అన్వేషించండి

Nindu Manasulu Serial Today March 16th: నిండు మనసులు: ప్రేరణ వర్సెస్ గణ! అన్నతో అదిరిపోయే ఛాలెంజ్! తల్లికి షాక్ ఇచ్చిన సిద్ధూ!

Nindu Manasulu Serial Today March 16th సిద్ధూకి మెలకువ రావడం తల్లితో ప్రేరణకి ఏమైనా అయితే నేను బతికున్నా చచ్చినట్లే అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణని కాపాడబోయి సిద్ధూ ప్రమాదంలో పడతాడు. హాస్పిటల్‌లో ప్రాణాపాయంలో ఉన్న సిద్ధూని ప్రేరణ చూడటానికి వస్తే మంజుల ప్రేరణ మీద కోప్పడుతుంది. డాక్టర్ వచ్చి ప్రేరణ టైంకి తీసుకొచ్చి.. రక్తం ఇచ్చిందని చెప్తారు. ప్రేరణ ఏడుస్తూ సిద్ధూ విషయంలో నేను ఏ తప్పు చేయలేదు ఆంటీ.. కావాలనే మీ మనసు ఎవరో మార్చుతున్నారు. దయచేసి వాళ్ల మాటలు నమ్మొద్దు అని అంటుంది. 

మంజుల కోపంగా నేను ఇప్పుడు ఎవరి మాటలు నమ్మే పరిస్థితిలో లేను.. ఏం జరుగుతుందో మొత్తం చూస్తున్నాం కదా అంటుంది. ఒక్కోసారి మన కళ్లు కూడా మనల్ని మోసం చేస్తాయి. అప్పుడు మనసుతో ఆలోచించాలి అని ప్రేరణ రిక్వెస్ట్ చేస్తుంది. మా అన్నయ్యని అమ్మ నవమాసాలు మోసి ప్రాణం పోస్తే నువ్వు రక్తం ఇచ్చి ప్రాణం పోశావ్ నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని సాహితి ఏడుస్తూ చెప్తుంది. నువ్వు కాదు సాహితి నేను సిద్ధూకి చాలా రుణపడిపోయాను.. కనీసం ఇలా అయినా రుణం తీర్చుకొనే అవకాశం వచ్చింది అని అంటుంది. నేను ఇక్కడే ఉండటం ఆంటీకి ఇష్టంలేదు.. సిద్ధూ క్షేమంగా ఉందని తెలిసింది కదా.. నేను వెళ్తాను ఏం కావాలన్న వెంటనే కాల్ చేయ్ కుమార్ వచ్చేస్తా అని ప్రేరణ అంటుంది. 

ఐశ్వర్య, ఇందిర రాజశేఖరం కోసం గణ ఇంటికి వెళ్తారు. గణ, ఈశ్వరిలు ఆయన్ను చూడటం కుదరదు వెళ్లిపోండి అని అంటారు. ఎందుకు వెళ్లాలి అని ఐశ్వర్య తిరగబడుతుంది. మా ఆయన్ని మీ ఆయన అంటే చెంప పగలగొడతా అని ఈశ్వరి ఇందిరను అంటే ఏదీ కొట్టు చూస్తా అని ఐశ్వర్య అంటుంది. ఇప్పుడు మేం నిన్ను కొడితే ఎవడికి చెప్పుకుంటావే అని గణ అంటే మా నాన్నకి చెప్పుకుంటా అని ఐశ్వర్య అంటుంది. మా నాన్న లోపలే ఉన్నాడు కదా.. ఇందాక మా అక్కని పెద్దోడా అన్నాడు అంటే నాన్నకి బాగు అయినట్లే కదా.. మర్యాదగా మా నాన్నని చూడనివ్వండి అని అంటుంది. నాన్న నాన్న అని ఐశ్వర్య, ఏవండీ అని ఇందిర పిలుస్తుంది. బయటకు నడుస్తావా మెడ పట్టుకొని గెంటేయాలా అని ఈశ్వరి అంటే ఒక సారి మా నాన్నని పిలవండి అప్పుడు ఎవర్ని గెంటేస్తాడో ఎవర్ని ఉంచుతాడో తెలుస్తుందని ఐశ్వర్య అంటే గణ ఇద్దరిని తోసేస్తాడు. అప్పుడే ప్రేరణ వచ్చి ఇద్దరినీ పట్టుకుంటుంది. సిద్ధూ బాబుకి ఎలా ఉందని ఇందిర అడిగితే ఇప్పుడు ఏం ప్రమాదం లేదు కంగారు పడకు అని అంటుంది. 

గణ దగ్గరకు వెళ్లి నువ్వేంట్రా నాన్నని చూడటానికి వస్తే దౌర్జన్యం అంటుంది. తను నాకు మాత్రమే నాన్న అని గణ అంటే ఇంకోసారి ఆ మాట అంటే చీరేస్తా.. ఏది  మా నాన్నని తీసుకురా చెప్తాను.. ఆయనే అన్నీ చెప్పేస్తారు,, అయినా నాన్నని చూడటానికి నిన్ను అడగటం ఏంట్రా మేమేం మాట్లాడుతాం అని అంటే గణ ఆపాలని చూస్తాడు. మా నాన్నని చూడటానికి వీళ్లేదు అంటే నువ్వు ఎవడ్రా ఆపడానికి అని అంటుంది. ప్రేరణ వాళ్లు రాజశేఖరాన్ని చూస్తామని అంటే ఈశ్వరి, గణ అడ్డుకుంటూనే ఉంటారు. ఆయనకు ఎప్పటిలాగే ఉంటే ఎందుకు మమల్ని చూడనివ్వడం లేదు అని ఇందిర అడుగుతుంది. నాన్న మనల్ని చూసి గుర్తు పడితే నిజం తెలిసిపోతుందని భయపడుతున్నారు అమ్మా.. అక్కా మనం నాన్నని చూద్దాం పద అని ఐశ్వర్య అంటుంది. అడుగు ముందుకు వేస్తే చంపేస్తా అని గణ అంటే ఏమైనా చేసుకో మేం మా నాన్నని చూస్తాం అని ఇద్దరూ లోపలికి వెళ్తారు.

మంజుల విజయానంద్‌కి కాల్ చేసి విషయం చెప్తే విజయానంద్ మనసులో సిద్ధూ చచ్చుంటే బాగున్ను అనుకుంటాడు. పైకి మాత్రం నేను బిజినెస్ పని మీద వచ్చేశా లేదంటే దగ్గరుండి చూసుకునే వాడిని అని అంటాడు. అంతా ప్రేరణ వల్లే ప్రేరణ కోసమే సిద్ధూ ఇదంతా చేస్తున్నాడని రెచ్చగొడతాడు. ప్రేరణ అని అరుస్తూ సిద్ధూ లేస్తాడు. మంజుల వాళ్లు చూసి పరుగున వెళ్తారు. ప్రేరణ వాళ్లు తండ్రి దగ్గరకు పరుగున వెళ్లి రాజశేఖరాన్ని లేపాలని చూస్తారు. ప్రేరణని పెద్దోడా అని మీరే కదా పిలిచారు ఇంతలోనే ఏమైంది అని ఏడుస్తారు. ప్రేరణ వాళ్లు ఎంత ఏడ్చినా రాజశేఖరం కదలడు మెదలడు.. ఈశ్వరి ప్రేరణ వాళ్లతో మీ కాకి గోల ఆపండి.. మీరంతా ఆయన మీద పడి ఎందుకు అలా ఏడుస్తున్నారు.. నడవండి బయటకి అని తిడుతుంది.

మీకు మా నాన్నకి ఎలాంటి సంబంధం లేదు.. అసలు మీరు ఎవరికి పుట్టారో మీ అమ్మకి అయినా తెలుసా అని గణ అంటే ఇంకోసారి మా అమ్మ గురించి తప్పుగా అంటే నీ అంతు చూస్తా అని ప్రేరణ అంటే తండ్రి ఎవరో తెలీని నీకే ఇంత పొగరు ఉంటే రాజశేఖరం కొడుకు అయినా నాకు ఎంత ఉండాలి అని గణ అంటాడు. మీరు కావాలనే మానాన్నకి మాకు దూరం చేయాలి అనుకుంటున్నావ్ కానీ మా నాన్నతో నిజం చెప్పిస్తా అని ప్రేరణ అన్నతో ఛాలెంజ్ చేస్తుంది. రేపే నాన్నని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తా.. తను నోరు తెరిచే వరకు నీ టైం.. తర్వాత అంతా నీ బ్యాడ్ టైం అని అంటుంది.

సిద్ధూ లేచి ప్రేరణ ఎక్కడ నేను తనని చూడాలి అని వెళ్లబోతే మంజుల ఆపుతుంది. ప్రేరణకి ఏమైనా అయింటే నేను బతికున్నా చచ్చినట్లే అని సిద్ధూ అంటాడు. మంజుల షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget