Nindu Noorella Saavasam Serial Today march 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీని నిలదీసని మనోహరి – ఇంట్లోంచి వెళ్లిపోతానన్న భాగీ
Nindu Noorella Saavasam serial Today Episode march 16th: తనకు సాయం చేయడం లేదని భాగీని తిడుతుంది మనోహరి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి చెప్పినట్టే హోళీ పండగ రోజు అంజును కిడ్నాప్ చేసేందుకు రెడీ అయి వచ్చి అమర్ ఇంటి ముందు నిలబడతాడు రణవీర్. పక్కనే ఉన్న లాయరు పిల్లలు ఇంట్లోకి వెళ్లారు ఇంకాసేపట్లో హోళీ సంబరాలు మొదలవుతాయి అని చెప్తాడు.
రణవీర్: సంబరాలు స్టార్ట్ అవ్వగానే.. నేను లోపలికి వెళ్లి అంజు పాపను ఎత్తుకొస్తాను
లాయరు: ఎలా సార్ అమర్ చూస్తే మిమ్మల్ని గుర్తు పడతారు కదా..?
రణవీర్: రంగుల పండుగలో రంగులు పూసుకుని వెళితే ఎవరు గుర్తుపడతారు లాయరు. ఈ హోళీ మనకు బాగా కలిసి వచ్చింది
లాయరు: సార్ అమరేంద్రను తక్కువ అంచనా వేయకండి.. బయటి నుంచి ఎవరు వచ్చినా ఈజీగా కనిపెట్టేస్తారు
రణవీర్: అందుకేగా ఇంకో సెటప్ కూడా రెడీ చేసి ఉంచాను
లాయరు: ఇంకో సెటపా ఏంటి సార్
రణవీర్: అటు చూడు అక్కడ ఒక వెహికిల్ ఉంది కదా..? అది మనదే అందులో కిడ్నాప్ కావాల్సిన అసలైంది ఉంది. దాంతోనే అంజును ఎత్తుకురాబోతున్నాను.
లాయరు: ఏంటి సార్ అది
రణవీర్: ముందే చెప్తే కిక్ ఏముంటుంది లాయరు.. నువ్వే చూస్తావుగా
లాయరు: సస్పెన్స్ ఎందుకు సార్ అసలు ఆ వెహికిల్ లో ఏముందో చెప్పొచ్చు కదా..?
రణవీర్: నేను చెప్పడం కన్నా నువ్వు చూస్తేనే బాగుంటుంది లాయరు.. జస్ట్ వెయిట్ అండ్ సీ
అని రణవీర్ చెప్పగానే.. లాయరు అదే వెహికిల్ ను చూస్తూ ఆలోచిస్తుంటాడు. కట్ చేస్తే.. ఇంట్లో మనోహరికి ఎదురైనా భాగీని తిడుతుంటుంది..
మనోహరి: యాదమ్మ చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను భాగీ నీ మీద నాక్కూడా డౌటు వస్తుంది భాగీ
భాగీ: నన్ను అనుమానిస్తున్నావా..? మనోహరి.. నిప్పు లాంటి నాలో తప్పులు వెతుకుతున్నావా..? ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను.. ఇప్పుడే వెళ్లిపోతాను.. ఏదీ ఎక్కడ నా బ్యాగు.. ఎక్కడుంది నా లగేజీ
మనోహరి: ఆగు భాగీ నేను నిన్ను వెళ్లిపోమ్మని చెప్పలేదు.. హెల్ప్ చేయమన్నాను.
భాగీ: కానీ నువ్వు నన్ను అనుమానిస్తున్నావు.. అవమానిస్తున్నావు ఇలాంటి చోట నేను ఉండలేను మనోహరి ఉండలేను.. నా వల్ల కాదు
యాదమ్మ: అయితే వెళ్లిపోండి మేడం.. మనోహరి గారు ఆవిడ తిప్పలు ఆవిడ పడతారు..
భాగీ: ( మనసులో) నా ఇంట్లోంచి నన్నే వెళ్లిపోమ్మంటున్నావా..? నీకు ఉందే..
మనోహరి: యాదమ్మ నువ్వు నోర్మూయ్ మధ్యలో జోక్యం చేసుకోకు
యాదమ్మ: ఏంటి మేడం.. భాగీ గారు లేకపోతే ఏంటి..? మీ ప్రేమను మీరు సెట్ చేసుకోలేరా..?
మనోహరి: ఇన్నేళ్లుగా గా ట్రై చేస్తున్నాను.. నా వల్ల అయిందా..? నా లవ్ సెట్ చేయడం భాగీ వల్లే అవుతుంది.
యాదమ్మ: ఆవిడ మీ ప్రేమను సెట్ చేయడం లేదు.. తన లైఫ్ సెట్ చేసుకుంటుంది.
అంటూ యాదమ్మ అనగానే.. భాగీ కోపంగా అనేశావా.? యాదమ్మ ఆ మాట కూడా అనేశావా..? అనుకుంటూ ఆవేశంగా మనోహరి నేను ఇక ఇక్కడ అసలు ఉండను.. వెళ్లిపోతాను అంటూ అటూ ఇటూ తిరుగుతుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















