అన్వేషించండి

Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం

Jagadhatri Serial Today Episode August 19th: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. ఇంట్లోకి కోరలులేని పాములు కాకుండా విషం పాములు వచ్చాయని గుర్తించిన జగధాత్రి..ఆవిషయం కేదార్‌కు చెప్పడంతో వెళ్లి యువరాజును కాపాడతాడు. అప్పుడే కమలాకర్‌ వచ్చి ఇంట్లో వాళ్ల కోసం చావుకు కూడా వెనకాడకుండా వచ్చాడు చూడు వీడురా అసలైన వారసుడని అంటాడు. ఆ మాటలుకు యువరాజుకు కోపం వచ్చి బాబాయితో తాడోపేడో తేల్చుకుందామని వచ్చినా...అక్కడ యువరాజుపై కమలాకర్‌కు ఉన్న ప్రేమ చూసి ఆనందంతో కౌగిలించుకుంటాడు.
విషం పాములు గుర్తించిన జగధాత్రి
                              సుధాకర్‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం కోసం ఇంట్లోకి కోరలు లేని పాములు తీసుకొచ్చి యువరాజు ముందు వదిలిపెట్టాలని అనుకుంటారు. కానీ ఆదిలక్ష్మీ ఆ పాములుపట్టేవాడికి డబ్బులిచ్చి విషం ఉన్న పాములు ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది. సరిగ్గా  వాటిని యువరాజు ముందు వదిలిపెడతారు. యువరాజు నిజంగానే ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటుంటాడు. అప్పుడే ఆ పాములను చూసి సుధాకర్‌ కంగారుపడి కుర్చీలో నుంచి లేవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే అవి కోరలు తీయని విషం ఉన్న పాములని జగధాత్రి గుర్తిస్తుంది. అదే విషయం కేదార్‌కు చెప్పగానే...క్షణం ఆలస్యం చేయకుండా కేదార్‌ ఆ పాముల ముందుకు పరుగెత్తుకుని వెళ్తాడు. యువరాజును పిలుస్తున్నా చెవిలో ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకోవడం వల్ల అతనికి వినిపించదు. ఆ పాములు కాటువేయడానికి దగ్గరగా వస్తుండటంతో అందరూ కలిసి వచ్చి గట్టిగా అరుస్తారు. అప్పుడే కమలాకర్‌ కూడా వచ్చి పాములు ఎలా వచ్చాయని నిలదీస్తాడు. వీళ్లే మీ అన్నకు షాక్‌ ట్రీట్‌మెంట్ ఇస్తే కాళ్లు వస్తాయని ఆ పాములు తెప్పించారని వైజయంతి చెబుతుంది.
పాములు చూసి పరుగెత్తిన యువరాజు
                            అందరూ వచ్చి గొడవ చేయడంతో యువరాజు ఏంటని అడుగుతాడు. నీ ముందు ఉన్నవి నిజమైన పాములని చెప్పడంతో భయంతో తలుపువైపు పరుగెత్తుతాడు. ఆ పాములు యువరాజును కాటువేయడానికి దగ్గరగా రావడంతో కేదార్‌, జగధాత్రి వాటిపై రెండు బెడ్‌షీట్లు కప్పివేయడంతో అవి యువరాజును ఏం చేయలేకపోతాయి. దీంతో యువరాజు సురక్షితంగా  ఇవతలికి వస్తాడు. దీంతో కమలాకర్‌ యువరాజును తిడతాడు. పామును చూడగానే పారిపోయినవాడివి నువ్వు వజ్రపాటి వారసుడివి ఏంటిరా అని అంటాడు. ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడటానికి వచ్చాడు చూడు వీడురా అసలైన వారసుడని అంటాడు. వారసత్వం కోసం పాకులాడటం కాదని...నీ తెగువే నిన్ను గుర్తుస్తుందని తిడతాడు. దీంతో వైజయంతి కొడుకుని తీసుకుని వెళ్లిపోతుంది.
కమలాకర్‌ మాటలకు కరిగిపోయిన యువరాజు        
                              నాన్నకు కాళ్లు రావడం కోసం ప్రాణాలకు తెగించి మరీ నేను ప్రయత్నిస్తే...బాబాయి మాత్రం వాడికి సపోర్ట్ చేయడం ఏంటని యువరాజు మండిపడతాడు. ఇలాగే వదిలేస్తే ఆస్తిమొత్తం వాడికే రాసిచ్చినా ఇచ్చేస్తాడని అంటాడు.ఇప్పుడే వెళ్లి బాబాయితో తేల్చుకుంటానని వస్తాడు. అప్పుడే కమలాకర్‌ కూతురుని గట్టిగా మందలిస్తాడు. పాములపట్టేవాడి ఫోన్ నెంబర్‌ నువ్వే ఇచ్చావు అంటే వాడు నీకు బాగా తెలిసినవాడే అని నిలదీస్తాడు. నామీద యువరాజు కత్తి దూశాడన్న కోపంతో నువ్వే ఆ పాములుపట్టేవాడికి కోరలు తీయని పాములు ఇవ్వమని చెప్పావా అని అడుగుతాడు. నా కొడుకు యువరాజు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించావా అని అంటాడు. వాడు నా అన్న కొడుకు కాదని..నా కొడుకేనని అంటాడు.కోపంలో తండ్రీకొడుకులం వంద అనుకుంటామని....మళ్లీ కలిసిపోతామని అలాంటిది నువ్వు నా కొడుకు ప్రాణాలు తీయాలనుకున్నావా అని అంటాడు. ఆ మాటలు విన్న యువరాజు వచ్చి వాళ్ల బాబాయిని కౌగిలించుకుని సారీ చెబుతాడు. కోరలు తీయని పాములు ఇంట్లోకి రావడం వెనక ఆదిలక్ష్మీ హస్తం ఉందని ధాత్రి అనుమానపడుతుంది. పాములు పట్టే వాడికి ఫోన్ చేసి పది నిమిషాల్లో మా ఇంటికి రాకుంటే మీ ఇంటికి పోలీసులు వస్తారని బెదిరిస్తుంది. నీకు ఆ కోరలు తీయని పాములు ఇవ్వమని చెప్పింది ఎవరో చెబితే....వాళ్లు ఇస్తామన్న డబ్బులు కన్నా రెండు రెట్లు అధికంగా ఇస్తానని ఆశపెడుతుంది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget