Tollywood: హీరోయిన్‌కు రంగు తెచ్చిన సమస్య... దాన్నుంచి బయట పడటం కోసం!
హీరోయిన్లకు కొన్ని సందర్భాల్లో రంగు సమస్య అవుతుంది. దాన్నుంచి బయట పడటం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రియాంకా జవాల్కర్‌ది అటువంటి కథే. రంగు గురించి ఆమె ఏం చెప్పారంటే...
'గమనం' సినిమాతో ఈ నెల 10న ప్రియాంకా జవాల్కర్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'టాక్సీవాలా', 'తిమ్మరుసు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం'... వరుసగా మూడు విజయాల తర్వాత ఆమె నటించిన చిత్రమిది. ఆ సినిమాల్లో కమర్షియల్ హీరోయిన్ తరహా పాత్రల్లో నటించారు. 'గమనం'లో ముస్లిం అమ్మాయిగా బురఖా ధరించి కనిపించనున్నారు. ఓ విధంగా ప్రయోగాత్మక పాత్ర అని చెప్పాలి. దీని గురించి ప్రియాంకా జవాల్కర్‌ను ప్రశ్నించగా... "నాకు డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంటుంది. ఈ సినిమా చూశాక... దర్శకులు నాకు వైవిధ్యమైన క్యారెక్టర్లు ఇస్తారని ఆశిస్తున్నాను. బేసిగ్గా నా రంగు చూసి... కమర్షియల్ హీరోయిన్ రోల్స్ ఇస్తున్నారు. నేను ఆఫ్ బీట్ రోల్స్ ట్రై చేస్తానని అంటే... 'మీరు తెల్లగా ఉన్నారండీ. మీరు ఈ టైప్ రోల్స్ చేస్తే బావుంటుంది' అని అంటారు. 'గమనం'తో మార్పు వస్తుందని ఆశిస్తున్నా" అని చెప్పారు.
'గమనం'కు వస్తే... మూడు కథల సమాహారంగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో శ్రియా శరణ్ ఓ పాత్ర చేశారు. ఆమెది ఓ కథ. శ్రియకు, తనకు మధ్య సన్నివేశాలు ఉన్నాయా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రియాంకా జవాల్కర్ ఇష్టపడలేదు. సినిమాలో చూడమని చెప్పారు. తన పాత్ర గురించి, సినిమాలో తనకు అవకాశం ఎలా వచ్చినదీ వంటి విషయాల గురించి ప్రియాంకా జవాల్కర్ మాట్లాడుతూ "సినిమాటోగ్రాఫర్, 'గమనం' నిర్మాతల్లో ఒకరైన జ్ఞానశేఖర్ గారు సంప్రదించారు. ముస్లిం అమ్మాయి పాత్ర కావడంతో లుక్ టెస్ట్ చేశారు. ఓకే అనుకున్న తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'లో నిత్యా మీనన్ పాత్రను రిఫరెన్స్ తీసుకున్నా. నా స్నేహితుల్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అందువల్ల, పెద్దగా ఇబ్బంది కాలేదు. అయితే... షూటింగ్ స్టార్ట్ చేసిన నాలుగు రోజులకు ఎలా చేయాలనేది క్లారిటీ వచ్చింది. నా పాత్రకు ఎక్కువ డైలాగులు లేవు. కళ్లతో హావభావాలు పలికించాను" అని చెప్పారు.
హీరో శివ కందుకూరి గురించి మాట్లాడుతూ "గతంలో శివతో నేను ఓ సినిమా చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల అది మిస్ అయింది. తను నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమాతో మా కాంబినేషన్ కుదిరింది. శివ ఫ్రెండ్ కావడం వల్ల... అతని ముందు సిగ్గు పడమంటే సిగ్గు వచ్చేది కాదు. క్యూట్ సీన్స్ కోసం కొంచెం ఇబ్బంది పడ్డాను" అని ప్రియాంకా జవాల్కర్ వివరించారు. నెట్‌ఫ్లిక్స్ తీయబోయే ఓ హిందీ వెబ్ సిరీస్ కోసం ఆడిషన్ ఇచ్చినట్టు చెప్పారు.
View this post on Instagram
Also Read: ఉపాసన చెల్లెలి పెళ్లికి తరలి వెళ్లిన మెగా కుటుంబం... దోమకొండలో భారీబందోబస్తు
Also Read: 'హరిహర వీరమల్లు'.. జాక్వెలిన్ అవుట్.. నర్గీస్ ఫక్రీ ఇన్..
Also Read: ఎవరి కప్పులు వారే చెత్తబుట్టలో వేయమని కోరిన అల్లు అర్జున్! ఎందుకంటే...
Also Read: అనసూయ ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ యాంకర్
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
Also Read: 'స్కైలాబ్' రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి