(Source: Poll of Polls)
BiggBoss5: పింకీకి బిగ్‌షాక్... మానస్‌ను తన పిల్లాడిలా చూసుకునేదాన్నంటూ ఏడుపు
బిగ్‌బాస్ 5 చివరి దశకు చేరుకుంటోంది. రెండు వారాల్లో విజేత ఎవరో తెలిసిపోతుంది.
బిగ్‌బాస్ 13వ వారం ఎలిమినేషన్లో ట్రాన్స్ జెండర్ ప్రియాంక బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఆమె ఇన్నాళ్లు ఇంట్లో ఎలా నెగ్గుకొచ్చిందో కూడా ఎవరికీ అర్థం కాలేదు. గత వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ రవిని ఎలిమినేట్ అయి ప్రియాంక సేవ్ అవ్వడం కూడా ప్రేక్షకుల షాక్ ఇచ్చింది. ఈ వారం పింకీ ఎలిమినేట్ అవ్వడంతో ఓ లవ్ ట్రాక్ కు బ్రేక్ పడినట్టయ్యింది.
హౌస్‌లోనుంచి ఎలిమినేట్ అయిన సభ్యులు నేరుగా అరియానా ‘బిగ్‌బాస్ బజ్’కు హాజరవుతారు. ప్రియాంక కూడా అరియానాతో ఆ ప్రోగ్రామ్ లో పాల్గొంది. ఆ ఎపిసోడ్ ప్రోమోను వదిలారు స్టార్ మా వాళ్లు. అందులో కూడా నోరు విప్పితే చాలు మానస్ పేరే మాట్లాడడం ప్రారంభించింది. ఆఖరికి విన్నర్ కూడా అతడే అవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. దాంతో పింకీకి గట్ట షాక్ ఇచ్చింది అరియానా. మానస్ - కాజల్ ప్రియాంక గురించి మాట్లాడుకుంటున్న వీడియోను చూపించింది. అది చూశాక బాధతో ఏడుపందుకుంది పింకీ.
నా పిల్లాడిలా చూశా...
ఆ వీడియో చూశాక చాలా ఎమోషనల్ అయింది పింకీ. వెంటనే అరియానా హత్తుకుంది. ‘మానస్ చాలా సారీ... నేను నీ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదు’ అంది. మానస్ ఎవరినైనా చదివి పక్కన పెట్టేస్తాడు అని అర్థమైంది, నాకు పిల్లలుంటే ఎలా చూసుకునేదాన్నో అతడిని అలా చూసుకున్నానంటూ బాధపడింది. అంతేకాదు లవ్ సింబల్ శ్రీరామచంద్రకు ఇచ్చింది, కాజల్ కు థంబ్ డౌన్ సింబల్ ఇచ్చి, మానస్ కు మాత్రం పంచ్ ఇచ్చింది. దీంతో అరియానా షాక్ అయ్యింది. ఎందుకలా అని అరియానా అడగ్గా ‘ఏదైనా ఉండే నాతోనే మాట్లాడొచ్చు’ కదా అంటూ సమాధానం చెప్పింది. కాజల్ గురించి మాట్లాడుతూ ఆమె ప్రతి గొడవను పెద్దది చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుందని చెప్పింది. షణ్ముక్ ను ఉద్దేశించి మాట్లాడుతూ సైలెంట్ కిల్లర్ అని చెప్పింది. ఈ ఎపిసోడ్ రెండు రోజుల్లో ప్రసారం అవుతుంది.
Also Read: టాప్ 6లో షణ్ముఖ్.. లేబెల్లింగ్ కి రెడీగా ఉంటాడని కాజల్ ఫైర్..
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి