Chiranjeevi: ఉపాసన చెల్లెలి పెళ్లికి తరలి వెళ్లిన మెగా కుటుంబం... దోమకొండలో భారీబందోబస్తు
ఉపాసన చెల్లెలు అనుష్పాల తాను ప్రేమించిన వ్యక్తిని నేడే పెళ్లాడబోతోంది. ఈ వేడుక దోమకొండలో జరగనుంది.
ఉపాసన ఒక్కగానొక్క చెల్లెలు అనుష్పాల. ఆమె కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంను ప్రేమించింది. వారి వివాహానికి కామినేని కుటుంబం అంగీకారం తెలిపి, వైభవంగా నిశ్చితార్థం కూడా నిర్వహించింది. శనివారం ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లితో ఒక్కటికానున్నారు. ఈ పెళ్లి వేడుక దోమకొండలోని గడికోటలో జరగనుంది. ఇప్పటికే అక్కడి పరిసరప్రాంతాలన్నీ పెళ్లికి పూలతో ముస్తాబైపోయాయి. ఉపాసన తల్లిదండ్రులు ఒకప్పుడు గడికోట సంస్థానధీశులు. అందుకే వారి పెళ్లిళ్లు అక్కడే నిర్వహిస్తారు.
ఈ పెళ్లికి చిరంజీవి కుటుంబసభ్యులు కూడా హాజరుకానున్నారు. ఇంకా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితమే హిజ్రాలు కొత్త జంటను ఆశీర్వదించడానికి కోటకు వచ్చారు. ఉపాసన కొన్ని రోజుల ముందే తనకు ట్రాన్స్ జెండర్ స్నేహితులు ఉన్నరని చెప్పారు. తన చెల్లి పెళ్లి సందర్భంగా వారిని ఇంటికి ఆహ్వానించి, ఆశీర్వాదాలు స్వీకరించారు. ప్రముఖ ట్రాన్స్ జెండర్ లక్ష్మీ నారాయణ త్రిపాఠి ఉపాసన మంచి స్నేహితులు. ఆమె చేతుల మీదుగానే తన చెల్లి వివాహ వేడుక మొదలైందని ఇన్ స్టా వేదికగా తెలిపారు ఉపాసన.పెళ్లికి ముందు పోచమ్మ పండుగను నిర్వహించనున్నారు. ఈ పండుగకు కామినేని కుటుంబ సభ్యులు, కొణిదెల కుటుంబ సభ్యులు తప్పకుండా వెళ్లనున్నారు. ఈ పండుగ గడికోటలోనే జరగనుంది.
వరుడు ఎవరంటే...
అనుష్పాల ప్రేమించి ఇబ్రహీంది చెన్నై. ఇది మతాంత వివాహం. కార్ రేసర్ అయిన ఇబ్రహీం-అనుష్పాల కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇబ్రహీం తండ్రి అక్బర్ ఇబ్రహీం కూడా సూపర్ రేసర్. ఆయన గతంలో ఇండియన్ ఫార్మలా 3 ఛాంపియన్ గా నిలిచారు. ఇబ్రహీం కూడా మంచి రేసర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక అనుష్పాల తమ కుటుంబ వ్యాపారాలను చూసుకుంటోంది. అపోలో సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది.
Also Read: అనసూయ ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ యాంకర్
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
Also Read: సిరివెన్నెలకు నా ముద్దు, ఆర్జీవీ ఎమోషనల్ పోస్టు, పాట పాడి మరీ...
Also Read: సన్నీ-షణ్ముఖ్ చేతుల మీదుగా శ్రీరామ్ కు ఫైనలిస్ట్ ట్రోఫీ.. హౌస్ లో ఉండే అర్హత ప్రియాంకకు లేదా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి