IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Pushpa: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?

'పుష్ప'తో బాలీవుడ్‌కు ఇంట్ర‌డ్యూస్ అవ్వాల‌ని ప్లాన్ చేసిన అల్లు అర్జున్‌కు ఓ సమస్య వచ్చి పడింది. దాంతో 'పుష్ప' హిందీలో విడుదల అవుతుందా? లేదా? అనే చర్చ మళ్లీ మొదలైంది.

FOLLOW US: 

'పుష్ప: ద రైజ్' ట్రైలర్‌ను సోమవారం రాత్రి విడుదల చేశారు. తొలుత సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు విడుదల చేస్తామని చెప్పారు. టెక్నికల్ ఇష్యూస్ వలన ట్రైలర్ విడుదల ఆలస్యం అవుతుందని ఆరు గంటలకు కొన్ని నిమిషాల ముందు వెల్లడించారు. వారం రోజుల నుంచి డిసెంబర్ 6న ట్రైలర్ రిలీజ్ అని హడావిడి చేసి... తీరా సమయం దగ్గర పడిన తర్వాత వాయిదా వేయడం ఏమిటి? అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొందరు అసహనం వెళ్లగక్కారు. రాత్రి తొమ్మిది గంటలకు ట్రైలర్ విడుదల చేసిన తర్వాత గానీ ఏం జరిగిందనేది ఇండస్ట్రీ జనాలకు కూడా అర్థం కాలేదని సమాచారం.
'పుష్ప: ద రైజ్' ట్రైలర్ చూశారా? కేవలం సౌతిండియ‌న్ లాంగ్వేజెస్‌లో మాత్ర‌మే విడుదల చేశారు. హిందీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ కాలేదు. దాంతో ఎందుకు? అనే డిస్కషన్ మొదలైంది. 'పుష్ప'ను పాన్ ఇండియా లెవ‌ల్‌లో రిలీజ్ చేయాలని అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమాతో బాలీవుడ్‌కు ఇంట్ర‌డ్యూస్ అవ్వాల‌ని బన్నీ ఎప్పటి నుంచో ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అయితే... నిర్మాతలు పాన్ ఇండియా రిలీజ్ అనుకోక ముందు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్మేయడంతో తొలుత ఓ సమస్య వచ్చి పడింది. అది క్లియర్ చేసుకుని... డిసెంబర్ 17న హిందీలో కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. హిందీ హీరో, జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్‌ హిందీ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఆయనకు అల్లు అర్జున్ థాంక్స్ కూడా చెప్పారు. తీరా చూస్తే... హిందీ ట్రైలర్ రిలీజ్ కాలేదు.

టెక్నికల్ ఇష్యూస్ ట్రైల‌ర్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మా? సినిమాకు కూడా టెక్నికల్ ఇష్యూస్ ఎదురు అవుతాయా? అనే సందేహం ఇప్పుడు కొంతమంది అభిమానుల్లో నెలకొంది. అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతుందా? తప్పు ఎక్కడ జరుగుతుంది? అని బన్నీ ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. అల్లు కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... హిందీలో 'పుష్ప' రిలీజ్ పక్కా అట! ముంబైలో ఓ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారట. త్వరలో 'పుష్ప' హిందీ ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రష్మికా మందన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
Also Read: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది
Also Read: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్..
Also Read: పింకీకి బిగ్‌షాక్... మానస్‌ను తన పిల్లాడిలా చూసుకునేదాన్నంటూ ఏడుపు
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 07 Dec 2021 11:45 AM (IST) Tags: Allu Arjun Rashmika Mandanna Pushpa Sukumar Pushpa Movie Pushpa hindi release అల్లు అర్జున్‌ Pushpa Hindi Trailer

సంబంధిత కథనాలు

Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?

Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?

Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?

Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?

BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు

CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!

Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?