Venkatesh - Nandamuri Kalyan Ram: వెంకటేష్, కళ్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్... సంక్రాంతి 2027కి!
Anil Ravipudi New Movie: సంక్రాంతి 2026కి 'మన శంకర వరప్రసాద్ గారు'తో అనిల్ రావిపూడి హిట్ కొట్టారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాతో వస్తున్నట్టు తెలిపారు.

Anil Ravipudi next movie after Mana Shankara Vara Prasad Garu: బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకు వెళుతున్నారు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ హిట్టే. సంక్రాంతి 2026కి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 'మన శంకర వరప్రసాద్ గారు' తీసి భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే సినిమా ఏది? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా...
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిలది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలతో ఈ కాంబో ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. 'మన శంకర వరప్రసాద్ గారు'లోనూ వెంకీ మామ ప్రత్యేక అతిథి పాత్ర పోషించారు. సంక్రాంతి 2027కి మరోసారి వాళ్లిద్దరూ థియేటర్లలో సందడి చేసేందుకు రాబోతున్నారు.
వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా సినిమా తెరకెక్కిస్తున్నట్లు అనిల్ రావిపూడి అనౌన్స్ చేశారు. ''మొదటి వంద కోట్ల బొమ్మ కొట్టిన హీరో విక్టరీ వెంకటేష్ గారితో, మొదటిసారి బొమ్మ తీసే (దర్శకత్వం వహించే) అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారితో కలిసి 2027 మొదటి పండగ (అంటే సంక్రాంతి)కి మీ ముందుకు వస్తున్నాం'' అని అనిల్ రావిపూడి తెలిపారు.
మొదటి "వందకోట్ల బొమ్మ" కొట్టిన హీరో.. Victory @VenkyMama గారితో🔥
— Anil Ravipudi (@AnilRavipudi) February 26, 2026
"మొదటిసారి బొమ్మ" తీసే అవకాశం ఇచ్చిన హీరో @NANDAMURIKALYAN గారితో కలిసి 💥
2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం 😍😍😍#VenkyAnil5 #NKRxAR pic.twitter.com/WRVWdbQpbz
పండక్కి కలుద్దాం... వెంకీ మామ!
వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో ఐదో చిత్రమిది. తన దర్శకుడితో మరో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉందని, ప్రతిసారీ అనిల్ రావిపూడితో సినిమా అంటే సరదాగా పాజిటివిటీతో - స్వేఛ్ఛమైన వినోదంతో ఉంటుందని, ఈసారి తమతో నందమూరి కళ్యాణ్ రామ్ జాయిన్ కావడం స్పెషల్ అని వెంకటేష్ తెలిపారు.
Back again with my director @AnilRavipudi for #VenkyAnil5 🤗🤗🤗
— Venkatesh Daggubati (@VenkyMama) February 26, 2026
Every time we team up, it feels like coming back home full of fun, positivity, and pure entertainment! ❤️
Glad to have @NANDAMURIKALYAN join this journey making it special for all of us.. పండగకి కలుద్దాం!!… https://t.co/mCqMXCW10x
'పటాస్' తర్వాత మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తుండటం ఆల్రెడీ స్పెషల్ ఫీలింగ్ వచ్చిందని, ఈసారి వెంకటేష్ గారితో కలిసి సూపర్బ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేయబోతున్నామని, షూటింగ్ చేయడం కోసం ఎదురు చూస్తున్నానని నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
Reuniting with you after ‘పటాస్’ already feels special Anil 🤗
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) February 26, 2026
And this time, along with our dearest Victory @VenkyMama garu for a SUPERB ENTERTAINER 🔥🔥🔥
Can't wait to begin the shoot https://t.co/Y9IQADvDpN























