఆమె నటన అందరినీ కట్టి పడేస్తుందని... సినిమాలో సరికొత్త దీపికాను చూస్తారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు అట్లీ. ఇక మరో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందని తెలుస్తుండగా... నేషనల్ క్రష్ రష్మిక మూవీలో నెగిటివ్ రోల్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. మరి అందులో నిజం ఎంత అనేది క్లారిటీ లేదు. ఇప్పటికేే ఆ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. తాజాగా జోర్డాన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది టీం.
బిగ్ ఓటీటీ డీల్?
సినిమా షూటింగ్ జరుగుతుండగానే సూపర్ హిట్ కాంబో దృష్ట్యా ఈ ప్రాజెక్టుకు ఫుల్ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఓటీటీ డీల్ కోసం ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ భాషలకు కలిపి దాదాపు రూ.600 కోట్లకు డీల్ మాట్లాడుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే ఫైనల్ అయితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇదే రికార్డు అవుతుంది.
ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, స్టార్ కమెడియన్ యోగిబాబు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ దీపికా పదుకోన్ కీ రోల్ చేస్తున్నారన్న విషయం తప్ప అఫీషియల్‌గా ఏదీ కన్ఫర్మ్ చేయలేదు. త్వరలోనే ఏదైనా అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ మూవీని నిర్మిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
























