NTR In Mumbai: చిన్నప్పుడు అజయ్ దేవగన్ బైక్ స్టంట్ చూస్తే.. అమ్మ తిట్టింది: ఎన్టీఆర్
ఇది మరో బాహుబలి కాదు.. కానీ, ఆ ఫీల్ తప్పకుండా ప్రేక్షకులు పొందుతారు: రాజమౌళి
RRR హిందీ ట్రైలర్ విడుదల కోసం.. ఎన్టీఆర్, రాజమౌళి గురువారం ముంబయి వెళ్లారు. అక్కడ నటులు అజయ్ దేవగన్, అలియాభట్‌తో కలిసి.. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘బాహుబలి సీరిస్ తర్వాత ప్రజలు.. మళ్లీ అలాంటి భారీ చిత్రాన్నే ఆశిస్తున్నారని తెలిసింది. కానీ, అలాంటి సినిమానే మనం మళ్లీ మళ్లీ తీయలేం. కానీ, వారి ఆలోచనలను లోతుగా చూస్తే.. వారు మరో ‘బాహుబలి’ని కోరుకోవడం లేదు. అలాంటి అనుభూతినిచ్చే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమాలో ఎలాంటి ఎమోషన్ ఉందో.. అలాంటి చిత్రాన్నే కోరుకుంటున్నారు. కానీ, ఆ విషయాన్ని వారు స్పష్టంగా చెప్పలేరు. అందుకే వారు అలాంటి చిత్రం కావాలని చెబుతారు. వారు ఏదైతే ఆశిస్తున్నారో.. అలాంటి ఎమోషన్స్, హైప్‌ను ఈ చిత్రం ద్వారా అందిస్తున్నాం. వారిని దృష్టిలో పెట్టుకొనే నేను RRR రూపొందించాను. ఏ సెక్షన్‌కు చెందిన ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చినా.. వారు సినిమాలో ఉన్న హీరోలను ఇమేజ్‌ను, ట్రాక్ రికార్డులను మరిచిపోతారు. ఒక గొప్ప అనుభూతి పొందుతారు’’ అని తెలిపారు.
అజయ్ దేవగన్‌తో కలిసి పనిచేయడంపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘‘ఆయనతో నన్ను పోల్చవద్దు. ఆయన సినిమాలు చూస్తూ ఎదిగినవాడిని. అప్పుడు.. ఇప్పుడు.. ఆయన అలాగే ఉన్నారు. చిన్నప్పుడు ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాలో ఆయన ఎంట్రీ సీన్‌లో రెండు బైకుల మీద కాళ్లు పెట్టి వచ్చే సీన్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. అదెలా సాధ్యం అనుకున్నాను. అలా చేయగలనా అనుకున్నాను. కానీ, అమ్మ వద్దు అంది. అది సినిమా. కేవలం అది సినిమాల్లో మాత్రమే సాధ్యం అని చెప్పింది. నేను మా తాత, బాబాయ్‌ల సినిమాలు చూశాను. కానీ, అలాంటి ఎంట్రీ మాత్రం ఎప్పుడూ చూడలేదు. అది చాలా క్రేజీగా అనిపించింది. ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆయన నాకు గురువులాంటివారు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ఎన్టీఆర్ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘‘ఎన్టీఆర్ మాట్లాడుతుంటే.. నేను చాలా ముసలోడిననే ఫీలింగ్ కలిగింది. మేమిద్దరం కలిసి చేసిన సన్నివేశాలు లేవు. కానీ, షూటింగులో ఎన్టీఆర్ నన్ను కలిశారు’’ అని తెలిపారు.
Also Read: RRR ట్రైలర్.. కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
"Obviously, a lot people will be expecting a same kind of film after #Baahubali. But we can't keep making same films. But the trick is...": @ssrajamouli#BollywoodHungama #RRRTrailer pic.twitter.com/QnvROAp3vg
— BollyHungama (@Bollyhungama) December 9, 2021
"Please don't compare me with @ajaydevgn. We grew up watching his films. He was our very own action superstar then and even now": @tarak9999#BollywoodHungama pic.twitter.com/ZhFdTwecIh
— BollyHungama (@Bollyhungama) December 9, 2021
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి