Mahesh Babu: బాలయ్యతో ఆ సాయంత్రం అన్ స్టాపబుల్ అంటున్న ప్రిన్స్ మహేష్... ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
సినిమాల్లోనే కాదు బుల్లితెర షోలలో కూడా స్టార్ నటులు సందడి చేస్తున్నారు.
మహేష్ బాబు కేవలం సినిమాల్లోనే కాదు ప్రకటనలు, బుల్లి తెర షోలలో కూడా వినోదం పంచేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మొన్నటికి మొన్న జూ. ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి హాజరయ్యారు. ఇప్పుడు బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోలో పాల్గొన్నారు. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ సెలెబ్రిటీ టాక్ షో కు మంచి క్రేజే వచ్చింది. మహేష్ బాబు ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అన్ స్టాపబుల్ ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్ లు ప్రసారం అయ్యాయి. బాలయ్యా హోస్టింగ్‌ను ప్రేక్షకులు బాగానే ఎంటర్ టైన్ అవుతున్నారు. వచ్చిన అతిధులతో చమత్కారాలు, అడుగుతున్న ప్రశ్నలు... అంతా బాలయ్య మార్క్ కనిపిస్తోంది. అఖండ సినిమా విడుదలయ్యాక బాలయ్య ట్రెండింగ్ గా మారారు. దీంతో అన్ స్టాపబుల్ కు కూడా ప్రేక్షకుల సంఖ్య పెరిగింది.
మహేష్ బాబు ఎపిసోడ్ దిగ్విజయం పూర్తయ్యాక ఓ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చి పంపించారు. బాలయ్య చేతుల మీదుగా ఆ హ్యాంపర్ అందుకున్న ఫోటోను మహేష్ బాబు తన ఇన్ స్టా స్టేటస్ లో షేర్ చేశారు. ‘నా సాయంత్రం చాలా ఆనందంగా గడిచింది’ అంటూ ఎన్‌బీకే హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటో ట్రెండవుతోంది. వీరి ఎపిసోడ్ ఎప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ వేరే లెవెల్ ఉండడం ఖాయంలా కనిపిస్తోంది. నందమూరి అభిమానులతో పాటూ మహేష్ బాబు అభిమానులు కూడా దీన్ని చూస్తారు.
మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా 2022 ఏప్రిల్ 1న విడుదల కానుంది. నిజానికి ఈ సినిమాను సంక్రాంతికి విడుదలచేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది.
Also Read: ఉపాసన చెల్లెలి పెళ్లికి తరలి వెళ్లిన మెగా కుటుంబం... దోమకొండలో భారీబందోబస్తు
Also Read: అనసూయ ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ యాంకర్