Vicky Katrina Wedding: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
బాలీవుడ్ ప్రేమ జంట డిసెంబర్ 9న పెళ్లి పీటలెక్కబోతోంది. వీరి పెళ్లి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

మూడు రోజుల పెళ్లికి బాలీవుడ్ జంట కత్రినా-విక్కీ సిద్ధమయ్యారు. డిసెంబర్ 7 వ తేదీ నుంచి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. మొదటి రోజు సంగీత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. రెండో రోజు అంటే డిసెంబర్ 8న మెహెందీ వేడుక, డిసెంబర్ 9న మూడు ముళ్లతో ఒక్కటికానున్నారు. వీరి పెళ్లిపై భారీ వ్యాపార లావాదేవీలు కూడా జరగడం ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కత్రినా, విక్కీ పెళ్లికి వచ్చే బంధువులు, స్నేహితులకు చాలా ఆంక్షలు విధించినట్టు వార్తలు వచ్చాయి. వివాహ వేడుకకు సంబంధించి ఒక్క ఫోటో కానీ, వీడియో కానీ బయటికి రాకూడదని, సెల్ఫీలు తీసుకోకూడదని, పెళ్లి వేదిక ఫోటోలు కూడా బయటపెట్టొద్దని చెప్పారట. ఈ విషయంలో కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. పెళ్లికి వెళ్లి ఒక్క ఫోటో కూడా తీసుకోకుండా ఎలా వస్తాం అంటూ నిట్టూరుస్తున్నారు.
ఓటీటీ డీల్
పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటికి పోకుండా ఆంక్షలు పెట్టడంపై వ్యాపారపరమైన ఒప్పందం జరిగిందని సమాచారం. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కత్రినా-విక్కీల పెళ్లి ఫోటోలు, వీడియోలను ప్రసారం చేసేందుకు ఓ డీల్ కుదుర్చుకుందని తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా వంద కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందట. నిజానికి ఇది చాలా మంచి ఆఫర్. దాని వల్లే ఆంక్షలు పెట్టారని బాలీవుడ్ టాక్. అయితే దీనికి ప్రేమజంట ఓకే చెప్పిందా లేదా అన్నది ఇంకా తెలియలేదు. ఒకవేళ ఆ ఆఫర్ నచ్చి డీల్ జరిగితే మాత్రం వారి పెళ్లిని ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. సెలెబ్రిటీల పెళ్లి ఫోటోలు, వీడియోలు ఎదురు డబ్బులిచ్చి మరీ కొనుక్కునే సంస్థలు ఉన్నాయి. కత్రినా - విక్కీ ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియాలంటే రెండు రోజులు వేచి చూడాలి.
సర్వాంగ సుందరంగా ముస్తాబైన కోట...
వీరిద్దరి పెళ్లి రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో జరుగబోతోంది. చాలా లావిష్ గా వీరి వివాహం జరగనుంది. ఈ పెళ్లికి కొంతమందికే ఆహ్వానం అందింది. వారిలో టాలీవుడ్ హీరో వెంకటేష్ కూడా ఉన్నారని తెలుస్తోంది. గతంలో కత్రినా... సల్మాన్, రణ్ బీర్ కపూర్ తో ప్రేమలో ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చేసుకుంది.
Also Read: కన్నీళ్లు పెట్టుకున్న పూజా హెగ్డే... ఆలోచనలో పడ్డ ప్రభాస్!
Also Read: ఏపీలో వరద బాధితులకు టాలీవుడ్ స్టార్స్ సాయం...
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
Also Read: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















