News
News
వీడియోలు ఆటలు
X

The wrong swipe: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది

ముగ్గురు వైద్యులు కలిసి తెరకెక్కించిన సినిమా ‘ది రాంగ్ స్వైప్’. అది కూడా మొబైల్ ఫోన్‌తో తీశారు.

FOLLOW US: 
Share:

ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్... సినిమాకు ఈ ముగ్గురే ప్రధానం. ఆ ముగ్గురూ వైద్యులే అయితే... అదే ‘ది రాంగ్ స్వైప్’ సినిమా ప్రత్యేకత. డయాబెటిస్ వ్యాధికి చికిత్స చేయడంలో ఆరితేరిన చేయి డాక్టర్ రవికిరణ్‌ది. సినిమా మీద ఆసక్తితో అతను డైరెక్టర్ గా మారి చేసిన సినిమా ఇది. అంతేకాదు తనతో మరో ఇద్దరిని కూడా సినిమా రంగం వైపు నడిపించారు. ఈ సినిమా నిర్మాత ప్రతిమా రెడ్డి, హీరోగా నటించి ఉదయ్ రెడ్డి కూడా వైద్యులే. అందుకే ముగ్గురు వైద్యులు తీసిన సినిమాగా పాపులర్ అయింది ‘ది రాంగ్ స్వైప్’. దీనికోసం ఖరీదైన కెమెరాలు వాడలేదు. కేవలం వన్ ప్లస్ 6టి మొబైల్ ఫోన్ తో తీశారు. అది కూడా చాలా తక్కువ బడ్జెట్‌తో. ఈ సినిమా చూసిన పలువురు టాలీవుడ్ ప్రముఖులు మొబైల్ ఫోన్ తో చాలా చక్కగా సినిమా తీశారంటూ చాలా మెచ్చుకుంటున్నారు. డైరెక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ ‘ప్రశంసలు, వస్తున్న అవకాశాలను చూస్తుంటే తాము కూడా సినిమా రంగంలో రాణించగలం అన్న నమ్మకం వచ్చింది’ అని అన్నారు. 

రెండో సినిమాకు రెడీ...
కోదండ రామిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, మధుర శ్రీధర్ రెడ్డి వంటి సినిమా పెద్దలు తమ సినిమాను చూసినట్టు చెప్పారు రవికిరణ్. వాళ్లు సినిమాను చాలా మెచ్చుకున్నారని తెలిపారు. అందుకే తమ సినిమాను అందరూ ఆదరిస్తారన్న నమ్మకంతో రెండో సినిమా తీసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఈ సినిమా కూడా మొబైల్ ఫోన్‌తో తీస్తారట. ఈ సినిమాకు ‘6ఎమ్‌.పి’ అనే పేరు కూడా ఖరారు చేశారు.  వీరు తమ ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఒక పక్క సినిమాలు కూడా తీస్తున్నారు. వీకెండ్లలో షూటింగ్ చేస్తూ, మిగతా రోజులు వైద్యులుగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

Also Read: ఉపాసన చెల్లెలి పెళ్లికి తరలి వెళ్లిన మెగా కుటుంబం... దోమకొండలో భారీబందోబస్తు

Also Read: బాలయ్యతో ఆ సాయంత్రం అన్ స్టాపబుల్ అంటున్న ప్రిన్స్ మహేష్... ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు

Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి

Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్

Also Read: భీమ్... భీమ్... కొమ‌రం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్ట‌ర్ చూశారా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Dec 2021 09:11 PM (IST) Tags: The Wrong Swipe Three doctors Movie Movie with Mobile రి రాంగ్ స్వైప్

సంబంధిత కథనాలు

Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

టాప్ స్టోరీస్

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

TSLPRB: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు చివరి అవకాశం!

TSLPRB: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు చివరి అవకాశం!

Google AI Course: ఉచిత ఏఐ కోర్సులు అందిస్తున్న గూగుల్, పూర్తి చేసిన వారికి బ్యాడ్జ్‌లు

Google AI Course: ఉచిత ఏఐ కోర్సులు అందిస్తున్న గూగుల్, పూర్తి చేసిన వారికి బ్యాడ్జ్‌లు